Advertisementt

'స్పైడర్‌' బ్యాలెన్స్ కి స్పీడ్ పెరిగింది..!

Sat 26th Aug 2017 11:19 PM
spyder,mahesh babu,romania,spyder movie  'స్పైడర్‌' బ్యాలెన్స్ కి స్పీడ్ పెరిగింది..!
Spyder Song Shoot Starts in Romania 'స్పైడర్‌' బ్యాలెన్స్ కి స్పీడ్ పెరిగింది..!
Advertisement
Ads by CJ

రొమేనియాలో సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ల 'స్పైడర్‌' పాట చిత్రీకరణ 

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్‌'. ఈ చిత్రానికి సంబంధించి బ్యాలెన్స్‌ వున్న పాట చిత్రీకరణ రొమేనియాలో ఆగస్ట్‌ 25న ప్రారంభమైంది. ఆగస్ట్‌ 31 వరకు ఈ పాట చిత్రీకరణ జరుగుతుంది. దీంతో టోటల్‌గా షూటింగ్‌ పార్ట్‌ పూర్తవుతుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్‌ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. 

సూపర్‌స్టార్‌ మహేష్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రూపిన్‌ సుచక్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఎన్‌.వి.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌. 

Spyder Song Shoot Starts in Romania:

Spyder Balance Song Shooting Start

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ