Advertisementt

ఆగస్ట్‌ 9, ఉదయం 9 గంటలకు కాస్కోండి..!

Wed 09th Aug 2017 06:11 PM
spyder,spyder teaser,mahesh babu,ar murugadoss,nv prasad  ఆగస్ట్‌ 9, ఉదయం 9 గంటలకు కాస్కోండి..!
Spyder Movie Second Teaser Release Date Fix ఆగస్ట్‌ 9, ఉదయం 9 గంటలకు కాస్కోండి..!
Advertisement
Ads by CJ

రీ-రికార్డింగ్‌లో సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ల 'స్పైడర్‌' 

సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ కాంబినేషన్‌లో ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎన్‌.వి.ప్రసాద్‌ నిర్మిస్తున్న భారీ చిత్రం 'స్పెడర్‌'. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల విడుదలైన టీజర్‌కి ప్రేక్షకుల నుంచి, అభిమానుల నుంచి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. కాగా, ఆగస్ట్‌ 9 మహేష్‌ పుట్టినరోజు. సూపర్‌స్టార్‌ మహేష్‌కి నిర్మాతలు ఠాగూర్‌ మధు, ఎన్‌.వి.ప్రసాద్‌, దర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాస్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ 'స్పైడర్‌' కొత్త టీజర్‌ను విడుదల చేస్తున్నారు. 

ఈ సందర్భంగా నిర్మాత ఎన్‌.వి.ప్రసాద్‌ మాట్లాడుతూ - ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టీజర్‌కి రికార్డు స్థాయిలో రెస్పాన్స్‌ వచ్చింది. ఆగస్ట్‌ 9 మా హీరో మహేష్‌ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 9 గంటలకు కొత్త టీజర్‌ను విడుదల చేస్తున్నాం. ఒక్క పాట మినహా షూటింగ్‌ పూర్తయింది. ఈ ఒక్క పాట చిత్రీకరణ ఆగస్ట్‌ 23 వరకు జరుగుతుంది. దీంతో టోటల్‌గా షూటింగ్‌ పార్ట్‌ పూర్తవుతుంది. ఆల్‌రెడీ డబ్బింగ్‌, రీకార్డింగ్‌ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దసరా కానుకగా సెప్టెంబర్‌ 27న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా 'స్పైడర్‌' చిత్రాన్ని విడుదల చేస్తున్నాం.. అన్నారు. 

సూపర్‌స్టార్‌ మహేష్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరిస్‌ జయరాజ్‌, సినిమాటోగ్రఫీ: సంతోష్‌ శివన్‌ ఎఎస్‌సి.ఐఎస్‌సి, ఎడిటింగ్‌: శ్రీకర్‌ప్రసాద్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: రూపిన్‌ సుచక్‌, ఫైట్స్‌: పీటర్‌ హెయిన్‌, సమర్పణ: ఠాగూర్‌ మధు, నిర్మాత: ఎన్‌.వి.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఎ.ఆర్‌.మురుగదాస్‌. 

Spyder Movie Second Teaser Release Date Fix:

Mahesh Babu Movie Spyder another Teaser release on his Birthday

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ