Advertisementt

ఈ 'దర్శకుడు' సినిమాకి క్లీన్ యు..!

Thu 27th Jul 2017 12:59 PM
darshakudu,sukumar,darshakudu movie censor details,hariprasad jakka,ashok,eesha  ఈ 'దర్శకుడు' సినిమాకి క్లీన్ యు..!
Clean U Certificate From Censor to Darshakudu Movie ఈ 'దర్శకుడు' సినిమాకి క్లీన్ యు..!
Advertisement
Ads by CJ

దర్శకుడు సెన్సార్ పూర్తి...ఆగస్టు 4న విడుదల 

వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్న క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి నిర్మించిన తొలిచిత్రం కుమారి 21 ఎఫ్ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సుకుమార్ నిర్మాతగా తన సొంత సంస్థలో నిర్మిస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం 'దర్శకుడు'. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై  బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అశోక్, ఈషా జంటగా హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలని పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికెట్ పొందింది. ఆగస్టు 4న ఈ చిత్రం విడుదల కానుంది. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..  ప్రేమకు, తపనకు మధ్య నలిగిపోయే ఓ దర్శకుడి ప్రేమకథ ఇది. స్వార్థపరుడైన  దర్శకుడు ప్రేమలో పడితే  ఏం జరుగుతుందనేది సినిమాలో ఆసక్తిని రేకెత్తిస్తుంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ సభ్యుల నుండి మంచి కాంప్లిమెంట్స్ రావడం ఎంతో సంతోషంగా వుంది. ముఖ్యంగా సెన్సార్ సభ్యుల్లో మహిళా సభ్యులు మంచి చిత్రం అంటూ అభినందించారు.  ఈ తరహా చిత్రాన్ని చాలా చక్కగా తెరకెక్కించారంటూ  క్లీన్ యు సర్టిఫికెట్ తో వారు మా యూనిట్ ని అభినందించడం మాకెంతో ఆనందాన్నిచ్చింది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 4న ప్రేక్షకులముందుకు తీసుకురానున్నాము...అని అన్నారు. 

అశోక్, ఇషా,పూజిత, నోయల్, నవీన్, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ అనుమోలు, ఎడిటింగ్: నవీన్‌నూలి, సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: 

Clean U Certificate From Censor to Darshakudu Movie:

Darshakudu Movie Censor Completed. August 4th Movie Release. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ