Advertisementt

మీనాబజార్ హైదరాబాద్ లో..!

Sat 22nd Jul 2017 10:02 PM
meena bazar,hyderabad,sunil kumar singh  మీనాబజార్ హైదరాబాద్ లో..!
Meena Bazar Shooting Updates మీనాబజార్ హైదరాబాద్ లో..!
Advertisement
Ads by CJ

సింగ్ సినిమాస్ బేనర్ పై నాగేంద్ర సింగ్ నిర్మాతగా, రానా సునీల్ కుమార్ సింగ్ దర్శకత్వం లో నిర్మిస్తున్న మీనాబజార్ డాట్ కామ్ చిత్రం తొలి షెడ్యూల్ ని హైదరాబాద్ లో, రెండో షెడ్యూల్ బెంగుళూరు, మైసూర్ లో ముగించుకుని, ఈ నెల 17  నుంచి హైదరాబాద్ లో తదుపరి షెడ్యూల్ జరుపుకోనుంది. ఈ షెడ్యూల్ లో రియలిస్టిక్ బజార్ల లో ఖర్చుకి వెనుకాడకుండా పలు కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. 

దర్శకుడు సునీల్ కుమార్ సింగ్ సినిమా ప్రోగ్రెస్ గురించి వివరిస్తూ, ఇప్పటికి నలభై  రోజుల షెడ్యూల్స్ లో రెండు పాటలు చిత్రీకరణతో పాటు, అరవై శాతం చిత్రం పూర్తయిందని, అందరు కొత్త ఆర్టిస్టులని తీసుకుని ప్రతి షెడ్యూల్ కి ముందు వాళ్ళతో వర్క్ షాప్ లు నిర్వహించి వాళ్ళ ద్వారా పాత్రలకవసరమైన సహజసిద్ధమైన అభినయాన్ని పొందడంలో సక్సెస్ సాధించామని, ఈ షెడ్యూల్ ముందు కూడా ఒక వారం పాటు వర్క్ షాప్ నిర్వహించామని వివరించారు. 

థియేటర్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చి, పలు ఇంటర్ నేషనల్ యాడ్ ఫిలిమ్స్ కి దర్శకత్వం వహించి ముంగారుమలై గోల్డెన్ స్టార్ గణేష్ తో ఒక భారీ కన్నడ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు సునీల్ కుమార్ సింగ్. మీనాబజార్ డాట్ కామ్  చిత్రాన్ని అనుకున్నదానికన్నా మిన్నగా రూపొందిస్తున్నారని నిర్మాత నాగేంద్ర సింగ్ తెలిపారు. 

ఈ చిత్రానికి సంగీతం - మణికాంత్ కర్రీ, సినిమాటోగ్రఫీ : Mathew రాజన్, మాటలు & పాటలు : గోపి కిరణ్, ఎడిటింగ్ : శ్రీకాంత్, కోరియోగ్రఫీ : అనీ, కల్పనా, సుజి, ఆర్ట్ : జెప్., కాస్ట్యూమ్ డేసిగ్నేర్ : ప్రియా సింగ్, ప్రొడక్షన్ మేనేజర్ : రవివర్మ అందిస్తుండగా మధుసూదన్, వైభవి జోషి, శ్రీజిత ఘోష్, సునీల్ కుమార్ సింగ్, రాజేష్, జీవా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.  

Meena Bazar Shooting Updates:

Meena Bazar dot com shooting in Hyderabad

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ