Advertisementt

'యుద్ధం శరణం' అంటున్న నాగచైతన్య..!

Mon 03rd Jul 2017 03:57 PM
naga chaitanya,yuddham sharanam movie,lavanya tripati,producer sai korrapati  'యుద్ధం శరణం' అంటున్న నాగచైతన్య..!
Naga Chaitanya Upcoming Movie 'Yuddham Sharanam' 'యుద్ధం శరణం' అంటున్న నాగచైతన్య..!
Advertisement
Ads by CJ

నాగ చైతన్య, లావణ్య త్రిపాఠి జంటగా వారాహి చలన చిత్రం పతాకంపై కృష్ణ ఆర్.వి.మారిముత్తు దర్శకత్వంలో రజిని కొర్రపాటి నిర్మిస్తున్న చిత్రానికి 'యుద్ధం శరణం' అనే టైటిల్ ను నిర్ణయించి నేడు ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. చిత్రీకరణ చివరి దశలో ఈ చిత్రం టీజర్ మరియు ఆడియో విడుదల తేదీలను కూడా నిర్ణయించినట్లు చిత్ర బృందం చెబుతోంది. 'పెళ్లి చూపులు' ఫేమ్ వివేక్ సాగర్ సంగీత సారథ్యం వహించనుండగా.. శత చిత్ర కథానాయకుడు శ్రీకాంత్ ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రను పోషిస్తున్నారు. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి మాట్లాడుతూ.. 'నాగచైతన్య కథానాయకుడిగా తెరకెక్కిన ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'యుద్ధం శరణం'. కథకి తగిన టైటిల్ ఇది. నాగ చైతన్య లుక్-యాటిట్యూడ్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. శ్రీకాంత్, రావు రమేష్‌‌లు కీలక పాత్రలు పోషించనున్నారు. అలాగే.. మురళీ శర్మ-రేవతీల పాత్రలు చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.

షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఉంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. జూలై 15న ఫస్ట్ టీజర్ ను విడుదల చేయనున్నాం. ఇదే నెలలో ఆడియోను విడుదల చేసి.. ఆగస్ట్ లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం. నాగ చైతన్య కెరీర్ లో బెస్ట్ ఫిలిమ్ గా 'యుద్ధం శరణం' నిలిచిపోతుందన్న నమ్మకం ఉంది అన్నారు. 

ఈ చిత్రానికి సమర్పణ: సాయి శివాణి, లైన్ ప్రొడ్యూసర్: కార్తికేయ, కథ: డేవిడ్ ఆర్.నాథన్, మాటలు: అబ్బూరి రవి, స్క్రీన్ ప్లే: డేవిడ్ ఆర్.నాథన్ - అబ్బూరి రవి, కళ: రామకృష్ణ, సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి, సంగీతం: వివేక్ సాగర్, నిర్మాణం: వారాహి చాలనచిత్రం, నిర్మాత: రజని కొర్రపాటి, దర్శకత్వం: కృష్ణ ఆర్.వి.మారిముత్తు.

Naga Chaitanya Upcoming Movie 'Yuddham Sharanam':

Naga Chaitanya and Lavanya Tripathi are releasing the first look poster of the movie 'Yuddham Sharanam', directed by Krishna R.Marimuthu, Producer by Sai Korrapati.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ