ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> TSFTV and TDC Chairman is Puskur Ram Mohan

టీఎస్‌ఎఫ్‌టీవీ అండ్‌ టీడీసీ చైర్మన్‌గా..!

TSFTV and TDC Chairman is Puskur Ram Mohan

టీఎస్‌ఎఫ్‌టీవీ అండ్‌ టీడీసీ చైర్మన్‌గా నియమితులైన పుస్కూర్‌ రామ్మోహన్‌కి దాసరి కిరణ్‌కుమార్‌ అభినందనలు!

తెలంగాణ స్టేట్‌  ఫిల్మ్, టీవీ అండ్‌ థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఎఫ్‌టీవీ అండ్‌ టీడీసీ) చైర్మన్‌గా ప్రముఖ నిర్మాత పుస్కూర్‌ రామ్మోహన్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రముఖ నిర్మాత దాసరి కిరణ్‌ కుమార్, కెమెరామెన్‌–నిర్మాత–దర్శకుడు ఎస్‌. గోపాల్‌రెడ్డి, నిర్మాతలు పి. సత్యారెడ్డి, లంకాల బుచ్చిరెడ్డి, ‘మల్టీడైమెన్షన్‌’ వాసు తదితర ప్రముఖులు ఆయన్ను కలసి అభినందనలు తెలియజేశారు.

ఈ సందర్భంగా దాసరి కిరణ్‌ కుమార్‌ మాట్లాడుతూ – 'తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఓ మంచి ఆలోచన కలిగిన వ్యక్తిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. టీఎస్‌ఎఫ్‌టీవీ అండ్‌ టీడీసీ చైర్మన్‌గా పుస్కూర్‌ రామ్మోహన్‌ నియామకం తెలుగు సినిమా అభివృద్ధికి ఎంతో దోహద పడుతుంది' అన్నారు.

Dasari Kiran Kumar congratulates Pushkur Rammohan who is appointed as chairman of TSFTV and TDC.

telangana state
tsftv and tdc chairman
puskur ram mohan
dasari kiran kumar