Advertisementt

'2.0' ప్రమోషన్ రేంజ్ ఏంటో తెలుసా?

Sun 25th Jun 2017 11:59 AM
rajinikanth,2.0 movie,shankar,lyca productions,world tour  '2.0' ప్రమోషన్ రేంజ్ ఏంటో తెలుసా?
2.0 Team Planned World Tour for Movie Promotion '2.0' ప్రమోషన్ రేంజ్ ఏంటో తెలుసా?
Advertisement
Ads by CJ

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, శంకర్‌ '2.0' ప్రపంచయాత్ర 

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, గ్రేట్‌ డైరెక్టర్‌ శంకర్‌ కాంబినేషన్‌లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్‌లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న '2.0' చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టుగానే ఇండియన్‌ సినిమాలోనే భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్‌ వాల్యూస్‌తో హాలీవుడ్‌ స్థాయిలో రూపొందుతున్న '2.0' చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ తమ మొదటి చిత్రంగా నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తుండగా, ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. 

ఈ చిత్ర విశేషాలను లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌ రాజు మహాలింగం తెలియజేస్తూ - షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం విఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ జరుగుతోంది. హాలీవుడ్‌ స్థాయి టెక్నాలజీతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అదే స్థాయిలో ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళాలని భావిస్తున్నాం. '2.0' చిత్రానికి సంబంధించిన ప్రచారంలో భాగంగా వరల్డ్‌ టూర్‌ ప్లాన్‌ చేశాం. దీనికి సంబంధించి ఓ వీడియోను కూడా విడుదల చేశాం. ఈ చిత్రాన్ని జనవరి 25న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నాం. దీపావళికి '2.0' ఫస్ట్‌లుక్‌ను, ప్రోమో టీజర్‌ను విడుదల చేసి, రజనీకాంత్‌గారి పుట్టినరోజున ట్రైలర్‌ రిలీజ్‌ చెయ్యాలని ప్లాన్‌ చేశాం. ఎ.ఆర్‌.రెహమాన్‌ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ ఆడియోను అక్టోబర్‌లో దుబాయ్‌లో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం...అన్నారు. 

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ సరసన ఎమీ జాక్సన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ విలన్‌గా ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో సుధాంశు పాండే, ఆదిల్‌ హుసేన్‌, కళాభవన్‌ షాజాన్‌, రియాజ్‌ ఖాన్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. 

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నిరవ్‌షా, సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, ఎడిటింగ్‌: ఆంటోని, సమర్పణ: సుభాష్‌ కరణ్‌, లైకా ప్రొడక్షన్స్‌ క్రియేటివ్‌ హెడ్‌: రాజు మహాలింగం, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శంకర్‌.

2.0 Team Planned World Tour for Movie Promotion:

Rajinikanth and Shankar's 2.0 Movie Promotion Details. LYCA Productions Planned World Tour for This Movie.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ