శివాజీ రాజా అధ్యక్షతన, నరేష్ ప్రధాన కార్య దర్శిగా మొట్ట మొదటి సారి ఏకగ్రీవంగా ఎన్నికైన `మా`తొలి వార్షిక సర్వ సభ్య సమావేశం (2017) ఆదివారం ఉదయం హైదరాబాద్ ఫిలి ఛాంబర్ లో జరిగింది. ఈ సందర్భంగా 'మా` చేసిన కార్యక్రమాలు.. భవిష్యత్త్ కార్యచరణ గురించి వివరించారు.
ఈ సందర్భంగా `మా` అధ్యక్షుడు శివా రాజా మాట్లాడుతూ, `నానోటి నుంచి ఒక మాట వచ్చిందంటే ఆ మాట నా వెనుక ఉన్న 26 మంది నోటి నుంచి వచ్చిన మాటే. మా బాడీ రాగానే ఫించను 25 శాతం పెంచుతాం అన్నాం. అది ఇప్పుడు నిరూపించుకున్నాం. గతంలో 34 మందికి 2000 రూపాయలను ఫించను వచ్చేది. ఈసారి మరో ఇద్దరిని కలిపి 36 మందికి 500 పెంచి 2500 ఫించను అందిచడం జరిగింది. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న 6 గురు సభ్యులకు ఒక్కొక్కరికి 25వేల రూపాయల చెక్ లను అందించాం. ఇది భారం అనుకోలేదు. అలాగే 5 గురు సభ్యులకు ఉచితంగా స్కూట్లర్లు ఇచ్చాం. గతంలో మా కుటుంబంలో ఎవరైనా చనిపోతే తక్షణ సహాయం క్రింద ఎంతో కొంత మొత్తం అందిచేవారు. ఈసారి ఆ పద్దతికి స్వస్తి పలికి తక్షణ సహాయంగా 2లక్షలు అందించడం జరుగుతుంది. వెల్ఫేర్ కమిటీ సర్వే ప్రకారం రెడ్ క్యాటగరీ లో ఉన్న సభ్యులకు ఉచితంగా మెడీ క్లైమ్ ఇన్సురెన్స్ కల్పించాం. ఈ కమిటీ ద్వారా సిసలైన బాధితులకు న్యాయం జరిగింది. అలాగే జాబ్ కమిటీని వెల్ఫేర్ కమిటీ లో భాగం చేయడం వల్ల సినిమా అవకాశాలు లేని నిరూత్సాహ కళాకారులకు న్యాయం జరిగింది. అలాగే ఈ రోజు రమాప్రభ, విజయ్ చందర్ లను సత్కరించాలనుకున్నాం. కానీ ఆ కార్యక్రమం వాయిదా వేశాం. ఇల్లు కట్టే మేస్ర్తీ (దాసరి నారాయణరావు) ఒక్కసారిగా చనిపోతే ఎలా ఉంటుందో? ఇండస్ర్టీ ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఉంది. రెండు వారల్లో ఆఫీస్ కు వస్తాను. సిల్వర్ జుబ్లీ పనులు మొదలు పెడదాం అన్నారు. ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించేవారు. ఆయన మృతి మనకి తీరనిలోటు. `మా` కు సొంతంగా భనవం ఏర్పాటు చేసుకోవాలి. మంత్రి తలసాని శ్రీనివాసయాద్ గారి సహకారంతో ముఖ్య మంత్రి కేసీఆర్ గారిని కలిసి స్థలం అడుగుదాం. సొంత భవనం ఏర్పాటయ్యే వరకూ శ్రమిద్దాం` అని అన్నారు.
`మా` ప్రధాన కార్యదర్శి వి.కె నరేష్ మాట్లాడుతూ, 'మా ఏర్పడికి ఈ ఏడాదికి 25 ఏళ్లు పూర్తవుతుంది. ఇలాంటి ఏడాదిలో మాకి పదవులు దక్కడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు వచ్చే ఏడాది ఘనంగా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. చిరంజీవి గారు, మోహన్ బాబా గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, మురళీ మోహన్ గారు, జయసుధ పలువురు పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమాలు చేస్తాం. రానా, మంచు లక్ష్మి కూడా అంకింత భావంతో పనిచేయడానికి ముందుకొచ్చారు. తమిళ, కన్నడ , మలయాళ భాషల నటులను కూడా ఈ వేడుకలకు తీసుకురావాలనుకుంటున్నా. వీలైతే బాలీవుడ్ నటులను కూడా తీసుకొస్తాం. అలాగే గోల్డోన్ జూబ్లీ, డైమండ్ జూబ్లీ, ప్లాటినమ్ జూబ్లీలతో మా సంతోషంగా సాగిపోవాలి. సిల్వర్ జూబ్లీ ఇయర్ కాబట్టి మెంబర్ షిప్ మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాం. రోజు కి 150,000లు పారితోషికం తీసుకునే వాళ్లంతా మా లో మెంబర్ షిప్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. సిల్వర్ జూబ్లీ కోసం చేసే సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా వచ్చే మొత్తంలో 10 శాతం రైతు సహాయనిధికి అందేలా నిర్ణయించాం` అని అన్నారు.
అలాగే `మా`సభ్యులు రాజీవ్ కనకాల, సుమ `మా` అసోసియేషన్ కు రెండు లక్షల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఈ సమావేశంలో పరుచూరి గోపాలకృష్ణ, వైస్ ప్రెసిడెంట్స్ ఎమ్.వి. బెనర్జీ ,కె.వేణు మాధవ్ , జాయింట్ సెక్రటరీ ఏడిద శ్రీరామ్, హేమ , కార్యవర్గ సభ్యులు ఏ.లక్ష్మీనారాయణ ( టార్జన్ ), ఏ. ఉత్తేజ్, అనితా చౌదరి, బి. గౌతం రాజు, సి. వెంకటగోవిందరావు, ఎమ్. ధీరజ్, పసునూరి శ్రీనివాసులు, గీతా సింగ్, ఎమ్. హర్ష వర్ధన్ బాబు, హెచ్. జయలక్ష్మి, ఎస్. మోహన్ మిత్ర, కొండేటి సురేష్, కుమార్ కోమాకుల, వి.లక్ష్మీకాంత్ రావు, ఎమ్. నర్సింగ్ యాదవ్, ఆర్. మాణిక్, నాగినీడు వెల్లంకి, సురేష్, మా సభ్యులు పాల్గొన్నారు.
ఈ సమావేశం ప్రారంభానికి ముందు మా సభ్యులు, సభ్యత్వం లేని వారు దర్శక రత్న దాసరి నారాయణ రావు మృతి పట్ల రెండు నిముషాలు మౌనం పాటించారు.
సమావేశం అనంతరం `మా` సభ్యలంతా కలిసి ఒకే బస్సులో దాసరి నారాయణరావు కార్యక్రమానికి హజరయ్యారు.