Advertisementt

'కాదలి' ఆడియో కేటీర్ అండ్ చరణ్ చేతులపై!

Wed 07th Jun 2017 10:17 PM
ktr,ram charan,kaadhali movie audio launch,dil raju,vanamali,producer and director pattabhi r chilukoori  'కాదలి' ఆడియో కేటీర్ అండ్ చరణ్ చేతులపై!
KTR and Ram Charan's Launches Kaadhali Movie Audio! 'కాదలి' ఆడియో కేటీర్ అండ్ చరణ్ చేతులపై!
Advertisement
Ads by CJ

కేటీయార్-రామ్ చరణ్ లు విడుదల చేసిన 'కాదలి' ఆడియో! 

పట్టాభి ఆర్. చిలుకూరి స్వీయ దర్శకత్వంలో అందరూ కొత్తవారితో ఆసక్తికరమైన ట్రైయాంగులర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న చిత్రం 'కాదలి'. 'రెస్పెక్ట్ హర్ ఛాయిస్' అనేది సినిమా బేసిక్ థీమ్. పూజా కె. దోషి, హ‌రీశ్ క‌ల్యాణ్‌, సాయి రోణ‌క్‌, సుద‌ర్శ‌న్‌, మోహ‌న్ రామ‌న్‌, డా. మంజేరి ష‌ర్మిల‌, గురురాజ్ మానేప‌ల్లి త‌దిత‌రులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి ప్రసన్ ప్రవీణ్ శ్యామ్ సంగీత సారధ్యం వహించారు. ఈ చిత్రం ఆడియో విడుదల వేడుక మంగళవారం హైద్రాబాద్ లోని పార్క్ హయత్ లో పలువురు సినిమా మరియు రాజకీయ నాయకుల సమక్షంలో ఘనంగా జరిగింది. 

ఈ కార్యక్రమంలో తెలంగాణా ఐ.టి శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారకరామారావు (కేటీయార్), మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, నిర్మాత దిల్ రాజు, దర్శకులు దశరధ్ మరియు 'కాదలి' చిత్ర బృందం పాల్గొన్నారు. 

మెగాపవర్ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్ 'కాదలి' ఆడియో బిగ్ సీడీ లాంచ్ చేయగా.. కేటీఆర్ ఆడియోను ఆవిష్క‌రించారు. సీడీ తొలి ప్రతిని నిర్మాత సురేష్ బాబు అందుకున్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 'ప‌ట్టాభి ఆర్‌. చిలుకూరి నా బాల్య మిత్రుడు. త‌న క‌ల ఈ సినిమా. పొలిటిక‌ల్ లీడ‌ర్స్ వ‌స్తే ఈ సినిమా అంతగా జ‌నాల‌కు ఎక్క‌ద‌నే ఉద్దేశంతో మేం చ‌ర‌ణ్‌ని పిలిచాం. పిల‌వ‌గానే వ‌చ్చారు చ‌ర‌ణ్‌. సినిమా చాలా బాగా వ‌చ్చింది. అంతా కొత్త‌వారితో చేస్తున్న ఈ సినిమా చాలా రెఫ్రెషింగ్‌గా ఉంది. ట్రైల‌ర్ చాలా బావుంది. కొన్ని సినిమాలు ఇటీవ‌ల బాగా ఆడుతున్నాయి. పెళ్లిచూపులు లాంటివి బెంచ్ మార్క్ గా నిలుస్తున్నాయి. కంటెంట్ కింగ్‌ లాగా ఉంది. ఈ సినిమా కూడా పెద్ద హిట్ కావాల‌ని భావిస్తున్నాం. ప‌ట్టాభి పాతికేళ్ల క్రితమే సినిమా గురించి మాట్లాడేవాడు... సినిమాల్లో ఉండాల‌ని అనుకున్నాడు. ఐటీ ఇండ‌స్ట్రీ హైలో ఉన్న‌ప్పుడు ప‌ట్టాభి ఆ రంగాన్ని వ‌దులుకుని ఈ రంగంలోకి వ‌చ్చారు. వెంక‌టేశ్‌గారికి ప‌ట్టాభి చాలా పెద్ద ఫ్యాన్‌. ప‌ట్టాభి సురేష్ బాబు ఆఫీసుకి ఒక ఉత్త‌రం రాస్తే పిలిచి అవ‌కాశ‌మిచ్చారు. సురేష్ గారు డిస‌ర్వ్ అప్లాజ్‌.. దిల్‌రాజుగారు, సురేష్ గారు ఎప్పుడు క‌లిసినా ప‌రిశ్ర‌మ‌ను ముందుకు తీసుకెళ్లాల‌ని మాట్లాడుతుంటారు. 'బాహుబ‌లి 2' తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచానికి చాటింది. కేలిఫోర్నియాలో లోక‌ల్ గేమింగ్ కంపెనీ వాళ్లు ఆ సినిమా గురించి మాట్లాడ‌టం గ్రేట్‌. ఒక దేశానికి ఒక ట్యాక్స్ అనేది మంచిదే. కానీ సంస్కృతి, స్వ‌రూపాలు అనేవి కాపాడుకోవాలంటే 28 శాతం పెడితే కుద‌ర‌ద‌ని చాలా మంది అంటున్నారు. ఈ మ‌ధ్య క‌మల్‌హాస‌న్‌గారు కూడా దీని గురించి చెప్ప‌డం విన్నాను. ద‌క్షిణాది ప‌రిశ్ర‌మ‌ల‌న్నీ క‌లిసి అరుణ్‌జైట్లీగారిని క‌లుద్దాం' అన్నారు. 

రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'దాస‌రిగారు చ‌నిపోయిన త‌ర్వాత జ‌రుగుతున్న పెద్ద ఫంక్ష‌న్ ఇది, మిస్ యూ దాస‌రిగారు. ఈ సినిమా విష‌యానికి వ‌స్తే న‌న్ను ఈ కార్య‌క్ర‌మానికి పిలిచిన కేటీఆర్‌గారికి ధ‌న్య‌వాదాలు. సురేష్ గారు జీఎస్‌టీ గురించి చెప్ప‌గానే స్పందించినందుకు కేటీఆర్‌గారికి ధ‌న్య‌వాదాలు. నా కెరీర్‌లో మోస్ట్ ఫేవ‌రేట్ చిత్రం నా కెరీర్‌లో ఆరంజ్‌. అలాంటి సినిమాను మ‌ర‌లా మ‌ర‌లా చేయాల‌ని అనుకుంటాను. అలాంటి క‌ళ‌, క‌ల‌ర్స్ ఉన్న ఈ సినిమా ఎక్కువ ఆద‌ర‌ణ పొందుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది. ప్యాష‌న్‌ని న‌మ్మి చేస్తున్న ప‌ట్టాభికి కంగ్రాట్స్. నా తొలి సినిమాలో కూడా నేను ఇంత బాగా చేయ‌లేదేమో. వాళ్లు అంత బాగా చేశారు' అన్నారు. 

ఆర్పీ ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ.. 'కొత్త‌వాళ్ల‌తో సినిమా అన‌గానే న‌టీన‌టులు ఎలా ఉంటారోన‌నే భావ‌న ఉంటుంది. కానీ ఈ సినిమాలో న‌టులు బావున్నారు. ప‌ట్టాభికి ఉన్న అనుభ‌వంతో అంద‌రి ద‌గ్గ‌ర నుంచి మంచి ఔట్‌పుట్ తీసుకుని ఉంటాడని భావిస్తున్నాను' అన్నారు. 

ద‌శ‌ర‌థ్ మాట్లాడుతూ.. 'ప‌ట్టాభికి మంచి అవ‌గాహ‌న ఉంది సినిమా ప‌రిశ్ర‌మ మీద‌. త‌ను ప‌రిశ్ర‌మ‌లోకి వ‌చ్చిన కొత్త‌ల్లో చాలా క‌లివిడిగా ఉండేవాడు. ఈ సినిమా సంగీతం బావుంది. ట్రైల‌ర్స్ చూస్తుంటే ప్రేమ‌దేశం సినిమా లాగా ఉంది' అన్నారు. 

సంగీత ద‌ర్శ‌కులు ప్ర‌స‌న్ ప్ర‌వీణ్ శ్యామ్‌ మాట్లాడుతూ.. 'ఇది మా రెండో సినిమా. మా తొలి చిత్రం మ‌లుపు. ప‌ట్టాభిగారు ఈ అవ‌కాశం ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది' అని అన్నారు.

సురేష్ బాబు మాట్లాడుతూ.. 'ప‌ట్టాభి ఎప్పుడూ న‌వ్వుతూ ఉంటాడు. త‌న అభిప్రాయాల‌ను క‌చ్చితంగా చెబుతాడు. ఈ సినిమా చాలా మంచి హిట్ కావాలి. మేం ఏం అడిగినా కేటీఆర్‌గారు చేస్తారు. జీఎస్‌టీ ప్రాబ్ల‌మ్ ఉంద‌ని గతంలో ఒకసారి చెప్పిన‌ప్పుడు వెంటనే అరుణ్ జైట్లీ ద‌గ్గ‌రికి తీసుకెళ్లారు. ఇప్పుడు సినిమాకి జీఎస్‌టీని 28 శాతానికి పెంచారు. దీని వ‌ల్ల ప్రాంతీయ భాషా చిత్రాలకు ప‌లు ఇబ్బందులు ఎదుర‌వుతాయి. ఈ విష‌యంలో పెద్ద‌, చిన్న చిత్రాల‌కు ఒకే ర‌క‌మైన శాతం కాకుండా, ప్రాంతీయ చిత్రాల‌కు మ‌రోలా ఉంటే బావుంటుంది. తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ఎప్ప‌టినుంచో మ‌ద్ద‌తిస్తున్న కేటీఆర్‌గారు ఈ విష‌యంలోనూ స‌హ‌క‌రించాలి'. అని తెలిపారు.

దిల్‌రాజు మాట్లాడుతూ.. 'తెలుగు సినిమాకి త‌మిళ్ టైటిల్ పెట్టిన‌ప్పుడే అందులో ఏదో ఉంద‌ని అనిపిస్తుంది. 'హ్యాపీడేస్‌, పెళ్లి చూపులు' తరహాలో 'కాదలి' కూడా పెద్ద హిట్ అవ్వాలి' అన్నారు. 

వ‌న‌మాలి మాట్లాడుతూ.. 'సంగీత ద‌ర్శ‌కులు మంచి సంగీతాన్నిచ్చారు. ఆనంద్‌గారు ఈ సినిమాకు వెన్నెముక‌గా నిలిచారు. ఈ సినిమా త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది' అన్నారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర ప్రముఖులు 'కాదలి' మంచి విషయం సాధించి.. చిత్ర బృందానికి మంచి పేరు తీసుకురావాలని అభిలషించారు!

పూజ కె.దోషి, హరీష్ కళ్యాణ్, సాయి రోనక్, సుదర్శన్, మోహన్ రామన్, డా.మంజరి షర్మిల, గురురాజ్ మానేపల్లి, పల్లవి బానోతు, భాను అవిరినేని, సి.సురేష్ కుమార్, సంధ్యా జనక్, రమాదేవి ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, కొరియోగ్రఫీ: రాజు సుందరం-నోబెల్-శ్రీక్రిష్, పాటలు: వనామాలి, కాస్ట్యూమ్స్: ప్రియదర్శిని.టి, లైన్ ప్రొడ్యూడర్: పునాటి శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆనంద్ రంగా, కళ: వివేక్ అన్నామలై, ఎడిటర్: మార్తాండ్ కె.వెంకటేష్, సంగీతం: ప్రసన్ ప్రవీణ్ శ్యామ్, సినిమాటోగ్రఫీ: శేఖర్ వి.జోసెఫ్, రచన-నిర్మాణం-దర్శకత్వం: పట్టాభి ఆర్.చిలుకూరి.

KTR and Ram Charan's Launches Kaadhali Movie Audio!:

KTR-Ram Charan's release of 'Kaadhali' audio. Pranathi Srinivasa Rao, Executive Producer: Anand Ranga, Art: Vivek Annamalai, Editor: Vamsi-Shekhar, Choreography: Raju Sundaram-Nobel-Srikrish, Songs: Vanamali, Costumes: Priyadarshini.T, Line Producer: Marthand K Venkatesh, Music: Parson Praveen Shyam, Cinematography: Shekhar V.Josef, Written-Construction-Direction: Pattabhi R. Chuluk

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ