పురాణపండ శ్రీనివాస్ మహాగ్రంథాన్ని ఆవిష్కరించిన కేంద్రమంత్రి అశోకగజపతి రాజు
సింహాచలం అప్పన్నకు పరవశంతో సాయికొర్రపాటి అపురూప కనుక
సింహాచలం మహాక్షేత్రం వరాహలక్ష్మీ నరసింహస్వామివారి క్రీడావిలాసం, ఉగ్రనరసింహుడు ప్రసన్నుడై మమ్మల్ని అందరిని అనుగ్రహించిన పరమపావన స్థలమే సింహాచల పుణ్యక్షేత్రం. ఇటీవల సింహాచల దేవస్థానంలో సమవిష్ణులైన అర్చకులు, పండితులు ప్రశంశలు కురిపించిన ఉత్తమోత్తమ గ్రంథం పేరే 'నను గన్న నాతండ్రి'.
నరసింహుని మహిమలను మంత్రపూర్వకంగా తెలియజెప్పి భక్తపాఠకులకు సుఖసంతోషాల్ని ప్రసాదించే ఈ అపూర్వగ్రంథజాలాన్ని ధర్మచర విహీనుల్ని తూర్పారబట్టి 'నరసింహుడిని' శరణువేడెలా చేసింది.
హిందూపురం శాసన సభ్యులు, తెలుగు చలనచిత్ర అగ్రకథానాయకులు నందమూరి బాలకృష్ణ ఒక శుభవాహా దృష్టితో లోకకల్యాణ కారకంగా 'నను గన్న నాతండ్రి' గ్రంథాన్ని సమర్పకులుగా వ్యవహరించడం విశేషం. ధర్మప్రాప్తి, లక్ష్మీప్రాప్తి, ఆరోగ్యప్రాప్తి, సుఖప్రాప్తి, భయనివారణ, రుణానివారణ... ఇలా ఎన్నో వాంచితాలను నెరవెర్చే ఈ భోగోమోక్షప్రద గ్రంథాన్ని సింహాచలక్షేత్రానికి కైంకర్యం చేసిన బాలకృష్ణ, నిర్మాత సాయికొర్రపాటి జన్మను చరితార్థం చేసుకున్నారని ప్రధానార్చకులు గోపాలకృష్ణమాచార్యులు, శ్రీనివాసాచార్యులు మంగళాశాసనాలు చేశారు.
వరాహ లక్ష్మీనరసింహుని అమేయశక్తిని అనేకసార్లు దర్శించుకున్న ధాన్యాది ధన్యులైన వారాహి చలనచిత్రం అధినేతలు సాయికొర్రపాటి, శ్రీమతి రజిని కొర్రపాటి దంపతులు ఈ మంత్రశబ్దాల మహాగ్రంథానికి ప్రచురణ కర్తలు.
భయాలను తొలగించి నరసింహుని వరాలు కురిపించేలా ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ భక్తి ప్రపత్తులతో సర్వాంగ సుందరంగా, అద్భుతశైలి విన్యాసాలతో ఈ గ్రంథాన్ని రచించి సంకలనం చేశారు. లక్ష్మి నృసింహుల పాదపద్మాలను సమాశ్రయించడం వల్లనే ఇలాంటి పూజనీయ కార్యాలు సాధ్యం అవుతాయని ఈ గ్రంథంలో స్పష్టం చేశారు. ఈ పుస్తకానికి విస్తృతమైన ప్రాచుర్యం లభిస్తుందని, ఇది సర్వకార్య ప్రసాదిని అని సింహాచల వేదపండితులు ముక్త ఖంఠంతో ఆశీర్వదించడం మరో విశేషం.
ఈ రోజుల్లో ఒక ఐదువందల పైచిలుకు పేజీలు మహాగ్రంథాన్ని ఉచితంగా ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. అందులోను అమోఘమైన ముద్రణ, అరుదుగా లభించే ఎన్నెన్నో నరసింహ భగవానుని వర్ణచిత్రసంపదతో ప్రకాశిస్తోందీగ్రంథం. ఎవరికోలాహల కరతాళ ధ్వనుల కోసం సాయికొర్రపాటి ఈ పవిత్ర గ్రంథాన్ని ప్రచురించలేదు. తానె స్వయంగా వచ్చి దేవస్థానానికి రెండువేల ప్రతులను పుష్కలంగా సమర్పించి తరించిన వినయ సంపన్నుడాయన.
భక్తితో ఒక్కసారి స్మరిస్తే చాలు క్షణంలో అభయం అందించే సింహాచల క్షేత్రముయొక్క వంశపారంపర్య ధర్మ కర్తలు, కేంద్ర పౌరవిమానయానశాఖా మంత్రి పూసపాటి అశోకగజపతి రాజు సుమారు గంటసేపు సమయాన్ని వెచ్చించి ఈ గ్రంథాన్ని ఆమూలాగ్రం పరిశీలించి, ఆశ్చర్యంతో - పరమసంతోషంతో ఈ గ్రంథాన్ని ఆవిష్కరించారు. అంతేకాకుండా న్యూఢిల్లీలోని కేంద్రప్రభుత్వ పరిధిలో వివిధ శాఖలకు చెందిన తెలుగు అధికారులకు అశోకగజపతిరాజు అనుచరగణం ఈ గ్రంథాన్ని ఉచితంగా అందజేయడంతో వారి ఆనందానికి అవధుల్లేవు.
అగ్నిజ్వాలలా తేజరిల్లుతున్న 'నను గన్న నాతండ్రి' గ్రంథములో అనేక నృసింహ స్తవనాలతో పాటు పుణ్య కథలను, మంత్రోపదేశాలను, జపతప పూజా హోమాదుల క్రతువుల విశేషాలను అక్షరసుగంధంలా అందించారు.
ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క ఆయుధమై భక్తులకు రక్షణనిచ్చేలా ఈ 'నను గన్న నాతండ్రి' గ్రంథం ప్రజ్వలిస్తోంది. ఈ పుస్తకాన్ని పూర్తిగా చదివిన వారికి తనువూ, మనస్సు పులకాంకురమౌతుంది. ఆత్మజ్జ్ఞాన సారమైన లక్ష్మీనృసింహుని భక్తిని ఉపదేశించే ఈ అక్షర బ్రమ్మాండం వేళ భక్తులకు అందడానికి వెనుక సూత్రధారి నందమూరి బాలకృష్ణ గారికి ఎప్పుడు నరసింహస్వామి కటాక్షం ఉంటూనే ఉంటుంది. పరమశోభయదాయకంగా ఇంతటి సౌభాగ్యాన్ని అందించిన సాయికొర్రపాటి తరతరాలుగా సుఖసంతోషాలు, ఆరోగ్య భోగభాగ్యాలు నృసింహ ఆలయాలు ప్రసాదిస్తాయనివేరే చెప్పాలా!? ఆయన భక్తి అలాంటిది. ఎప్పుడూ శుభాలే జరగాలి.
అత్యంత భక్తితో ముందుకు వచ్చి రచయితగా,సంకలన కర్తగా మరొక మంగళాసంకేతాన్ని ఈ గ్రంథంలో ప్రతిష్టించుకున్న పురాణపండ శ్రీనివాస్ జన్మజన్మల సాధన ఫలించిందని చెప్పక తప్పదు.