జూన్ 9న బెంగుళూర్ లో 41 దియెటర్స్ లో విడుదలవుతున్న 'శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట'
ఈ సినిమాతో నూతన తారలు శేఖర్ వర్మ, దీప్తి శెట్టి హీరోహీరోయిన్లుగా గ్రాయత్రి ప్రొడక్షన్స్ పతాకం పై కె.ఎస్.రావు నిర్మాణ సారథ్యంలో నూతన దర్శకుడు నరేశ్ పెంట తెరకెక్కించిన సినిమా 'శ్రీరాముడింట శ్రీకృష్ణుడంట'. మే 26న ఈ సినిమా విడుదల చేశారు. ప్రిమియర్ చూసిన ప్రతి ఒక్కరు నుండి చిత్రం చూసిన ప్రతి ఓక్కరూ మంచి చిత్రం చూశారని ప్రశంశలు కురిపించారు. చిన్న చిత్రం అని చూడకుండా మంచి చిత్రానికి పాజిటివ్ గా స్పందిచడంతో చిత్ర యూనిట్ సభ్యుల్లో నూతనోత్సాహన్ని కలిగించింది.
దర్శకుడు నరేశ్ పెంట ఈ సినిమాను మనసుని హత్తుకునే రీతిన తెరకెక్కించారని, ఈ సినిమా చూసినంత సేపు పల్లెల్లో తిరిగిన అనుభవం ప్రేక్షకులకి తప్పక వస్తుంది. ఇదే విషయాన్ని ప్రేక్షకులు ఫోన్ చేసి కూడా చెప్పటం విశేషం. అలానే తెలుగు ఫ్యామిలీల్లో ఉండే ఎమోషన్స్ ని మనసుకి హత్తుకునే రీతిన ఈ సినిమా ఉందని విమర్శకులు సైతం తెలిపారు. ఈ చిత్రాన్ని జూన్ 9న బెంగళూర్ లో దాదాపు 41 దియోటర్స్ లో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం తప్పకుండా బెంగుళూర్ లోని తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని నిర్మాత తెలిపారు.
ఈ చిత్రానికి రచన-సంగీతం-దర్శకత్వం నరేశ్ పెంట. నిర్మాత : కే.యస్.రావు, సినిమాటోగ్రఫి : కూనపరెడ్డి జయకృష్ణ, నిర్మాణ నిర్వహణ : కే.ఆర్. ప్రశాంత్.