Advertisementt

జూలైలో దర్శకుడు

Tue 06th Jun 2017 12:30 PM
darshakudu movie,director hari prasad jakka,sukumar,july the film is released  జూలైలో దర్శకుడు
Darshakudu Movie Release on July! జూలైలో దర్శకుడు
Advertisement
Ads by CJ

కుమారి 21 ఎఫ్ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత ప్రముఖ దర్శకుడు సుకుమార్ తన సొంత సంస్థలో నిర్మిస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం దర్శకుడు. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై  బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి  సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అశోక్, ఈషా జంటగా నటిస్తున్నారు. హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహిస్తున్నారు. జూలైలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  

ఈ సందర్భంగా నిర్మాతలు చిత్ర విశేషాల్ని తెలియజేస్తూ ప్రేమకు, తపనకు మధ్య నలిగిపోయే ఓ దర్శకుడి ప్రేమకథ ఇది. స్వార్థపరుడైన  దర్శకుడు ప్రేమలో పడితే  ఏం జరుగుతుందనే సినిమాలో ఆసక్తిని రేకెత్తిస్తుంది.  ఇటీవల ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదలైన టీజర్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది. అశోక్ నటన, హరి ప్రసాద్ జక్కా  దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. జూలైలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని అన్నారు. అశోక్, ఇషా,పూజిత, నోయల్, నవీన్, సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ అనుమోలు, ఎడిటింగ్: నవీన్‌నూలి, సంగీతం: సాయికార్తీక్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రమేష్ కోలా. 

Darshakudu Movie Release on July!:

Kumari 21 F. After the success of the film, director Sukumar is yet another director of the film, which is producing his own company. Sukumar is producing this film along with BNCSP Vijay Kumar, Thomas Reddy Andrei and Ravichandra Sathi on the banner of Sukumar Writings. Ashok and Esha are playing the pairs. Hariprasad jakka is directing. In July, the film is going to be released.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ