Advertisementt

'గౌతమ్ నంద' వస్తున్నాడు..!

Mon 05th Jun 2017 10:32 PM
gopichand,gautam nanda movie,gautam nanda teaser,release on 12th june 2017,gopichand birthday  'గౌతమ్ నంద' వస్తున్నాడు..!
Gautham Nanda Teaser on Gopichand Birthday! 'గౌతమ్ నంద' వస్తున్నాడు..!
Advertisement
Ads by CJ

గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 12న 'గౌతమ్ నంద' టీజర్. 

మాస్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ డైరెక్టర్ సంపత్ నందిల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సూపర్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'గౌతమ్ నంద'. శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో గోపీచంద్ సరసన హన్సిక-కేతరీన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ ను చిత్ర కథానాయకుడు గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా జూన్ 12న విడుదల చేయనున్నారు.   

చిత్ర నిర్మాతలు జె.భగవాన్-జె.పుల్లారావ్ లు మాట్లాడుతూ.. 'గౌతమ్ నంద'లో హీరో గోపీచంద్ పాత్రను దర్శకుడు సంపత్ నంది చాలా స్టైలిష్ గా.. అంతే పవర్ ఫుల్ గా తెరకెక్కించాడు. సంపత్ నంది ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని సిద్ధం చేసిన కథ-కథనాలే ఈ చిత్రానికి బలం. జూన్ 12న మా హీరో గోపీచంద్ పుట్టినరోజును పురస్కరించుకొని 'గౌతమ్ నంద' టీజర్ ను విడుదల చేయనున్నాం. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. టాకీ పార్ట్ పూర్తయ్యింది. మా బ్యానర్ నుండి వస్తున్న బెస్ట్ సినిమాగా 'గౌతమ్ నంద' నిలుస్తుంది. రెండు పాటల మినహా షూటింగ్ పూర్తయిన   త్వరలోనే ఆడియో మరియు సినిమా విడుదల తేదీలను ప్రకటిస్తాం' అన్నారు. 

గోపీచంద్, హన్సిక, కేతరీన్, నికితన్ ధీర్, తనికెళ్లభరణి, వెన్నెల కిషోర్, అజయ్, ముఖేష్ రుషి తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వర్రావు, స్క్రిప్ట్ కోఆర్డినేటర్: సుధాకర్ పవులూరి, కళ: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, ఎడిటింగ్: గౌతమ్ రాజు, సినిమాటోగ్రఫీ: ఎస్.సౌందర్ రాజన్, నిర్మాతలు: జె.భగవాన్-జె.పుల్లారావు, కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: సంపత్ నంది!

Gautham Nanda Teaser on Gopichand Birthday! :

Macho action hero Gopichand's Gautham Nanda from hat trick director Sampath Nandi will have its teaser launch on June 12th that is Gopichand birthday. Producers J Bhagawan and J Pulla Rao of Sri Balaji Cine Media banner expressed their happiness on film's progress with two songs left balance.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ