దాసరి నారాయణరావు కి మోహన్ బాబుకి ఉన్న బంధం గురించి వేరే చెప్పక్కర్లేదు. మొదట్లో వారి అనుబంధం గురించి తెలియనివారికి నిన్నగాక మొన్న దాసరి పరమపదించినప్పుడు మోహన్ బాబు అన్ని తానై దాసరికి అంతిమ వీడ్కోలు చెప్పడం చూసిన వారికి పూర్తిగా అర్ధమవుతుంది. దాసరి మరణంతో బోరున విలపించిన మోహన్ బాబు ఆయన గురించి ఎవరికీ తెలియని కొన్ని విషయాలు ఒక న్యూస్ పేపర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.
తనని సినిమాల్లోకి పిలిచి ఆహ్వానించి మొదటి అవకాశం ఇచ్చింది తమ గురువు దాసరి గారేనని ఎంతో గర్వంగా చెబుతున్నాని.... తనకి పునర్జన్మనిచ్చిన మహానుభావుడు తమ గురుగారేనని చెబుతున్నాడు. అలాగే గురువుగారి ప్రతి సినిమాలో తనకు మంచి పాత్రలు ఇచ్చి తానని ఎంతో ఎత్తులో నిలబెట్టాడని చెప్పారు. కానీ ఆయనతో సినిమా చేసేటప్పుడు దాసరి గారు చాలా స్టిక్స్ గా వ్యవహరించేవారు. ఏదన్నా తప్పు చేస్తే కొట్టడానికి వెనకాడేవారు కాదు. ఒక రోజు నేను ఒక డైలాగ్ కోసం 20 నుండి 30 టేకులు తీసుకున్నాను. కానీ ఆ డైలాగ్ సరిగ్గా చెప్పలేకపోయాను.. ఇంతలో ఎందుకు అంతలా తడబడుతున్నావు అంటూ ఆయన బూటు కాలుతో నా కాలు గట్టిగా తొక్కేశారు. ఆ బాధతో విలవిలలాడిపోయాను. ఇక దెబ్బకి సినిమాలు వదిలేసి తిరిగి వెళ్లిపోదామనుకున్నాను. కానీ గురువుగారు నన్ను మళ్లీ పిలిచి ఏంటయ్యా నువ్వు అంటూ నవ్వేశారు. ఇక గురువుగారి భార్య పద్మ గారు కూడా నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేవారంటూ భావోద్వేగానికి గురయ్యారు మోహన్ బాబు.
అయితే దాసరి గారు చనిపోయినప్పుడు ఆయనను సినిమా ఇండస్ట్రీ అవమానించిందని మోహన్ బాబు అంటున్నారు. దాసరిగారి వలన ఎంతో గొప్ప స్థాయిలో ఉన్న వారు ఆయన మరణం అప్పుడు ఆయనని మరిచారని... దాసరిగారి నుండి సాయంపొందిన వారు ఆయన్ని విస్మరించారని.... చాలామంది గురువుగారు మరణించినప్పుడు కనీసం చూడడానికి కూడా రాలేదని వాపోయారు.