Advertisementt

'శ‌మంత‌క‌మ‌ణి'డిజిట‌ల్ పోస్ట‌ర్స్ కి సూపర్బ్ రెస్పాన్స్!

Mon 05th Jun 2017 12:10 PM
nara rohit,aadi,sundeep kishan,sudheer babu,shamanthakamani,multi starrer movie  'శ‌మంత‌క‌మ‌ణి'డిజిట‌ల్ పోస్ట‌ర్స్ కి సూపర్బ్ రెస్పాన్స్!
Huge Response for Shamanthakamani Digital Posters!! 'శ‌మంత‌క‌మ‌ణి'డిజిట‌ల్ పోస్ట‌ర్స్ కి సూపర్బ్ రెస్పాన్స్!
Advertisement
Ads by CJ

నారా రోహిత్‌, సుధీర్‌బాబు, సందీప్ కిష‌న్‌, ఆది హీరోలుగా న‌టిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రం `శ‌మంత‌క‌మ‌ణి` షూటింగ్ పూర్త‌యింది. భ‌వ్య క్రియేష‌న్స్ ప‌తాకంపై  వి.ఆనంద‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమా గురించి

చిత్ర నిర్మాత వి.ఆనంద‌ప్ర‌సాద్ మాట్లాడుతూ 'భ‌లే మంచి రోజు` ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య ద‌ర్శ‌క‌త్వంలో మ‌ల్టీస్టార‌ర్‌గా `శ‌మంత‌క‌మ‌ణి` ని తెర‌కెక్కిస్తున్నాం.  నారా రోహిత్‌, సుధీర్‌బాబు, సందీప్ కిష‌న్‌, ఆది చాలా చ‌క్క‌గా న‌టించారు.  ప్ర‌తి ఒక్క‌రికీ ప్రామినెంట్ రోల్ ఉంటుంది. వాస్త‌వ ఘ‌ట‌న‌ల‌ను ఆధారంగా చేసుకుని శ్రీరామ్ క‌థ‌ను చిక్క‌గా అల్లుకున్నారు. ఓ వైపు వినోదాన్ని పంచుతూనే మ‌రో వైపు ఉత్కంఠ రేకెత్తిస్తుంది. థ్రిల్లింగ్ అంశాలు పుష్క‌లంగా ఉంటాయి. షూటింగ్ పూర్తి చేశాం. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. జూన్ 30న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం. ఈ మ‌ధ్య ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేసిన హీరోల కేర‌క్ట‌ర్ పేర్ల‌కు,  డిజిట‌ల్ పోస్ట‌ర్స్ కి చాలా మంచి స్పంద‌న వ‌స్తోంది` అని అన్నారు.

ద‌ర్శ‌కుడు మాట్లాడుతూ `మా చిత్రంలో  కృష్ణ పాత్ర‌లో సుధీర్‌బాబు, కార్తిక్‌గా ఆది, కోటిప‌ల్లి శివ‌గా సందీప్ కిష‌న్‌, ఇన్‌స్పెక్ట‌ర్ రంజిత్‌కుమార్‌గా నారా రోహిత్ న‌టించారు. మా హీరోల పాత్ర‌ల‌ను ప‌రిచ‌యం చేస్తూ విడుద‌ల చేసిన పోస్ట‌ర్స్ కి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. ముందు ఆది, త‌ర్వాత నారా రోహిత్ పోస్ట‌ర్ల‌ను విడుద‌ల చేశాం. సుధీర్ బాబు కేర‌క్ట‌ర్‌ను  శుక్ర‌వారం ట్విట్ట‌ర్ ద్వారా మ‌హేశ్‌బాబుగారు అన్‌వీల్ చేశారు. శ‌నివారం సందీప్ కిష‌న్ పేరును ప‌రిచ‌యం చేశాం. మేం విడుద‌ల చేసిన డిజిట‌ల్ పోస్ట‌ర్ కి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. సోష‌ల్ మీడియాలో టాప్ రేటింగ్‌తో ట్రెండ్ అవుతోంది.  యువ క‌థానాయ‌కులు న‌లుగురితో మ‌ల్టీస్టార‌ర్ చేస్తున్నామ‌ని అన‌గానే ప్రాజెక్ట్ కు క్రేజ్ వ‌చ్చింది. భ‌వ్య క్రియేష‌న్స్ ఆనంద‌ప్ర‌సాద్‌గారు క‌థ విన‌గానే సినిమా చేయ‌డానికి ముందుకొచ్చారు. ఇందులో ప్ర‌తి ఒక్క‌రి పాత్రా జ‌నాల‌కు క‌నెక్ట్ అవుతుంది. ఎంట‌ర్‌టైన్‌మెంట్ విత్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో సినిమా చేశాం. యూత్‌తో పాటు అంద‌రికీ న‌చ్చుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది` అని తెలిపారు.

డా.రాజేంద్ర‌ప్ర‌సాద్‌, చాందినీ చౌద‌రి, జెన్నీ హ‌నీ, అన‌న్యా, సోనీ, ఇంద్ర‌జ‌, క‌స్తూరి, సుమ‌న్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, హేమ‌, సురేఖావాణి, `స‌త్యం` రాజేశ్‌, బెన‌ర్జీ, `అదుర్స్` ర‌ఘు త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ధారుల్లో న‌టించిన  ఈ సినిమాకు సంగీతం: మ‌ణిశ‌ర్మ‌, కెమెరా: స‌మీర్ రెడ్డి, ఆర్ట్:  వివేక్ అన్నామ‌లై, ఎడిటింగ్‌: ప‌్ర‌వీణ్ పూడి, నిర్మాత‌:  వి.ఆనంద‌ప్ర‌సాద్‌, క‌థ - స్క్రీన్‌ప్లే - మాట‌లు - ద‌ర్శ‌క‌త్వం: శ‌్రీరామ్ ఆదిత్య‌.

 

 

Huge Response for Shamanthakamani Digital Posters!!:

Aadi, Sundeep Kishan, Sudheer babu, Nara Rohit Casting in Multi Starrer 'Shamanthakamani'. Every Actor has a Prominent Role. Based on a True Story.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ