దాసరి, చిరులు ఒకే పట్టుదలతో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి ఎదిగారు. ఇక ఇద్దరి సామాజిక వర్గాలు కూడా ఒక్కటే. కానీ వీరిద్దరూ ఏకమైతే పలువురి అడ్రస్సులు గల్లంతవుతాయనే ఉద్దేశ్యంతో తమ ఇద్దరి మద్య కొందరు చిచ్చుపెట్టారని, 'లంకేశ్వరుడు'ను ఫ్లాప్ టాక్ తెచ్చి, తమను విడదీశారని ఒకనొక దశలో దాసరి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల దర్శక దిగ్గజం దాసరికి, మెగాస్టార్ చిరంజీవికి మధ్య మనస్పర్దలు కూడా వచ్చాయంటారు.
దాసరి అప్పుడప్పుడు దీనికి ఊతం ఇచ్చేలా తన ప్రసంగాలు చేసేవారు. ఇక మెగాభిమానులు, మెగా స్టార్ ఫ్యామిలీకి కూడా అది ఉందంటారు. కానీ ఎట్టకేలకు ఇటీవల వీరందరూ కలవడం, అల్లు అరవింద్ కుమారుడి ఫంక్షన్‌కు దాసరి రావడం, 'ఖైదీ నెంబర్ 150' వేడుకకు చీఫ్ గెస్ట్‌గా దాసరి రావడంతో మరలా అందరిలో ఆనందం వెల్లివిరిసింది. ఆమద్య దాసరి పవన్ కళ్యాణ్‌తో తాను ఒక చిత్రం చేయనున్నానని ప్రకటించాడు. దాంతో ఈ ఇరు కుటుంబాల మద్య స్నేహపూరిత వాతావరణం ఉండకూడదని భావించి చాలా మంది ఈ ప్రకటన చూసి ఆశ్చర్యపోయారు. ఇక పవన్, దాసరి ఇద్దరు ఈ సినిమా ఉంటుందని స్వయంగా ప్రకటించారు.
ఇక ఈ చిత్రానికి తాను కేవలం నిర్మాతగా మాత్రమే ఉంటానని దాసరి ప్రకటించారు. కానీ దాసరికి ఉన్న అనుభవంతో ఆయన దర్శకత్వం వహించినా తనకు ఇష్టమేనని పవన్ చెప్పాడని కూడా వార్తలు వచ్చాయి. ఇటీవల పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కానుకగా దాసరి తన తారకప్రభు ఫిలింస్ బేనర్‌లో 38వ చిత్రంగా పవన్‌తో సినిమా చేయనున్నట్లు ప్రకటన కూడా ఇచ్చారు. ఆ తర్వాత కథా ఎంపిక, దర్శకుని ఎంపిక విషయంలో కూడా పలు వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో దాసరి నిర్మాతగా తారకప్రభు ఫిలింస్ బేనర్‌లో 38వ చిత్రం కోసం బోయపాటి దర్శకత్వంలో చేసే సినిమాకు 'బోస్' అనే టైటిల్‌ను కూడా అనుకున్నారట.
దానిని రిజిష్టర్ చేయించినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక దాసరి, పవన్ ఇద్దరు రాజకీయాలలో ఉన్నవారే కావడం వల్ల ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో పవర్‌ఫుల్‌గా ఉంటుందని, పవన్ 'జనసేన' పార్టీకి, ఎన్టీఆర్‌కు 'బొబ్బిలిపులి, సర్దార్‌పాపారాయుడు' చిత్రాలు పొలిటికల్‌గా తెలుగుదేశంకు ఎంత మేలైజ్ ఇచ్చాయో.... ఈ పవన్-దాసరి చిత్రం కూడా అదే స్థాయిలో ఉంటుందని అందరూ ఆశపడ్డారు. కానీ ఆ కోరక తీరకుండానే 'బహదూరపు బాటసారి' మనలను వదిలేసి వెళ్లారు.