Advertisementt

'జట్టు ఇంజనీర్' 10 సూత్రాలివే..!

Sat 20th May 2017 06:20 PM
jattu engineer,jattu engineer premiere show,delhi indira gandhi indore stadium,cow milk  'జట్టు ఇంజనీర్' 10 సూత్రాలివే..!
Jattu Engineer Premiere Show Highlights 'జట్టు ఇంజనీర్' 10 సూత్రాలివే..!
Advertisement
Ads by CJ

ఢిల్లీ ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియమ్ లో 20 వేల ప్రేక్షకుల నడుమ ఘనంగా జరిగిన సెయింట్ డాక్టర్ MSG  'జట్టు ఇంజనీర్' ప్రియమిర్ షో.

యం యస్ జి, యం యస్ జి 2, లయన్ హార్ట్, నాపాక్ కో జవాబ్.. వంటి యాక్షన్ విత్  మెసేజ్ తో వచ్చిన నాలుగు చిత్రాల తరువాత అయిదో  మూవీ 'జట్టు ఇంజనీర్' బాలీవుడ్ లో విడుదల కాబోతున్న సందర్భంగా  ఢిల్లీ ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియమ్ లో 20 వేల ప్రేక్షకుల నడుమ చిత్రం ప్రియమిర్ షో ప్రదర్శించారు. త్వరలో తెలుగులో కూడా విడుదల చేస్తున్న సందర్భంగా టాలీవుడ్ మీడియా ని ఢిల్లీ కి  ఆహ్వానించారు.. హాకీకత్ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు.

ప్రియమిర్ షో ప్రారంభానికి ముందుగా సెయింట్ డాక్టర్ MSG ...ఆవు పాల ప్రాశస్త్యం గురించి వివరించి, మన ఆడవాళ్ళు చేసుకునే కిట్టి పార్టీ లా, మగవాళ్ళు చేసుకునే మందు పార్టీ లా, కాక్టెయిల్ పార్టీ, బర్త్ డే పార్టీ , ఇలా చాలా రకాలుగా మనం పార్టీలు చేసుకుంటున్నాం. ఆ పార్టీలన్నీ మత్తుతో కూడుకున్నవి ఆరోగ్యాన్ని పాడుచేసే పార్టీలు అవి, సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆవుపాలు తో మనం ఈ రోజు 'కౌ మిల్క్ పార్టీ' చేసుకుని సరికొత్త పార్టీ కి శ్రీకారం చుడదాము..అంటూ స్టేడియమ్ లో హాజరైన  20 వేల మంది కి ఆవు పాల గ్లాసులు అందించి ఒకే సారి తాగేలా ఏర్పాటు చేసి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. అంతే కాకుండా 20 వేల మందికి  మధ్యాన్నం భోజనం ఏర్పాటు చేయడం, అంత మంది అక్కడ భోజనం చేసిన స్టేడియం మొత్తం పరిశుభ్రంగా ఉంచడం హాజరైన ప్రజల క్రమశిక్షణ కు అద్దం పట్టింది. 

'జట్టు ఇంజనీర్' సినిమా గురుంచి మాట్లాడుతూ..ఈ చిత్రం గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా అభివృద్ధి చెందని ప్రజల  ఉపయోగం కోసం, సంక్షేమం కోసం,  వారిలో పరివర్తన తేవడానికి హాస్య ప్రధానంగా ఎలాంటి  ద్వంద అర్థాలు లేని క్లీన్ డైలాగ్స్ తో ఈ సినిమాని రూపొందించడం జరిగింది. మే 19న భారత్ అన్నిప్రాంతాల్లో ముందుగా హిందీ లో విడుదల చేస్తున్నాము. త్వరలో తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేస్తాం. ఈ చిత్రం లో పది సూత్రల్లా పది ముఖ్యమైన అంశాలు ఉంటాయి ఖచ్చితంగా మీరు కూడా ఈ చిత్రాన్ని చూసి తప్పక ఆదరిస్తారని నేను  విశ్వసిస్తున్నాను.. అన్నారు.

1.విడుదలకు ముందే సంచలనం...!! 

ఒకో సినిమా తీయడానికి సంవత్సారాల వ్యవధి పడుతుంది. నా గత చిత్రాలు కూడా ఎక్కువ సమయం ఎక్కువ బడ్జెట్ తో తీసినవే, అయితే ఈ సినిమా మాత్రం కేవలం 15 రోజుల్లో పూర్తి చేసి బాలీవుడ్ సినిమాల్లో సరికొత్త రికార్డు సృష్టించడం జరిగింది.

2.ద్వంద అర్ధాలు తో వచ్చే సినిమాలకు చెక్..!

ఈ రోజుల్లో సినిమాలు, ప్రత్యేకించి హాస్యచిత్రాలు, ఒకే ఫార్ములా తో, ద్వంద అర్ధాలు వచ్చేలా ఉంటున్నాయి. ఈ సబ్జెక్టు లో  మాత్రం ఎలాంటి బూతు డైలాగులు కానీ, ద్వంద అర్ధాలు వచ్చే మాటలు కానీ వుండవు. అందరూ చూడతగ్గ క్లీన్ అండ్ నీట్ మూవీ.

3.సందేశాత్మక చిత్రం ఇది

ప్రజలకు సామాజిక సృహ, వారిలో పరివర్తన తేవడానికి హాఫ్ బీట్ మూవీస్ చూపిస్తే రుచించవు. ఏదైనా పూర్తిస్థాయి సామాజిక సందేశాన్ని అందించడం కోసం వాళ్ళను ఎంటర్టైన్ చేస్తూ...అండర్ కరెంటు పాయింట్ ను చెపితే తప్పక ఆదరిస్తారు. అందుకే ఇది కామెడీ తో పాటు ఓ మంచి సందేశం ఉంటుంది.

4.ఒక నమ్మశక్యంకాని బ్యాక్ గ్రౌండ్ స్కోర్

మునుపటి MSG, MSG 2 లయన్హార్ట్ లేదా హిందూ కా నాపాక్ కో జవబ్ లాంటి సినిమాలలో, అత్యంత ప్రశంసలు మరియు విమర్శకుల ప్రశంసలు పొందిన వాటిలో బాక్గ్రౌండ్ స్కోరు ఒకటి . ఈ చిత్రం లో కూడా ఆ స్థాయి నేపథ్య సంగీతాన్ని  జట్టు ఇంజనీర్తో మీరు చూడవచ్చు.

5.క్లీన్ ఫామిలీ ఎంటర్టైనర్ 

ఈ రోజుల్లో, ప్రత్యేకించి చలన చిత్రాల్లో, జుగుప్స కరమైన సన్నివేశాలు  డబుల్ అర్థం డైలాగ్లు మీతి మీరు వస్తున్నాయి.  ప్రజలు వారి కుటుంబాలతో సినిమాలకు వెళ్లే పరిస్థితి లేదు.  జట్టు  ఇంజనీర్   అసభ్యకర హాస్యం లేకుండా అసభ్యతకు పాల్పడకుండా కుటుంబసమేతంగా  ఈ సినిమా చూడొచ్చు.

6.టాలెంట్ వున్న కొత్త నటీనటులకు అవకాశం ఇచ్చాము

హర్యానాలోని సిర్సా సమీప గ్రామాల నుండి స్థానికులలో టాలెంట్ వున్న కళాకారులకు ఈ చిత్రం లో అవకాశం కల్పించాము. గ్రామాల్లో జనం ఎలావుంటారో ఆ నడవడి, కట్టుబాటు, ఒరిజినల్ గా వుండాలని చాలా మంది కొత్తవారికి ఈ చిత్రం అవకాశం కల్పించడం జరిగింది. వారందరు ఎంతో అనుభవం వున్న నటుల్లా మాకు సహకరించారు.

7.సంగీతాన్ని బాగా ఆస్వాదిస్తారు   

ఈ చిత్రంలో రెండు పాటలు ఉన్నాయి, వీటిలో ఒకటి 'జోష్ మెయిన్' నేటి యువత క్రీడలలో జాతీయంగా ప్రోత్సహించటానికి సందేశాన్నిచ్చే పాట,  ఎందుకంటే క్రీడలలో దేశాలకు యెనలేని కీర్తి ప్రతిష్టలు  తెచ్చుకోవడమే కాకుండా, ఆర్థికపరంగా నిలదొక్కుకోవడానికి నేటి యువత ముందుకు రావాలి అని స్ఫూర్తి నిచ్చే పాట. మరో పాట 'హోలీ కి పిచ్కరి'  ఇది గ్రామాల్లో హోలీ సందర్భంగా వచ్చే సరదా పాట.

8.ఇలా చేస్తే భారత్ అగ్ర దేశాల సరసన నిలబడుతుంది. 

మన వ్యక్తిగత జీవితాల్లో, మన ఇంటి పరిసరాల్లో  సరైన పరిశుభ్రత  అవసరం మనం చాలా జాగ్రత్త పడతాము . అదే వేరే వీధిలోకి మనం వెడుతుంటే అక్కడి అపరిశుభ్రత చూసి చూడనట్టు తప్పించు కుంటాం. ఇది తగదు మన ఇల్లు బాగుండాలి మన వీధి బాగుండాలి, మన గ్రామం బాగుండాలి, మన టౌన్ బాగుండాలి, మన పట్టణం బాగుండాలి, మన రాష్ట్రము బాగుండాలి అని ప్రతి ఒక్క పౌరుడు అనుకుంటే ఈ భారత్ అగ్ర దేశాల సరసన నిలబడుతుంది. అందుకే ఈ చిత్రం లో స్వచ్ఛ భారత్ స్ఫూర్తి తో రుషికేశ్ నుండి కాశీ వరకు కాశీ నుండి కన్య కుమారి వరకు ప్రజల్లో చైతన్యం తేవాలని ఈ చిత్రం లో ఓ సందేశం ఇవ్వడం జరిగింది. 

9.మనకున్న వనరులను సద్వినియోగం చేసుకుందాం. 

మన గ్రామాల్లో కరెంట్ విషయం లో చాలా వెనకబడి వున్నాం. బయోగ్యాస్, సోలార్ పవర్ పట్ల అవగాహన కల్పించాలి నేను ఉంటున్న డేరా సచ్చ సౌద లో బయోగ్యాస్, సోలార్ పవర్ వినియోగంతో కరెంట్ కష్టాల చాలా వరకు తొలిగాయి. అంతే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆయుర్వేదానికి వున్న ప్రాముఖ్యత ఎంతో వుంది . ఆయుర్వేద మొక్కలను పెంచడం వాటిని విదేశాలకు పంపడం వలన మన భారత్ ఆర్ధికంగా నిలదొక్కు కొంటుంది.  ఈ కార్యక్రమాల వలన ఎంత ఉపయోగం ఉంటుందో ఈ చిత్రం ద్వారా  మెసేజ్ యివ్వడం జరిగింది.  

10.థియేటర్లన్నీ నవ్వులతో నిండి పోతాయి 

ఈ చిత్రం తో బాటు అనేక యాక్షన్ సినిమాలు విడుదల అవుతున్నప్పటికీ, ప్రత్యేకంగా ఈ మూవీ చూస్తున్నంత సేపు పతి డైలాగ్ కి, సన్నివేశానికి నవ్వాపుకోలేరు. ఇందులో నేను వేసిన డ్యూయెల్ రోల్ లో శక్తి సింగ్ శిశోడియా పాత్ర బాగా ఆకట్టుకుంటుంది. 

2017 మే 19 న విడుదల అవుతున్న 'జట్టు ఇంజనీర్'  మీ కుటుంబ సభ్యులతో కలిసి అద్భుతమైన ఉద్వేగాన్ని పొందాలని మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాము. ఈ చిత్రం ఇప్పటికే ఫిల్మ్ సర్టిఫికేషన్ సెంట్రల్ బోర్డ్ (CBFC) ద్వారా యు లేదా యూనివర్సల్ రేటింగ్ ఇవ్వబడింది. అనగా ప్రతి ఒక్కరూ  6 సంవత్సరాల నుండి  60 సంవత్సరాల వరకు నిచ్చింతగా చూడొచ్చు.. అన్నారు.

Jattu Engineer Premiere Show Highlights:

Saint Dr MSG Jattu Engineer Premiere show Held at Delhi Indira Gandhi Indore Stadium

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ