Advertisementt

బాలయ్య 102 వ చిత్రం కూడా ఫిక్స్..!

Wed 10th May 2017 06:35 PM
balakrishna,c kalyan balakrishna 102 movie,ks ravikumar,m ratnam,ck entertainmetns balayya 102 movie  బాలయ్య 102 వ చిత్రం కూడా ఫిక్స్..!
Balakrishna's 102 Movie Confirmed బాలయ్య 102 వ చిత్రం కూడా ఫిక్స్..!
Advertisement
Ads by CJ

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో సి.కళ్యాణ్‌ ప్రతిష్ఠాత్మక భారీ చిత్రం 

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌ ఓ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్‌గా గౌతమిపుత్ర శాతకర్ణి వంటి సంచలన చిత్రంతో చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న నటసింహ నందమూరి బాలకృష్ణ తన 102వ చిత్రాన్ని రజనీకాంత్‌తో నరసింహ వంటి సూపర్‌హిట్‌ చిత్రాన్ని రూపొందించిన కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో తొలిసారి చేస్తున్నారు. 

ఈ భారీ చిత్రానికి సంబంధించిన వివరాలు నిర్మాత సి.కళ్యాణ్‌ తెలియజేస్తూ - నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నరసింహ డైరెక్టర్‌ కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ చిత్రానికి ఎం.రత్నం అద్భుతమైన కథ, మాటలు అందిస్తున్నారు. బాలకృష్ణగారి కెరీర్‌లోనే ఇది మరో సంచలన చిత్రం అవుతుంది. జూన్‌ నెలాఖరులో ఈ చిత్రాన్ని ప్రారంభిస్తున్నాం. జూలై 10 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ అవుతుంది. నటసింహ బాలకృష్ణతోపాటు భారీ తారాగణం నటించే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తాము. నటసింహ నందమూరి బాలకృష్ణ రీసెంట్‌గా గౌతమి పుత్ర శాతకర్ణితో చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. రజనీకాంత్‌తో నరసింహ వంటి సెన్సేషనల్‌ హిట్‌ చిత్రాన్ని రూపొందించిన కె.ఎస్‌.రవికుమార్‌, నటసింహ బాలకృష్ణ ఫస్ట్‌ కాంబినేషన్‌లో మా సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం..అన్నారు. 

సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై నిర్మాణం జరుపుకోనున్న ఈ భారీ చిత్రానికి కథ, మాటలు: ఎం.రత్నం, కో-ప్రొడ్యూసర్‌: సి.వి.రావు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌: సి.తేజ, సి.వరుణ్‌కుమార్‌, నిర్మాత: సి.కళ్యాణ్‌, దర్శకత్వం: కె.ఎస్‌.రవికుమార్‌. 

Balakrishna's 102 Movie Confirmed:

Balakrishna's 102nd Movie directed by Rajinikanth's Narasimha Movie director KS Ravikumar. Produced by C Kalyan in CK Entertainments Banner.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ