యాక్షన్ హీరో గోపీచంద్-సెన్సేషనల్ డైరెక్టర్ బి.గోపాల్ ల కాంబినేషన్ లో జయా బాలాజీ రియల్ మీడియా పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి తాండ్ర రమేష్ నిర్మాత. గోపీచంద్ సరసన నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు 'ఆరడుగుల బుల్లెట్' అనే పవర్ ఫుల్ టైటిల్ ను కన్ఫర్మ్ చేశారు. మణిశర్మ సంగీత సారధ్యం వహిస్తున్నారు.
చిత్ర నిర్మాత తాండ్ర రమేష్ మాట్లాడుతూ.. 'గతంలో చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు వంటి స్టార్ హీరోలకు ఇండస్ట్రీ హిట్ లు ఇచ్చిన దర్శకుడు బి.గోపాల్ ఇప్పుడు గోపీచంద్ కు కూడా అదే స్థాయి హిట్ చిత్రాన్ని ఇవ్వనున్నారు. ఫ్యామిలీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన మా సినిమాకి 'ఆరడుగుల బుల్లెట్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశాం. ఫ్యామిలీ ఆడియన్స్ తోపాటు యూత్, మాస్ ఆడియన్స్ కు నచ్చే అంశాలు మేళవించి దర్శకులు బి.గోపాల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ రచయితలు వక్కంతం వంశీ అందించిన కథ, అబ్బూరి రవి మాటలు, బాల మురుగన్ సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్స్ గా నిలుస్తాయి. గోపీచంద్ కెరీర్ లో ఈ చిత్రం ఓ మైలురాయిగా నిలుస్తుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న 'ఆరడుగుల బుల్లెట్' ను మేలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నాం' అన్నారు.
ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, అభిమన్యు సింగ్, చలపతిరావ్, సలీం బేగ్, ఉత్తేజ్, జయప్రకాష్ రెడ్డి, ఫిరోజ్ అబ్బాసి, రమాప్రభ, సురేఖావాణి, సన, సంధ్యా జనక్, మధునందన్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, కథ: వక్కంతం వంశీ, మాటలు: అబ్బూరి రవి, ఫైట్స్: కనల్ కణ్ణన్, సినిమాటోగ్రఫీ: బాల మురుగన్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర్రావు, ఆర్ట్: నారాయణ రెడ్డి, నిర్మాత: తాండ్ర రమేష్, దర్శకత్వం: బి.గోపాల్!