Advertisementt

నిన్నే పెళ్లాడతా, మన్మధుడు కలిపే వేడుక..!

Thu 20th Apr 2017 09:50 PM
akkineni nagarjuna,naga chaitanya,rakul preet singh,jagapathi babu,rarandoy veduka chudam movie,director kalyan krishna kurasala  నిన్నే పెళ్లాడతా, మన్మధుడు కలిపే వేడుక..!
Nagarjuna Revealed Ra Randoi Veduka Chuddham Story నిన్నే పెళ్లాడతా, మన్మధుడు కలిపే వేడుక..!
Advertisement
Ads by CJ

సమ్మర్‌ కానుకగా వస్తోన్న గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'రారండోయ్‌ వేడుక చూద్దాం' కింగ్‌ నాగార్జున 

యువసామ్రాట్‌ నాగచైతన్య హీరోగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ హీరోయిన్‌గా అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై కళ్యాణ్‌ కృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ ఎమోషనల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ చిత్రం 'రారండోయ్‌ వేడుక చూద్దాం'. ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు, సంపత్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం ఒక పాట మినహా షూటింగ్‌ పూర్తయింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే మూడవ వారంలో ఈ చిత్రం సమ్మర్‌ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రం ప్రోగ్రెస్‌ను తెలియ చేయడానికి ఏప్రిల్‌ 20న హైదరాబాద్‌ అన్నపూర్ణ సెవన్‌ ఏకర్స్‌లో ప్రెస్‌ మీట్‌ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిర్మాత అక్కినేని నాగార్జున, జగపతిబాబు, యువసామ్రాట్‌ నాగచైతన్య, హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌, దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ కురసాల పాల్గొన్నారు. 

నిర్మాత అక్కినేని నాగార్జున మాట్లాడుతూ - ఒక అమ్మాయి తనకొచ్చే భర్త రాకుమారుడిలా ఉండాలి అని కలలు కంటుంది. ఆ రాకుమారుడు ఎవరు? ఎలా ఉంటాడు ఆ అమ్మాయి కన్న కల నెరవేరిందా లేదా అనేది చిత్ర కథ. నాకు బాగా నచ్చిన రొమాంటిక్‌ ఫిలింస్‌ నిన్నే పెళ్లాడతా, మన్మధుడు. ఫ్యామిలీ లవ్‌, ఎమోషన్స్‌ సీన్స్‌ 'నిన్నే పెళ్లాడతా'లో చూపించాం. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు సెన్సిటివ్‌ లవ్‌ని 'మన్మధుడు'లో చూపించాం. ఆ రెండు మిక్స్‌చేసి సినిమా చేస్తే బాగుంటుందని కళ్యాణ్‌తో చెప్పాను. ఫెంటాస్టిక్‌ సబ్జెక్ట్‌ చెప్పాడు. నేను ఏదైతే అనుకున్నానో కరెక్ట్‌గా ఆ రేంజ్‌లో కథ రెడీ చేశాడు. కథ వినగానే బాగా నచ్చింది. వెరీ హ్యాపీ. జగపతిబాబు చైతన్య ఫాదర్‌గా నటించారు. వారిద్దరి మధ్య వచ్చే ఫాదర్‌ అండ్‌ సన్‌ రిలేషన్‌షిప్‌ ఎలా ఉంటుందో అద్భుతంగా తెరకెక్కించారు. 

రియల్‌ లైఫ్‌లో నేను, చైతు ఎలా ఉంటామో ఈ చిత్రంలో జగపతిబాబు- చైతు క్యారెక్టర్స్‌ సేమ్‌ అలాగే ఉంటాయి. అలాగే సంపత్‌ కూతురిగా రకుల్‌ నటించింది. ఒకరంటే ఒకరికి ప్రాణం. అంత బాగా వారిద్దరి క్యారెక్టర్స్‌ ఉంటాయి. ఈ నాలుగు క్యారెక్టర్స్‌ సినిమాకి మెయిన్‌ పిల్లర్స్‌గా హైలైట్‌ అవుతాయి. దేవి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఎప్పటిలాగే ఈ చిత్రానికి సూపర్‌హిట్‌ ఆల్బమ్‌ ఇచ్చాడు. విశ్వేశ్వరరావు కెమెరా విజువల్స్‌ సూపర్‌గా వచ్చాయి. కొత్త కెమెరామెన్‌ అయినా ప్యాషన్‌తో వర్క్‌ చేశాడు. కళ్యాణ్‌ ఆర్టిస్టులందర్నీ బాగా అందంగా చూపించాడు. చెప్పింది చెప్పినట్లుగానే తీశాడు. ఎమోషన్స్‌ బాగా కనబడాలి అప్పుడే సినిమా పండుతుంది. డైరెక్టర్‌గా కంటే కళ్యాణ్‌ మంచి రైటర్‌. అతని రైటింగ్‌ స్కిల్స్‌ చూసి 'సోగ్గాడే చిన్నినాయనా'కి తీసుకున్నాం. నాకు పెద్ద హిట్‌ ఇచ్చాడు. బంగార్రాజు క్యారెక్టర్‌ని బాగా డిజైన్‌ చేశాడు. చాలా మంచి పేరు వచ్చింది. తెలుగుదనం, నేటివిటీ గురించి కళ్యాణ్‌కి బాగా తెలుసు. సినిమా బాగా వచ్చింది. 

మేమంతా శాటిస్‌ఫాక్షన్‌ అయ్యాకే ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్తున్నా. మాకు నచ్చకుండా సినిమా రిలీజ్‌ చేయం. ఒక పాట తప్ప సినిమా అంతా కంప్లీట్‌ అయింది. మే మూడవ వారంలో చిత్రాన్ని రిలీజ్‌ చేస్తాం. లెజెండ్‌లో యాంగ్రీ సాల్ట్‌ పెప్పర్‌ క్యారెక్టర్‌లో కనిపించిన జగపతిబాబు ఈ చిత్రంలో మోడరన్‌ స్టైలిష్‌ ఫాదర్‌ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. రకుల్‌ బ్రమరాంబ క్యారెక్టర్‌లో నటించింది. డిఫరెంట్‌గా చాలా బాగా చేసింది. తెలుగు నేర్చుకుని క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్‌ అయి బ్యూటిఫుల్‌గా చేసింది. సినిమా చూసి సర్‌ప్రైజ్‌ అయ్యాను. ఈ సినిమాతో రకుల్‌కి చాలా మంచి పేరు వస్తుంది. చైతు తన క్యారెక్టర్‌కి జస్టిస్‌ చేశాడు. ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. సమ్మర్‌లో వస్తోన్న గుడ్‌ ఫ్యామిలీ లవ్‌, ఎమోషనల్‌ ఎంటర్‌టైనర్‌ ఫిలిం ఇది.. అన్నారు. 

ప్రైమ్‌స్టార్‌ జగపతిబాబు మాట్లాడుతూ - 'ఈ సినిమా షూటింగ్‌ అయిపోయాక అప్పుడే షూటింగ్‌ ఫినిష్‌ అయిందా అనే ఫీలింగ్‌ కలిగింది. ఎంజాయ్‌ చేస్తూ కూల్‌గా వర్క్‌చేశాం. వెరీ వెరీ నైస్‌ ఫిలిం. స్టార్టింగ్‌ నుండి నాగార్జున సినిమా బాగా వస్తుందా లేదా అని ఫాలోఅప్‌ చేస్తున్నారు. చైతన్య నా కళ్ల ముందు పెరిగాడు. ఫస్ట్‌టైం అన్నపూర్ణ స్టూడియోస్‌లో వర్క్‌ చేస్తున్నాను. చై, నేను కలిసి నటించడం చాలా హ్యాపీగా వుంది. మా ఇద్దరి మధ్య చిత్రీకరించిన సీన్స్‌ ఫెంటాస్టిక్‌గా వచ్చాయి. మా మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అయింది. చై వెరీ స్వీట్‌ బోయ్‌. అద్భుతంగా నటించాడు. రకుల్‌ ఎనర్జీ లెవల్స్‌ ఎక్స్‌లెంట్‌. బాగా కాన్‌సన్‌ట్రేట్‌ చేసి ఈ సినిమాలో నటించింది. మామూలుగా నాకు ఇరిటేషన్‌ ఎక్కువ. అలాంటిది నాకు ఇరిటేషన్‌ రాకుండా స్మూత్‌గా, కూల్‌గా వర్క్‌ చేశాడు కళ్యాణ్‌. సినిమాని బాగా తెరకెక్కించాడు. చాలా డిఫరెంట్‌ ఫిలిం. తప్పకుండా మంచి సినిమా అవుతుందని ఖచ్చితంగా చెప్పగలను' అన్నారు. 

దర్శకుడు కళ్యాణ్‌కృష్ణ మాట్లాడుతూ - 'అన్నపూర్ణ స్టూడియోస్‌లో మళ్లీ సెకండ్‌ ఫిలిం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశాన్ని ఇచ్చిన నాగార్జున గారికి థాంక్స్‌. అన్నివేళలా నాకు సపోర్ట్‌ చేస్తూ ఎంకరేజ్‌ చేసిన సుప్రియ గారికి నా ధన్యవాదాలు. ఫ్యామిలీ ఎమోషన్స్‌, రిలేషన్స్‌ వున్న కథ ఇది. ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ఉన్న ప్రేమ. తండ్రీ కొడుకుల మధ్య ఉన్న రిలేషన్‌. ఫాదర్‌ అండ్‌ డాటర్‌ మధ్య ప్రేమ. ఫ్రెండ్‌షిప్‌ రిలేషన్స్‌ ఎలా ఉంటాయో ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎమోషన్‌ సీన్స్‌ ఎంత బాగుంటాయో, అన్నపూర్ణ స్టూడియోస్‌ ప్రొడక్షన్‌ వాల్యూస్‌ కూడా అంతే బాగుంటాయి. ఈ చిత్రంలో నాగచైతన్య పెర్ఫామెన్స్‌ కొత్త యాంగిల్‌లో చూస్తారు. నేను ఎక్స్‌పెక్ట్‌ చేసిన దానికన్నా అత్యద్భుతంగా చేశారు. రకుల్‌ క్యారెక్టర్‌ చాలా కొత్తగా ఉంటుంది. బ్యూటిఫుల్‌ పర్ఫామెన్స్‌ చేసింది. జగపతిబాబుగారి లాంటి సీనియర్‌ యాక్టర్‌తో వర్క్‌ చేయడం నా అదృష్టం. సెట్‌లో చాలా సరదాగా ఫన్నీగా వుంటారు ఆయన. అందరికీ నచ్చే క్లీన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీ ఇది' అన్నారు. 

యువసామ్రాట్‌ నాగచైతన్య మాట్లాడుతూ - 'ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. బాలెన్స్‌ ఉన్న పాటని నెలాఖరుకు ఫినిష్‌ చేసి మే థర్డ్‌ వీక్‌లో సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా చేశాక యాక్టర్‌గా నెక్ట్స్‌ లెవల్‌కి వెళ్లాలంటే కళ్యాణ్‌కృష్ణతో ఒక సినిమా చేయాలి అనుకున్నాను. కళ్యాణ్‌ మంచి స్క్రిప్ట్‌ రెడీ చేశారు. నాన్న సినిమా చూసి చాలా కాన్ఫిడెంట్‌గా వున్నారు. సీనియర్‌ ఆర్టిస్టులు అందరూ ఈ సినిమాకి వర్క్‌ చేశారు. నా కెరీర్‌కి ఈ సినిమా చాలా బాగా హెల్ప్‌ అవుతుంది. ఫీల్‌గుడ్‌ లవ్‌, ఎమోషన్స్‌, రిలేషన్‌షిప్‌ ఉన్న చిత్రాలను తెలుగు ఆడియన్స్‌ బాగా ఆదరిస్తారు. ఇట్స్‌ ఎ ట్రమండస్‌ ఫిలిం. ఈ చిత్రంలో ఎమోషన్స్‌, రిలేషన్స్‌ సీన్స్‌ హైలైట్‌గా నిలుస్తాయి. వెరీ వెరీ పాజిటివ్‌ ఫీల్‌గుడ్‌ ఫిలిం. 'సోగ్గాడే చిన్నినాయనా' చిత్రాన్ని ఎలాగైతే సపోర్ట్‌ చేసి ఆదరించారో ఈ చిత్రాన్ని కూడా అలాగే సపోర్ట్‌చేసి ఆదరించాలి' అన్నారు. 

హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌సింగ్‌ మాట్లాడుతూ - 'ఎప్పటి నుంచో ప్యూర్‌ లవ్‌స్టోరీ ఫిలిం చేయాలని వెయిట్‌ చేస్తున్నాను. కళ్యాణ్‌ ఈ స్టోరీ నెరేట్‌ చేయగానే బాగా ఎగ్జైట్‌ అయ్యాను. ఈ క్యారెక్టర్‌ నేనే చేస్తాను అని ఎంతో ఇష్టపడి చేశాను. సచ్‌ ఎ లవబుల్‌ ఇన్నోసెంట్‌ లవ్‌ స్టోరీ. మన కల్చర్‌ తెలుగు నేటివిటీకి దగ్గరగా ఈ చిత్రం ఉంటుంది. ఫ్యామిలీ రిలేషన్స్‌, ఎమోషన్స్‌ ఏవిధంగా ఉంటాయో ఈ చిత్రంలో క్లియర్‌గా చూపించారు. భ్రమరాంబ క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్‌ అయి నటించాను. సినిమా ఫినిష్‌ అయ్యాక ఇంకా భ్రమరాంబలాగే బిహేవ్‌ చేస్తున్నాను. అంతలా ఆ క్యారెక్టర్‌ నన్ను వెంటాడుతంది. ఈ సినిమా ఒక బ్యూటిఫుల్‌ జర్నీ. చై శివ క్యారెక్టర్‌లో నటించారు. మా ఇద్దరి మధ్య వచ్చే సీన్స్‌ యూత్‌కి బాగా కనెక్ట్‌ అవుతాయి. ప్రతి ఒక్కరికీ నచ్చే వెరీ వెరీ క్యూట్‌ ఫిలిం. నా మనసుకి దగ్గరగా వున్న చిత్రం ఇది' అన్నారు. 

అక్కినేని నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌సింగ్‌, జగపతిబాబు, సంపత్‌, వెన్నెల కిషోర్‌, కౌసల్య, ఇర్షాద్‌, పోసాని కృష్ణమురళి, తాగుబోతు రమేష్‌, సప్తగిరి, రఘుబాబు, పృధ్వీరాజ్‌, చలపతిరావు, అన్నపూర్ణమ్మ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డిఓపి: విశ్వేశ్వరరావు, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఆర్ట్‌: సాహి సురేష్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, నిర్మాత: అక్కినేని నాగార్జున, దర్శకత్వం: కళ్యాణ్‌ కృష్ణ కురసాల. 

Nagarjuna Revealed Ra Randoi Veduka Chuddham Story:

Yuvasamrat Naga Chaitanya, Rakul Preet Singh's Love and Family Entertainer 'Ra Randoi Veduka Chuddham' Produced by Akkineni Nagarjuna under Annapurna Studios banner in Kalyana Krishna Kurasala Direction is completed except one song. Prime Star Jagapathy Babu is doing an important role. Film is getting ready to release as summer special. Producer Akkineni Nagarjuna, Jagapathy Babu, Yuvasamrat Naga Chaitanya, Heroine Rakul Preet Singh, Directoir Kalyana Krishna Kurasala speaked about the film in the press meet held at Annapurna Seven Acres. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ