Advertisementt

ఆది పినిశెట్టి కో.. యజ్ఞం లాంటి సినిమా..!

Wed 29th Mar 2017 01:39 PM
aadhi pinisetty,yagnam,pilla nuvvuleni jeevitham,as ravi kumar chowdary  ఆది పినిశెట్టి కో.. యజ్ఞం లాంటి సినిమా..!
ఆది పినిశెట్టి కో.. యజ్ఞం లాంటి సినిమా..!
Advertisement
Ads by CJ

ఆది పినిశెట్టి హీరోగా ఎ.య‌స్‌.ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో సినిమా....

'ఒక విచిత్రం' సినిమాతో తెలుగు సినిమాల్లోకి తెరంగేట్రం చేసి గుండెల్లో గోదారి, స‌రైనోడు, మ‌లుపు స‌హా ప‌లు చిత్రాల్లో విభిన్న‌మైన పాత్ర‌ల‌తో మెప్పించిన యువ క‌థానాయ‌కుడు ఆది పినిశెట్టి హీరోగా రుగ్వేద క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై య‌జ్ఞం, పిల్లానువ్వులేని జీవితం వంటి సూప‌ర్‌హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు ఎ.య‌స్‌.ర‌వికుమార్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో ఓ కొత్త చిత్రం ప్రారంభం కానుంది. డిఫ‌రెంట్ క‌థ‌ ఇది.  ఆది పినిశెట్టి స‌రికొత్త లుక్‌లో క‌న‌ప‌డ‌తాడు. ల‌వ్‌, కామెడి, యాక్ష‌న్‌, ఎమోష‌న్స్ ఇలా అన్నీ ఎలిమెంట్స్‌ ఉన్న సినిమా. ఆది కెరీర్‌లో మ‌రో బెస్ట్ మూవీగా నిలుస్తుంది.  సినిమా మేకింగ్‌లో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను రూపొందిస్తాం. త్వ‌ర‌లోనే ప్రారంభం కానున్న ఈ సినిమాకు సంబంధించిన న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ వివ‌రాల‌ను తెలియ‌చేస్తాం.. అని ద‌ర్శ‌కుడు ఎ.య‌స్‌.ర‌వికుమార్ చౌద‌రి తెలిపారు. ప్ర‌ముఖ నిర్మాత డి.ఎస్‌.రావు ఈ చిత్రానికి నిర్మాణ బాధ్య‌త‌లు వ‌హిస్తారు.