జనరల్‌గా సినిమా రిలీజ్ దగ్గర పడుతోందంటే ఆ విశేషాలు చెప్పడానికి హీరోలు మీడియాని కలుస్తుంటారు. మీడియా వేదికగా అభిమానులకు చెప్పాల్సినవి చెబుతుంటారు. అయితే సినిమా ప్రారంభం రోజునే అభిమానులకు హీరో టచ్‌లోకొస్తే, ప్రారంభోత్సవాన్ని యూట్యూబ్‌లో చూపిస్తే... ఐడియా అదిరింది కదూ. ఇది రామ్ ఐడియా. ఉగాది నాడు ఆయన కొత్త సినిమా ఆరంభం కాబోతోంది. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ హీరోగా రూపొందిన ‘నేను శైలజ’ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కాంబినేషన్ రీపీట్ అవుతోంది.
‘స్రవంతి’ రవికిశోర్ నిర్మించనున్న ఈ చిత్రం ఉగాది పర్వదినాన ఆరంభం కానుంది. అనుపమా పరమేశ్వరన్, మేఘా ఆకాశ్ కథానాయికలు. దేవీశ్రీప్రసాద్ సంగీత దర్శకుడు. ఉదయం 10 గం 25 నిమిషాలకు ఈ చిత్రం ఆరంభం అవుతుంది. ఈ కార్యక్రమం ‘రామ్’ యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఆ విధంగా ఈ చిత్రబృందం కొత్త ట్రెండ్‌కు తెరలేపింది. అంతేకాదు ప్రారంభోత్సవం తర్వాత రామ్ తన అభిమానులతో ఛాట్ చేసేందుకు పచ్చజెండా ఉపారు. ఇంకెందుకు ఆలస్యం? రామ్‌ని ఏమేం అడగాలో డిసైడ్ చేసుకోండి. సమాధానాలు ఎనర్జిటిక్‌గా వస్తాయి. మరి.. రామ్ ఇక్కడ.