Advertisementt

సుక్కు, చరణ్ చిత్రానికి అన్నీ రెడీ..!

Mon 06th Mar 2017 06:39 PM
ram charan,sukumar,samantha,sukku and ram charan movie updates  సుక్కు, చరణ్ చిత్రానికి అన్నీ రెడీ..!
సుక్కు, చరణ్ చిత్రానికి అన్నీ రెడీ..!
Advertisement
Ads by CJ

మార్చి 20 నుండి మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, సుకుమార్ కొత్త చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌రణ్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఇటీవ‌ల పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకున్న చిత్రం శ‌ర‌వేగంగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. చ‌ర‌ణ్‌, సుకుమార్ క్రేజీ కాంబినేష‌న్‌లో సినిమా అన‌గానే ఇటు ప్రేక్ష‌కులు, అటు మెగాభిమానులు సినిమా ఎలా ఉండ‌బోతుందోన‌ని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినీ ట్రేడ్ వ‌ర్గాల్లో కూడా సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. శ్రీమంతుడు, జ‌న‌తాగ్యారేజ్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను రూపొందిస్తుంది. 

సినిమాలో ప్ర‌తి క్యారెక్ట‌ర్ డిఫ‌రెంట్‌గా ఉండేలా చూసుకునే డైరెక్ట‌ర్ సుకుమార్ హీరో, హీరోయిన్ స‌హా ప్ర‌తి క్యారెక్ట‌ర్‌ లుక్, కాస్ట్యూమ్స్ విష‌యంలో స్పెష‌ల్ కేర్ తీసుకున్నారు. ముఖ్యంగా హీరో, హీరోయిన్ కాస్ట్యూమ్స్‌ను ప్ర‌ముఖ డిజైన‌ర్స్‌తో ప్రత్యేకంగా డిజైన్ చేయించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ ఈ సినిమా కోసం అల్రెడి పాట‌ల‌ను కంపోజ్ చేసేశారు. తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్ , త‌మిళ‌నాడు రాష్ట్రాల్లో సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపనున్నారు. 

మార్చి 20 నుండి చిత్రీక‌ర‌ణ జ‌ర‌గ‌నున్న షెడ్యూల్‌లో ప్ర‌ముఖ తారాగ‌ణం పాల్గొంటారు. మార్చి 22 నుండి హీరోయిన్ సమంత యూనిట్‌తో జాయిన్ అవుతుంది. జూలై నెల‌కంతా సినిమా షూటింగ్‌ను పూర్తి చేసేలా డైరెక్ట‌ర్ సుకుమార్ ప్లాన్ చేశారు.  అద్భుత‌మైన క‌థ‌, క‌థ‌నంతో సినిమాను అన్ కాంప్ర‌మైజ్డ్‌గా రూపొందిస్తామ‌ని చిత్ర నిర్మాత‌లు తెలియ‌జేశారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ