Advertisementt

'య‌మ‌న్' సెన్సార్ పూర్తి..ఫిబ్ర‌వ‌రి 24 రిలీజ్‌..!

Thu 23rd Feb 2017 03:58 PM
yaman,yaman movie release details,mahashivaratri,vijay antony,miryala ravindar reddy  'య‌మ‌న్' సెన్సార్ పూర్తి..ఫిబ్ర‌వ‌రి 24 రిలీజ్‌..!
'య‌మ‌న్' సెన్సార్ పూర్తి..ఫిబ్ర‌వ‌రి 24 రిలీజ్‌..!
Advertisement
Ads by CJ

విజయ్‌ ఆంటోని హీరోగా మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌, లైకా ప్రొడక్షన్స్‌ పతాకాలపై జీవ శంకర్‌ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'యమన్‌`. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని మ‌హా శివ‌రాత్రి సంద‌ర్భంగా ఫిబ్ర‌వ‌రి 24న గ్రాండ్‌ రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా...

నిర్మాత మిర్యాల రవిందర్‌రెడ్డి మాట్లాడుతూ - బిచ్చగాడు తర్వాత విజయ్‌ ఆంటోనిగారు హీరోగా నటించిన మరో డిఫ‌రెంట్ మూవీ 'యమన్‌'. ఔట్‌ అండ్‌ ఔట్‌ పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్న సినిమా. రెగ్యులర్‌ కమర్షియల్‌ మూవీలా 'యమన్‌' వుంటుంది. ఇప్పటివరకు విజయ్‌ ఆంటోని అంటే బిచ్చగాడు హీరోగానే అందరూ గుర్తించారు. ఈ సినిమా తర్వాత 'యమన్‌' హీరో అని కూడా పిలుస్తారు. అల్రెడి విడుద‌లైన ఈ సినిమా పాట‌ల‌కు, ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ `యు` స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 24న మహాశివరాత్రి కానుకగా విడుదల చేస్తున్నాం. గత సంవత్సరం బిచ్చగాడు రిలీజ్‌ అయిన టైమ్‌లోనే ఈ చిత్రాన్ని కూడా మహాశివరాత్రి కానుకగా ఫిబ్ర‌వ‌రి 24న‌ గ్రాండ్ లెవల్లో రిలీజ్‌ చేస్తున్నాం. క‌చ్ఛితంగా ఈ సినిమా బిచ్చగాడు కంటే పెద్ద విజయాన్ని సాధిస్తుంది.. అన్నారు. 

విజయ్‌ ఆంటోని, మియా జార్జ్‌, త్యాగరాజన్‌, సంగిలి మురుగన్‌, చార్లీ, స్వామినాథన్‌, మారిముత్తు, జయకుమార్‌, అరుల్‌ డి. శంకర్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈచిత్రానికి సంగీతం: విజయ్‌ ఆంటోని, ఎడిటింగ్‌: వీరసెంథిల్‌ రాజ్‌, మాటలు: భాష్యశ్రీ, ఫైట్స్‌: దిలీప్‌ సుబ్బరాయన్‌, సమర్పణ: మిర్యాల సత్యనారాయణరెడ్డి, నిర్మాతలు: మిర్యాల రవిందర్‌రెడ్డి, లైకా ప్రొడక్షన్స్‌, కథ, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్రఫీ, దర్శకత్వం: జీవశంకర్‌. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ