Advertisementt

చిరు కి ఎంతో ఎగ్జ‌యిటింగ్ మూమెంట్ ఇది..!

Sun 01st Jan 2017 06:15 PM
chiranjeevi,khaidi no 150,mega star,chiranjeevi news year greetings  చిరు కి ఎంతో ఎగ్జ‌యిటింగ్ మూమెంట్ ఇది..!
చిరు కి ఎంతో ఎగ్జ‌యిటింగ్ మూమెంట్ ఇది..!
Advertisement
Ads by CJ

తెలుగు ప్రేక్ష‌కులకు, అభిమానుల‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు. పాతను మ‌రిచి, కొత్త‌ద‌నాన్ని జీవితంలోకి ఆహ్వానిద్దాం. నూత‌న సంవ‌త్స‌రంలో టాలీవుడ్ మ‌రింత ప‌సందుగా ప్రేక్ష‌కుల‌కు చేరువ‌కాబోతోంది. మ‌రిన్ని మంచి సినిమాలు మిమ్మ‌ల్ని అల‌రించేందుకు ఈ ఏడాది వ‌స్తున్నాయి. 

ఈ సంవ‌త్స‌రం నాకు చాలా ప్ర‌త్యేక‌మైన‌ది. దాదాపు తొమ్మిదేళ్ల గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ 150వ సినిమాగా.. 'ఖైదీనంబ‌ర్ 150`చిత్రంతో మీ ముందుకు వ‌స్తున్నాను. ఇది ఎంతో ఎగ్జ‌యిటింగ్ మూవ్‌మెంట్‌. సంక్రాంతికి మీరంద‌రూ మెచ్చే సినిమాగా వ‌స్తోంది. 

నా ఈ రాక‌ను అభిమాన ప్రేక్ష‌కుల‌తో పాటు త‌మ్ముళ్లంతా ప్రేమాభిమానాల‌తో వెల్‌కం చెబుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మీరంతా గ‌ర్వించేలా.. ఇదిరా చిరంజీవి సినిమా అనేలా 'ఖైదీనంబ‌ర్ 150' చిత్రాన్ని ఇస్తున్నా. 

మ‌రోసారి మీకు, మీ కుటుంబ స‌భ్యుల‌కు నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు..

థాంక్యూ..&  హ్యాపీ న్యూ ఇయ‌ర్ ..

- మీ చిరంజీవి

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ