Advertisementt

'శతమానం భవతి' మరో 'బొమ్మరిల్లు'..!

Sun 01st Jan 2017 05:13 PM
shatamanam bhavathi,dil raju,bommarillu,sankranthi release,shatamanam bhavathi release date  'శతమానం భవతి' మరో 'బొమ్మరిల్లు'..!
'శతమానం భవతి' మరో 'బొమ్మరిల్లు'..!
Advertisement
Ads by CJ

శర్వానంద్ - దిల్ రాజు ల 'శతమానం భవతి' 14న విడుదల 

ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాత గా పేరున్న దిల్ రాజు నిర్మాణం లో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరోగా వేగేశ్న సతీష్ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం 'శతమానం భవతి'.  అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 14 న,  సంక్రాంతి కానుక గా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

కుటుంబ కథా నేపధ్యం లో సాగే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుండి క్లీన్ U సర్టిఫికెట్ లభించింది. 

'శతమానం భవతి  తాతా మనవళ్ల  మధ్య ఉండే బంధాన్ని చూపే ఒక అందమైన కుటుంబ కథా చిత్రం. జనవరి 14 న సంక్రాంతి పండుగ కానుకగా ఈ చిత్రం విడుదల అవుతుంది. సంక్రాంతి కి కుటుంబ సమేతం గా చూసి ఆనందించే చిత్రం మా శతమానం భవతి. బొమ్మరిల్లు సినిమా మా సంస్థ కి ఎంత పేరు తెచ్చిందో , ఈ చిత్రం కూడా అంతే పేరుని తెస్తుంది అన్న నమ్మకం ఉంది..' అని నిర్మాత దిల్ రాజు తెలిపారు.  

ఈ చిత్రం లో శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్ , జయసుధ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 

ఈ చిత్రానికి కథ - దర్శకత్వం - మాటలు - స్క్రీన్ప్లే : సతీష్ వేగేశ్న , 

ఎడిటింగ్ - మధు ,

సినిమాటోగ్రఫి  - సమీర్ రెడ్డి, 

సంగీతం -  మిక్కీ జె మేయర్,

నిర్మాతలు : రాజు , శిరీష్ 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ