Advertisementt

దెయ్యం.. భయం పోయింది..!

Tue 13th Dec 2016 11:36 AM
allari naresh,intlo deyyam nakem bhayam,allari naresh intlo deyyam nakem bhayam release date  దెయ్యం.. భయం పోయింది..!
దెయ్యం.. భయం పోయింది..!
Advertisement
Ads by CJ

డిసెంబర్‌ 30న 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం'..!  

అల్లరి నరేష్‌ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ చిత్రాలు హిలేరియస్‌ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్‌ చేశాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి భారీ చిత్రాలను అందించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై భోగవల్లి బాపినీడు సమర్పణలో నిర్మిస్తున్న హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం'. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని డిసెంబర్‌ 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. 

ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ - 'ఔట్‌ అండ్‌ ఔట్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' చిత్రాన్ని డిసెంబర్‌ 30న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం. ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు హార్రర్‌ టచ్‌తో అందర్నీ అలరించే ఈ చిత్రం అల్లరి నరేష్‌ కెరీర్‌లో మరో సూపర్‌హిట్‌ మూవీ అవుతుంది. అలాగే మా బేనర్‌లో మరో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలుస్తుంది' అన్నారు. 

అల్లరి నరేష్‌, కృతిక, రాజేంద్రప్రసాద్‌, పోసాని కృష్ణమురళి, చలపతిరావు, శ్రీనివాసరెడ్డి తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తీక్‌, సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, సమర్పణ: భోగవల్లి బాపినీడు, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జి.నాగేశ్వరరెడ్డి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ