Advertisementt

'ఓం నమో వేంకటేశాయ' రిలీజ్ డేట్ ఫిక్స్..!

Fri 09th Dec 2016 12:02 PM
om namo venkatesaya,nagarjuna,k raghavendra rao,february 10th  'ఓం నమో వేంకటేశాయ' రిలీజ్ డేట్ ఫిక్స్..!
'ఓం నమో వేంకటేశాయ' రిలీజ్ డేట్ ఫిక్స్..!
Advertisement
Ads by CJ

ఫిబ్రవరి 10న అక్కినేని నాగార్జున, కె.రాఘవేంద్రరావుల 'ఓం నమో వేంకటేశాయ' 

అక్కినేని నాగార్జున, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కాంబినేషన్‌లో వచ్చిన అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడి సాయి చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకున్నాయో తెలిసిందే. మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై ఎ.మహేష్‌రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు. అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్‌ లుక్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. నాగార్జున కెరీర్‌లోనే హయ్యస్ట్‌ బిజినెస్‌ జరుగుతోంది. ఓవర్సీస్‌ రైట్స్‌లో, శాటిలైట్‌ రైట్స్‌లో, ఇక్కడ అన్ని ఏరియాల్లో క్రేజీగా బిజినెస్‌ జరుగుతోంది. రాబోయే సినిమాల్లో హై ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్న సినిమా 'ఓం నమో వేంకటేశాయ'. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం గ్రాఫిక్‌ వర్క్‌ జరుగుతోంది. ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

అక్కినేని నాగార్జున హాథీరామ్‌ బాబాగా మరో అద్భుతమైన పాత్ర చేస్తున్న ఈ చిత్రంలో వేంకటేశ్వరస్వామిగా సౌరబ్‌జైన్‌ నటిస్తుండగా, భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క కనిపించనుంది. జగపతిబాబు, ప్రగ్యా జైస్వాల్‌, విమలా రామన్‌, రావు రమేష్‌, వెన్నెల కిషోర్‌, ప్రభాకర్‌, రఘుబాబు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రూపొందిస్తున్న ఈ చిత్రానికి స్వరవాణి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఎస్‌.గోపాల్‌రెడ్డి, జె.కె.భారవి, కిరణ్‌కుమార్‌ మన్నె, గౌతంరాజు ఇతర సాంకేతిక వర్గం.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ