Advertisementt

స్పెష‌ల్ సాంగ్‌లో మెరిసిన గోపీచంద్.. సాక్షిచౌద‌రి..!

Thu 01st Dec 2016 11:45 AM
gopi chandu,director a m jyothi krishna,oxygen movie,music yuvan shankar raja,producer: s aishwarya,camera: vetri,
lyrics: ramajogayya shastri and sree mani,
fights: peter heins,
art: milan  స్పెష‌ల్ సాంగ్‌లో మెరిసిన గోపీచంద్.. సాక్షిచౌద‌రి..!
స్పెష‌ల్ సాంగ్‌లో మెరిసిన గోపీచంద్.. సాక్షిచౌద‌రి..!
Advertisement
Ads by CJ

ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఎ.ఎం.జోతికృష్ణ దర్శకత్వంలో శ్రీసాయిరాం క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.ఐశ్వర్య నిర్మిస్తున్నచిత్రం 'ఆక్సిజన్‌`. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్‌ను శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది. ఈ చిత్రంలో హీరోయిన్‌ సాక్షిచౌద‌రి  ఓ స్పెష‌ల్ సాంగ్ చేసింది. ఈ సందర్భంగా...

నిర్మాత ఎస్‌.ఐశ్వర్య మాట్లాడుతూ ‘’ఇప్ప‌టి వర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని డిఫ‌రెంట్ పాయింట్‌తో గోపీచంద్ హీరోగా ఆక్సిజ‌న్ సినిమాను రూపొందిస్తున్నాం.  సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. సినిమా చాలా బాగా వ‌స్తుంది. గోపీచంద్ క్యారెక్ట‌ర్ చాలా కొత్త‌గా, డిఫ‌రెంట్‌గా ఉంటుంది.  ప్ర‌స్తుతం ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంది. చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా జేమ్స్‌బాండ్, పోటుగాడు, సెల్ఫీరాజా చిత్రాలతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మైన హీరోయిన్ సాక్షిచౌద‌రి ఓ స్పెష‌ల్ సాంగ్ చేస్తుంది. ఈ సాంగ్ చిత్రీక‌ర‌ణ ఈరోజుతో పూర్త‌వుతుంది. ఈ సాంగ్‌ను రామోజీ ఫిలింసిటీలో భారీ దాబా సెట్ వేసి చిత్రీక‌రిస్తున్నాం. ``అరె అదిరిందే నువ్వు కాల‌ర్ గాలిలో యెగ‌రేసి వ‌స్తుంటే...`` అని సాగే పాట‌ను శ్రీమ‌ణి రాయ‌గా బృంద మాస్ట‌ర్ కొరియోగ్ర‌ఫీలో చిత్రీక‌రిస్తున్నాం. ఈ పాట‌లో గోపీచంద్‌, సాక్షిచౌద‌రితో పాటు హీరోయిన్ రాశిఖ‌న్నా, క‌మెడియ‌న్ అలీలు కూడా కాలు క‌దుపుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ చిత్రంలో రాశిఖన్నా, అను ఇమ్మాన్యువల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు జగపతి బాబు కీలకపాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్ర చాలా హైలైట్ గా ఉంటుంది. అలాగే ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా సంగీతం సినిమాకు హైలైట్ గా నిలవనుంది.రామ‌జోగ‌య్య‌శాస్త్రి, శ్రీమ‌ణి అద్భుత‌మైన సాహిత్యానందించారు.  ఈ సినిమాలో మ‌రో సాంగ్‌ను డిసెంబ‌ర్ 2 నుండి పూణేలో చిత్రీక‌రించ‌నున్నాం`` అన్నారు.గోపీచంద్‌, జగపతిబాబు, రాశిఖన్నా, అను ఇమ్మాన్యువల్, ,కిక్‌ శ్యామ్‌,  ఆలీ, బ్రహ్మజీ, సితార, అభిమన్యుసింగ్, షాయాజీ షిండే,చంద్రమోహన్, సుధ, ప్రభాకర్, అమిత్, తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌రాజా, సినిమాటోగ్రఫీ: వెట్రి, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీమ‌ణి,  ఫైట్స్‌:పీటర్ హెయిన్, ఆర్ట్‌: మిలన్‌, నిర్మాత: ఎస్‌.ఐశ్వర్య, దర్శకత్వం: ఎ.ఎం.జోతికృష్ణ.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ