Advertisementt

ప్రీలుక్ ఇలా ఉంటే... ఫస్ట్‌లుక్‌ ఎలా ఉంటుందో?

Tue 29th Nov 2016 09:35 PM
soggadu,hunterrr,avasarala srinivas,hunterrr pre look poster  ప్రీలుక్ ఇలా ఉంటే... ఫస్ట్‌లుక్‌ ఎలా ఉంటుందో?
ప్రీలుక్ ఇలా ఉంటే... ఫస్ట్‌లుక్‌ ఎలా ఉంటుందో?
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌లో అడల్ట్‌ మూవీగా తెరకెక్కి, ఘనవిజయం సాధించిన మూవీ 'హంటర్‌'. ఈ చిత్రం హిందీలో ఎంతో బోల్డ్‌గా, హాట్‌ హాట్‌ సన్నివేశాలతో పాటు ఎంతో ఎమోషనల్‌గా సాగుతుంది. కాగా ప్రస్తుతం ఈ చిత్రం తెలుగులో 'సోగ్గాడు' అనే టైటిల్‌తో 'బాబు చాలా బిజీ' అనే క్యాప్షన్‌తో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. నటునిగా, దర్శకునిగా, రచయితగా తనదైన శైలిలో రాణిస్తున్న అవసరాల శ్రీనివాస్‌ ఇందులో సెక్స్‌ అడిక్ట్‌గా నటిస్తున్నాడు. దాహం, ఆకలి, నిద్ర... వీటిలాగానే సెక్స్‌ కూడా నిత్యావసరమని వాదించి, పెళ్లి చేసుకోకుండా అమ్మాయిలు, ఆంటీలతో సెక్స్‌ను ఎంజాయ్‌ చేస్తూ, అక్రమసంబంధాలు పెట్టుకుంటూ టీనేజ్‌ నుంచే సెక్స్‌ అడిక్ట్‌గా మారిన ఓ కుర్రాడు వీటన్నింటికీ ఫుల్‌స్టాప్‌ పెట్టి పెళ్లి చేసుకోవాలని డిసైడ్‌ అయిన తర్వాత ఎలాంటి పరిస్థితులు తలెత్తాయనేది ఈ చిత్రం స్టోరీ. మంచి ప్రాధాన్యం ఉన్న వివిధ షేడ్స్‌ కలిగిన పలు పాత్రలు చేస్తోన్న శ్రీని అవసరాల స్టార్స్‌ చిత్రాలలో చిన్నపాత్రలు కూడా చేస్తూ, ఇటీవల వచ్చిన హిట్‌ మూవీ 'జెంటిల్‌మేన్‌' చిత్రంలో విలన్‌గా కూడా నటించి మెప్పించాడు. ఆయన ఈ అడల్ట్‌ మూవీలో చేయబోయే పాత్రపై అందరిలోనూ ఎంతో ఆసక్తి ఉంది. కానీ హిందీలో తెరకెక్కించినట్లుగా అంత బోల్డ్‌గా తీయడం, అందరినీ మెప్పించేలా తీయడం తెలుగులో సాధ్యమేనా? అని కొందరు సందేహాలు వెలిబుచ్చుతున్నారు. కానీ హిందీలో లాగానే ఈ చిత్రం తెలుగులో కూడా బోల్డ్‌గా సాగుతూ, అదే స్థాయిలో మనవారికి నచ్చే ఎమోషనల్‌ సీన్స్‌తో సాగుతుందని, ఈ చిత్రంలో ఉన్న లోతైన సందేశం తనని ఆకట్టుకుందని శ్రీని అవసరాల అంటున్నాడు.

కాగా ఈ చిత్రంలో ఆయన సరసన మిస్టిచక్రవర్తి, తేజస్వి, సుప్రియ, శ్రీముఖి నటిస్తున్నారు. వీరితో శ్రీని అవసరాలకు హాట్‌ హాట్‌ సీన్స్‌ ఉండబోతున్నాయి. కొత్త దర్శకుడు నవీన్‌మేడారం ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మన ప్రేక్షకులను అలరించేలా ఈయన ఎలా తీస్తున్నాడు? అనే దానిపై ఈ చిత్ర విజయం ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. తాజాగా విడుదలైన ఈ చిత్రం ప్రీలుక్‌ యువతను మత్తెక్కిస్తూ, అందరి దృష్టిని, మరీ ముఖ్యంగా ఈ తరహా చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకుల నుంచి విశేష స్పందన రాబడుతోంది. ప్రీలుక్కే ఇలా ఉంటే మరి ఫస్ట్‌లుక్‌తోపాటు టీజర్లు, ట్రైలర్స్‌ ఎలా ఉంటాయా? అనే ఆసక్తిని రేకెత్తిస్తుండటంతో పాటు డిసెంబర్‌ లేదా జనవరిలో విడుదల కానున్న ఈ చిత్రం తెరపై ఎలా ఉంటుందో చూడాలనే ఆసక్తి ఒక వర్గం ప్రేక్షకులు చూపిస్తున్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ