Advertisementt

గోపీచంద్-సంపత్ నంది ల సినిమా సగమైంది!

Fri 25th Nov 2016 08:27 PM
gopichand,sampath nandi,second shedule,slum area,gopi chanda new movie  గోపీచంద్-సంపత్ నంది ల సినిమా సగమైంది!
గోపీచంద్-సంపత్ నంది ల సినిమా సగమైంది!
Advertisement
Ads by CJ

గోపీచంద్ - సంపత్ నంది క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ సెకండ్ షెడ్యూల్ పూర్తి..!

మాస్ స్టార్ గోపీచంద్, హ్యాట్రిక్ హిట్స్ డైరెక్టర్ సంపత్ నందిల క్రేజీ కాంబినేషన్లో, శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్ పై జె భగవాన్, జె పుల్లారావు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇప్పటికే థాయ్‌ల్యాండ్ లో 32 రోజుల ఫస్ట్ షెడ్యూల్ జరుపుకున్న సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ లోని స్లమ్స్ లో ప్రత్యేకంగా వేసిన ఇంటి సెట్లో సెకండ్ షెడ్యూల్ కంప్లీట్ అయింది.

ఈ సందర్భంగా నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు మాట్లాడుతూ... గోపీచంద్, సంపత్ నంది కాంబినేషన్లో మేము నిర్మిస్తున్న సినిమా షూటింగ్ 50 శాతం పూర్తైంది. 15 రోజుల సెకండ్ షెడ్యూల్ ను సికింద్రాబాద్ స్లమ్స్ లో పూర్తి చేశాం. గోపీచంద్, హన్సిక, వెన్నెల కిషోర్, బిత్తిరి సత్తి, విద్యుల్లేఖరామన్, చంద్రమోహన్, సీత ఇలా ఈ షెడ్యూల్లో యాక్ట్ చేసిన అందరు ఆర్టిస్టులు, మేకప్ వేసుకోకుండా నటించడం విశేషం. డైరెక్టర్ సంపత్ నంది, కెమేరా మ్యాన్ సౌందర్ రాజన్ ఈ సన్నివేశాల్లోని ఎమోషన్లను అద్భుతంగా తెరకెక్కించారు. 2014లో మిస్ దీవా బ్యూటీ పెజంట్ లో పార్టిసిపేట్ చేసిన శ్రీ రాథే ఈ సినిమాలో గోపీచంద్ చెల్లెలిగా నటించగా, 2014 మిస్ ఇండియా కంటెస్టెంట్ నటాషా అస్సాదీ హీరో ఫ్రెండ్ గా నటించారు.

నటీనటవర్గం : గోపీచంద్, హన్సిక మొత్వానీ, క్యాథరీన్ ట్రెసా, నికితిన్ థీర్ (తంగబలి), తనికెళ్ల భరణి, ముకేష్ రిషి తదితరులు, సినిమాటోగ్రఫీ : సౌందర్ రాజన్, ఎడిటింగ్ : గౌతమ్ రాజు, ఫైట్స్ : రామ్ లక్ష్మణ్, ఆర్ట్ డైరెక్టర్ : బ్రహ్మ కడలి, స్క్రిప్ట్ కోఆర్డినేటర్ : సుధాకర్ పావులూరి, ప్రొడక్షన్ కంట్రోలర్ : బెజవాడ కోటేశ్వరరావు, బ్యానర్ : శ్రీ బాలాజీ సినీ మీడియా, నిర్మాతలు : జె.భగవాన్, జె.పుల్లారావు, కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, దర్శకత్వం : సంపత్ నంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ