Advertisementt

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (07-11-16)..!

Tue 08th Nov 2016 06:06 PM
producer miryala ravinder reddy interview matter,ram gopal varma hollywood movie 340 cr,ekkadiki pothavu chinnavada release date news  టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (07-11-16)..!
టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (07-11-16)..!
Advertisement
Ads by CJ
>`సాహ‌సం శ్వాస‌గా సాగిపో` సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం - నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి

నాగచైతన్య, మంజిమ మోహన్ జంటగా గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న మరో విభిన్న కథా చిత్రం సాహసం శ్వాసగా సాగిపోస‌. మిర్యా ల‌స‌త్య‌నారాయ‌ణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్‌ బేనర్‌పై గౌతమ్‌ వాసుదేవ మీనన్‌ దర్శకత్వంలో మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను న‌వంబ‌ర్ 11న విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డితో సినిమా గురించిన విశేషాల‌ను తెలియ‌జేశారు.. నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి మాట్లాడుతూ - 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా చాలా బాగా వచ్చింది. రెహమాన్‌గారి మ్యూజిక్‌తో గౌతమ్‌మీనన్‌గారి స్టయిల్లో సినిమా బాగా వచ్చింది. సినిమా కొన్ని సాంకేతిక కారణాల కారణంగా కొంత ఆలస్యమైన మాట నిజమే అయితే సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం..త‌ప్ప‌కుండా  ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తుంది. ఫస్టాప్‌ అంతా బ్యూటీఫుల్‌లవ్‌స్టోరీ, సెకండాఫ్‌ యాక్షన్‌ పార్ట్‌తో థ్రిల్లింగ్‌గా ఉంటుంది. చైతన్య ప్రేమమ్‌ హిట్‌ తర్వాత 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా విడుదలవుతుండటం చాలా మంచిదయ్యింది. మా సినిమాకు ప్రేమమ్‌ సక్సెస్‌ బాగా హెల్ప్‌ అవుతుంది. హీరో హీరోయిన్‌ మధ్య ఉండే ప్రేమకు ఓ సమస్య వస్తుంది, ఆ సమస్య కోసం హీరో ఎలాంటి సాహసం చేశాడనేదే మా సినిమా. డైరెక్టర్‌ శ్రీవాస్‌గారితో నాకు మంచి అనుబంధం ఉంది. దానివల్ల నేను ఆయన్ను ఓ సినిమా గురించి తరుచూ కలిసే వాడిని, అప్పుడు డిక్టేటర్‌ సినిమా షూటింగ్‌ జరుగుతుంది. ఆ సమయంలో నేను అక్కడ కోనవెంకట్‌గారిని కలిశాను. గౌతమ్‌మీనన్‌ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రెహమాన్‌ మ్యూజిక్‌ డైరెక్షన్‌లో రానున్న సాహసం శ్వాసగా సాగిపో సినిమా గురించి చెప్పారు. 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమా అలా కుదిరింది. మా కుటుంబ సభ్యులంతా వ్యాపారాల్లో స్థిరపడ్డవారే. నాకు సినిమా అంటే ఆసక్తి అనడం కంటే ఒకింత ఎక్కువే ఇష్టం ఉండేది. దాంతో దర్శకుడు కావాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి వచ్చి కొంతకాలం అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కూడా వర్క్‌ చేసిన తర్వాత నిర్మాతగా మారాను. నాకు మెగాపవర్‌స్టార్‌ రాంచరణ్‌తో సినిమా చేయాలనే కోరిక ఉంది. ఆయ‌న అవ‌కాశం ఇస్తే త‌ప్ప‌కుండా రాంచ‌ర‌ణ్‌గారితో సినిమా చేస్తాను. ఇక బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా బోయపాటిగారి దర్శకత్వంలో రూపొంద‌నున్న సినిమా ఈ నవంబర్‌ 16 నుండి రెగ్యులర్‌ చిత్రీకరణ జరుపుకుంటుంది. అలాగే ఫిభ్రవరిలో గోపీచంద్‌తో సినిమా ఉంటుంది. విజయ్‌ ఆంటోని నటించిన యెమన్‌ సినిమాను తెలుగులో విడుదల చేయబోతున్నాం. అలాగే ఈట్టి అనే తమిళ సినిమా రీమేక్‌ హక్కులు కూడా తీసుకున్నాం. ఈ సినిమాను రీమేక్‌ చేయాలా లేక అనువాదం చేయాలా అని ఆలోచిస్తున్నాం. ఇక సాహసం శ్వాసగా సాగిపో సినిమా ఆడియో పెద్ద హిట్‌ అయ్యింది. సినిమాను కూడా పెద్ద హిట్‌ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు. 

 

>నా మొదటి అంతర్జాతీయ చిత్రం 'న్యూక్లియర్'--  రామ్ గోపాల్ వర్మ

మామూలు కాలేజ్ గొడవల్లో,సైకిల్ చైన్లతో కొట్టుకునే నేపధ్యంలో,నేను తీసిన శివ తో మొదలయ్యిన నా కెరియర్ ఇవ్వాల దేశాల మధ్య గొడవల్లో న్యూక్లియర్ బాంబులు పేల్చుకునే నేపధ్యంలో ఇంగ్లీష్ లో తియ్యబోతున్నన్యూక్లియర్ వరకూ వచ్చినందుకు, నేను ఒకింత కాకుండా చాలా చాలా గర్వపడుతున్నాను.  

సి యమ్ ఎ గ్లోబల్ నిర్మించబోతున్న నా న్యూక్లియర్ చిత్రంచలనచిత్ర చరిత్రలోనే అతి ఖరీదైన చిత్రంగా రూ.340కోట్ల బడ్జెట్ తో రూపుదిద్దుకోబోతోంది. ఇది కూడా అంతర్జాతీయ యాక్టర్ల రెమ్యునరేషన్  లెక్కవేయకుండా కేవలం మేకింగ్ కి కేటాయించిన బడ్జెట్. 

ఇంత భారీ బడ్జెట్ కి కారణం ఈ చిత్రానికి ఎంచుకున్న అంశాన్ని ఇంతవరకు ఎవరూ చూడనంత, ఊహించలేనంత స్కేల్ లో తెరకెక్కించాలన్న నా నిర్మాతల నిర్ణయం. 

ఈ చిత్రం అమెరికా, చైనా, రష్యా, యెమెన్, ఇండియాల్లో షూటింగ్ జరుపుకోబోతుండగా ఇందులో అమెరికా, చైనా, రష్యా, బ్రిటన్,యెమెన్, ఇండియాలకు చెందిన నటీనటులు నటించనున్నారు. 

న్యూక్లియర్ చిత్రానికి ఎంచుకున్నది ఒక అత్యంత వినూత్నమైన కథాంశం. అమెరికా, యూరప్, మధ్య ఆసియా..ఇలా ఎక్కడైనా ఈ రోజున అందరినీ ప్రధానంగా భయపెడుతున్న వారు తీవ్రవాదులు...ప్రతి ఉదయం నిద్ర లేస్తూనే ప్రపంచంలో ఎక్కడో అక్కడ ఏదో ఒక భయంకరమైన దాడికి సంబంధించిన వార్త మనం వింటూనే వుంటాం.

న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్స్ ని కూల్చేసినవిమానాలు, రోడ్ల మీద జనాన్ని గుద్ది పడేస్తూ  దున్నుకెళ్లే ట్రక్కులు,ప్యారిస్, ముంబాయి వంటి నగరాల్లో వందలమంది అమాయికుల్నిచంపి పారేస్తున్న దృశ్యాలు... ఇలా ఎన్నో ఎన్నెన్నో చూస్తున్నాం వింటున్నాం. కానీ వాటన్నింటికన్నా ఇంకా చాల ఎక్కువుగా అసలు ఊహించటానికే భయపడే అత్యంత భయంకరమైన ఒళ్ళు గగుర్పొడిచే ఆలోచన - ఒక వేళ ఏ టెర్రరిస్ట్ చేతికన్నా న్యూక్లియర్ బాంబ్ దొరికితే అప్పుడు పరిస్థితి ఏమిటి? – ఇదే న్యూక్లియర్ చిత్రానికి సంబందించి నా కథ.

చాలా తీవ్రవాద సంస్థలు న్యూక్లియర్  బాంబులు ఉన్న దేశాలపై కాలుదువ్వుతూ వాటిని కబళించే ప్రయత్నాలు చేస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ ఆలోచనలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 70 ఏళ్ల తర్వాత కూడా హిరోషిమా, నాగసాకిలపై పడ్డ న్యూక్లియర్ బాంబ్ ధ్వనులు ఇప్పటికీ ప్రపంచపు కర్ణపుటాల్లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయంటే, ఆ భయం యొక్క మాగ్నిట్యూడ్ ఎంత పెద్దదో  అర్థమవుతుంది. 

70 ఏళ్ళ క్రిందట జపాన్ లో జరిగిన ఆ విస్ఫోటం పరిస్థితే అలా ఉంటే ,ఇప్పుడు మనమున్న ఈ కాలంలో ఒక పెద్ద సిటీ లోఅటువంటి న్యూక్లియర్ విస్ఫోటనం జరిగితే? కేవలం ఇరాక్,న్యూక్లియర్ బాంబులు కలిగి ఉందేమోనన్న అనుమానంతో ఆ దేశం పై అమెరికా చేసిన దాడి  వల్ల,చాలదేశాలమధ్య విద్వేషాలు పెరగడం, మిత్రదేశాలు శత్రుదేశాలుగా మారిపోవడం, గవర్నమెంట్లు కుప్పకూలడం, మూకుమ్మడిగా ఐసిస్ లాంటి విపరీత తీవ్రవాదులు పుట్టడం జరిగాయంటే, ముంబాయి లాంటి మహా నగరంలో ఒకవేళ ఇప్పుడు నిజంగా న్యూక్లియర్ బాంబ్ పేలితే అది కచ్చితంగా మూడో ప్రపంచయుధ్ధానికి తెర లేపి, తద్వారా మొత్తం ప్రపంచాన్ని అంతం చేస్తుంది.

ఇదే న్యూక్లియర్ పేరుతో నేను ఇంగ్లీష్ లో తీయబోయే నా మొదటి అంతర్జాతీయ చిత్ర కధాంశం. --- రామ్ గోపాల్ వర్మ

 

>ప్ర‌పంచ‌వ్యాప్తంగా న‌వంబ‌ర్ 18న 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా'  విడుద‌ల‌                                                   

>'స్వామిరారా', 'కార్తికేయ‌', 'సూర్య vs సూర్య' లాంటి వైవిధ్య‌మైన క‌థాంశాల‌తో స‌రికొత్త క‌థ‌నాల‌తో  సూప‌ర్‌హిట్ చిత్రాల‌తో యూత్‌లో  యంగ్ఎన‌ర్జిటిక్ స్టార్ గా ఎదిగిన హీరో నిఖిల్ మ‌రో వినూత్న‌మైన క‌థాంశంతో వ‌స్తున్న చిత్రం 'ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా'.  ఈచిత్రంలో నిఖిల్ కి జంట‌గా  21F ఫేం హెబాప‌టేల్ మ‌రియు త‌మిళం లో 'అట్ట‌క‌త్తి', 'ముందాసిప‌త్తి', 'ఎధిర్ నీచ‌ల్' లాంటి వ‌ర‌స సూప‌ర్‌హిట్స్ లో నిటించిన నందిత‌ స్వేత లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇలాంటి క్రేజి ప్రోజెక్ట్ ని  'టైగ‌ర్' ఫేం వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌కుడిగా తెర‌కెక్కిస్తున్నారు.  మేఘ‌న ఆర్ట్స్ నిర్మాణంలో మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్ లో ఢిఫ‌రెంట్ లవ్ స్టోరి ని తెర‌కెక్కిస్తున్నారు. ఈచిత్రానికి సంబందించిన మెద‌టి సాంగ్ ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వి.వినాయక్ చేతుల మీదుగా విడుద‌ల చేశారు. ఆడియోని ఈ వార‌మే విడుద‌ల చేసి న‌వంబ‌ర్ 18న చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.  

ఈ సంధర్బం గా  హీరో నిఖిల్ మాట్లాడుతూ మేఘ‌న ఆర్ట్స్ బ్యాన‌ర్ లో ఢిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో ఏక్క‌డికి పోతావు చిన్న‌వాడా చిత్రాన్ని చేశాము.  మా టీజ‌ర్ ని చూసిని ప్ర‌తి ఓక్క‌రూ చాలా ఇంట్ర‌స్టింగ్ గా వుంద‌ని చెప్తున్నారు. మా చిత్రం కూడా ఆ రేంజి ఇంట్రెస్ట్ ని క‌లిగిస్తుంది. వినాయ‌క్ గారు చేతుల మీదుగా మా మెద‌టి సాంగ్ విడుద‌ల కావ‌టం చాలా ఆనందంగా వుంది. ఇప్ప‌టికే సెన్సారు కార్క‌క్ర‌మాలు పూర్తిచేసుకుని యు/ఏ స‌ర్టిఫికేట్ తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా న‌వంబ‌ర్ 18న విడుద‌ల చేస్తున్నాము.  శేఖ‌ర్ చంద్ర అందించిన ఆడియో ఈ వార‌మే విడుద‌ల చేస్తాము.ఆద్యంతం న‌వ్వించ‌మే కాకుండా సూపర్ థ్రిల్ వుంటుంది. హెబాప‌టేల్ , నందితా శ్వేత ఎక్స‌లెంట్ గా చేశారు. ఇంకా వెన్నెల కిషోర్ చాలా బాగా న‌వ్వించాడు. నా గ‌త చిత్రాల మాదిరిగానే ఈ చిత్రం కూడా అంద‌రిని ఆక‌ట్టుకుంటుంది. గెట్ రెడి టు థ్రిల్ అని అన్నారు.

ద‌ర్శ‌కుడు వి.ఐ.ఆనంద్ మాట్లాడూతూ ఎక్క‌డికి పోతావు చిన్నివాడా చిత్రానికి సంభందించి ప్ర‌తి విష‌యాన్ని మీడియా వారు చాలా పాజిటివ్ గా  ప్రేక్ష‌కుల వ‌ద్ద‌కు తీసుకువెళ్ళారు. మా టీజ‌ర్ కి చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే ఈరోజు ద‌ర్శ‌కుడు వినాయక్ గారు చేతుల మీదుగా మా మెద‌టి సాంగ్ ని విడుద‌ల చేశాము. ఆడియో ని అతిత్వ‌ర‌లో విడుద‌ల చేసి చిత్రాన్ని న‌వంబ‌ర్ 18 న విడుదల చేస్తున్నాము. ఎంతో బిజిగా వుండి మా సాంగ్ విడుదల చేసిన వినాయ‌క్ గారికి మా ధ‌న్య‌వాదాలు అని అన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ