Advertisementt

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (04-11-16)..!

Sat 05th Nov 2016 02:08 PM
k. k. radhamohan 3 movies,one movie factor logo launch news,show time song launch news,bellamkonda srinivas,boyapati,dwaraka creations,production no 2 launch news  టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (04-11-16)..!
టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (04-11-16)..!
Advertisement
Ads by CJ
>'మీలో ఎవరు కోటీశ్వరుడు' నిర్మాత కె.కె.రాధామోహన్‌ మూడు కొత్త చిత్రాలు 

అధినేత, ఏమైంది ఈవేళ, బెంగాల్‌టైగర్‌ వంటి సూపర్‌హిట్‌ అందించి ప్రస్తుతం లక్ష్మీరాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో నిర్మించిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' సెన్సార్‌ పూర్తి చేసుకొని నవంబర్‌లోనే విడుదలకు సిద్ధమైంది. కాగా, మరో మూడు చిత్రాలను నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నారు నిర్మాత కె.కె.రాధామోహన్‌. 

యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా జనవరిలో ఓ చిత్రాన్ని ప్రారంభిస్తున్నారు. అలాగే ఎగ్రెసివ్‌ హీరో గోపీచంద్‌ కథానాయకుడిగా ఇంకో చిత్రాన్ని నిర్మించనున్నారు. యూత్‌స్టార్‌ నితిన్‌ హీరోగా మరో చిత్రాన్ని ప్లాన్‌ చేస్తున్నారు. ఈ మూడు చిత్రాల ప్లానింగ్‌లో, 'మీలో ఎవరు కోటీశ్వరుడు' చిత్రం విడుదల సన్నాహాల్లో నిర్మాత కె.కె.రాధామోహన్‌ చాలా బిజీగా వున్నారు. 

>వన్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ లొగొ లాంఛ్

కొత్త పాత నటీనటులు,సాంకెతిక నిపుణుల  కలయికలో వన్ మూవీ ఫ్యాక్టరీ పతాకంపై ఎస్.ప్రశాంత్ కుమార్,  కె.సుదర్శన్ రెడ్డి వరుస చిత్రాలను  నిర్మించెందుకు సన్నద్దమయ్యారు. కాగా ఈ బ్యానర్ లొగొ ఆవిష్కరణ శుక్రవారం ఫిలిం చాంబర్ లో జరిగింది. నిర్మాతలు రాజ్ కందుకూరి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, సాయివెంకట్, ఆర్.కె.గౌడ్, నటుడు చిత్రం శీను ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులిగా  పాల్గొని బ్యానర్ ను లాంఛ్ చేశారు.

రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. మంచి కాన్సెప్ట్ తో అందరు కొత్త వారితొ సినిమాలు చెస్తె ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడు ఉంటుంది. ఈ బ్యానర్ లో అలాంటి సినిమాలు ఎన్నొ రావాలని ఆశిస్తున్నామన్నారు..

రామసత్యనారాయణ మాట్లాడుతూ.. 

చిన్న సినిమాల నిర్మాణం,వటి విజయంతోనె ఎంతోమంది ప్రతిభావంతులు చిత్ర పరిశ్రమకు వస్తారు. ఈ బ్యానర్ ద్వారా అలాంటి టాలెంటెడ్ నటులు, టెక్నిషియన్స్ ఎందరొ రావాలని ఆసిస్తున్నానన్నారు

సాయి వెంకట్ మాట్లాడుతూ.. ప్రశాంత్ మా నెల్లూరి వాసి. మంచి సినిమాలు చెయాలన్న తలంపుతొ పరిశ్రమలొకి వచ్చారు. కథను నమ్ముకొని సినిమా చెస్తె విజయం వరిస్తుందన్నారు.

నిర్మాత ప్రశాంత్ మాట్లాడుతూ.. కొత్త కాన్సెప్ట్ తో సినిమాలు చేయాలని చిత్త పరిశ్రమలొకి అడుగు పెట్టాము. సాయి వెంకట్ గారి ప్రొత్సాహం మరువలెనిది. త్వరలొనె సినిమా చిత్రికరణను ప్రారంబిస్తామన్నారు..

>'రామ రీల్స్' 'షో టైమ్'.

ప్రతిష్ఠాకరమైన రామ గ్రూప్ సినిమా నిర్మాణంలో 'రామ రీల్స్' బ్యానర్ పై నిర్మిస్తున్న తొలి చిత్రం షో టైమ్. ప్రేక్షకులకు నూరు శాతం వినోదం అందించాలనే సంకల్పంతో ఉత్తమ విలువలతో అందిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వ బాధ్యతలు 'మర్యాద రామన్న', 'ఈగ' చిత్రాల రచయిత ఎస్. ఎస్. కాంచి చేపడుతున్నారు.  సంగీతం, శబ్ద కల్పన ఎమ్. ఎమ్. కీరవాణి కాగా, కె. భూపతి ఛాయాగ్రహణంతో జాన్ సుధీర్ పూదోట నిర్మించారు. దర్శకులు ఎస్ ఎస్ కాంచి గారు మాట్లాడుతూ లెజెండరీ  మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్.ఎమ్. కీరవాణి గారి చేతుల మీదుగా సినిమా యూనిట్ సమక్షంలో మా చిత్రం లోని ఒక సాంగ్ ని రేడియో మిర్చిలో లాంచ్ చేసాము అన్నారు. ఇతర నటీ, నట, సాంకేతిక నిపుణుల వివరాలు.

>సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న‘ఎంత వరకు ఈ ప్రేమ’

`రంగం` వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడైన జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ `కవలై వేండాం`. ఈ చిత్రాన్ని తెలుగులో `ఎంత వరకు ఈ ప్రేమ` అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. `యామిరుక్క బ‌య‌మేన్‌` ఫేమ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటోంది.  

డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ- ` సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌యి ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈమధ్యే విడుదలైన పాటలకు సైతం అభిమానుల్లో మంచి రెస్పాన్స్ వస్తోంది. చాలా మంచి ఫీల్ గుడ్ సినిమా ఇది. జీవా, కాజ‌ల్ జంట న‌టించిన ప్ర‌తి సీన్ ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. సినిమాకు లియోన్ జేమ్స్ మ్యూజిక్‌, అభినంద‌న్ రామానుజ‌మ్ సినిమాటోగ్ర‌ఫీ పెద్ద ఎసెట్ అవుతాయి. తెలుగులో వెన్నలకంటిగారు అందించిన మాట‌లు, పాట‌లు చాలా చక్కగా కుదిరాయి. ఈ సినిమాకు డ‌బ్బింగ్ చెప్పిన క‌ళాకారులు కూడా సినిమా చాలా బాగా ఉంద‌ని మెచ్చుకున్నారు. ఈ సినిమా అవుటండ్ అవుట్ ఎంట‌ర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో పాటు సినిమా ప్రేక్షకుల మ‌న‌సుకు హ‌త్తుకునేలా ఆహ్లాదంగా ఉంటుంది. జీవా, కాజ‌ల్ న‌ట‌న‌తో పాటు మిగ‌తా ఆర్టిస్టుల పెర్‌ఫార్మ‌న్స్‌, టెక్నిషియ‌న్ స‌పోర్ట్‌తో సినిమా చాలా బాగా వ‌చ్చింది.  సినిమాను ఈనెలలో విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నాం.’ అన్నారు.

>బోయపాటి శ్రీను, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో ద్వార‌క క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెం2 ప్రారంభం

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను, యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో  ద్వార‌క క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ఫై మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మాత‌గా  ప్రొడ‌క్ష‌న్ నెం.2  చిత్రం శుక్ర‌వారం ఉద‌యం హైద‌రాబాద్‌లో సినిమా కార్యాల‌యంలో లాంచ‌నంగా ప్రారంభ‌మైంది. ముహుర్త‌పు స‌న్నివేశానికి ప్రొడ్యూస‌ర్ మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి త‌న‌య మిర్యాల ద్వార‌క‌, ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను త‌న‌య బోయ‌పాటి జోషిత క్లాప్ కొట్ట‌గా, తొలి స‌న్నివేశానికి బోయ‌పాటి శ్రీను త‌న‌యుడు మాస్ట‌ర్ బోయ‌పాటి హ‌ర్షిత్ కెమెరా స్విచ్చాన్ చేశారు. రీసెంట్‌గా స‌రైనోడు వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించిన బోయ‌పాటి శ్రీను బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో త‌న మార్కు ఎంట‌ర్‌టైన్మెంట్‌తో ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ కొత్త చిత్రాన్ని  హై బ‌డ్జెట్‌తో రూపొందించ‌నున్నారు. తొలి చిత్రం అల్లుడు శీనుతో మాస్ హీరోగా తెలుగు సినిమాకు ప‌రిచ‌య‌మై త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్న‌బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బోయ‌పాటి చిత్రంలో స‌రికొత్త లుక్‌, క్యారెక్ట‌ర్‌తో క‌న‌ప‌డ‌నున్నాడు. ఈ సంద‌ర్భంగా...

చిత్ర‌నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ - ``బోయ‌పాటి శ్రీను, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కాంబినేష‌న్‌లో మా ద్వార‌క క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సినిమా చేస్తుండ‌టం ఆనందంగా ఉంది. ఈరోజు సినిమా లాంచ‌నంగా ప్రారంభమైంది. ఈ నవంబ‌ర్ 16నుండి హైద‌రాబాద్‌లో రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ ప్రారంభం అవుతుంది. దేవిశ్రీప్ర‌సాద్‌గారి సంగీతం, రిషి పంజాబి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. త్వ‌ర‌లోనే మిగిలిన న‌టీన‌టులు వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం`` అన్నారు. 

ఈ చిత్రానికి ఆర్ట్ః సాహి సురేష్‌, ఎడిట‌ర్ః కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఫైట్స్ః రామ్‌లక్ష్మ‌ణ్‌, సినిమాటోగ్ర‌ఫీః రిషి పంజాబి, మ్యూజిక్ః దేవిశ్రీప్ర‌సాద్‌, నిర్మాతః మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః బోయ‌పాటి శ్రీను

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ