తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్‌ను సంపాందించుకున్న అగ్ర కథానాయకుడు సూర్య కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం సింగం-3. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు. సింగం సిరీస్‌లో భాగంగా రూపొందుతున్న ఈ చిత్రానికి హరి దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. తెలుగులో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. శుక్రవారం చిత్ర మోషన్ పోస్టర్‌ను విడుదలచేశారు. ఈ సందర్భంగా మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ సూర్య, హరి కాంబినేషన్‌లో రూపొందిన సింగం, సింగం-2 చిత్రాలు చక్కటి విజయాల్ని సాధించాయి. వాటికి కొనసాగింపుగా వస్తోన్న చిత్రమిది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నాం. ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులతో సాగుతుంది. నీతినిజాయితీలే ఊపిరిగా భావించే ఓ పోలీస్ అధికారి వృత్తి నిర్వహణలో తనకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. సూర్య నటన, పాత్ర చిత్రణ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. తెలుగు ప్రేక్షకుల్ని అలరించే అన్ని అంశాలున్న చిత్రమిది.మోషన్ పోస్టర్‌కు చక్కటి స్పందన లభిస్తోంది. నవంబర్ 7న చిత్ర టీజర్‌ను, అదే నెలాఖరున చిత్ర గీతాల్ని విడుదల చేస్తాం. డిసెంబర్ 16న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని తెలిపారు. రాధికా శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: హేరీస్ జైరాజ్.
>అక్కినేని నాగార్జున విడుదల చేసిన `నరుడా..! డోనరుడా..!` ఆడియోహీరో సుమంత్ కథానాయకుడుగా రూపొందుతోన్న చిత్రం `నరుడా..! డోనరుడా..!`. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రమా రీల్స్, ఎస్.ఎస్.క్రియేషన్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది.మల్లిక్‌రామ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వై.సుప్రియ, సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ఈ సినిమా పాటలు విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఆడియో సీడీలను అక్కినేని నాగార్జున విడుదల చేయగా తొలి సీడీని అక్కినేని అఖిల్ అందుకున్నారు. ఈ సందర్భంగా...
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ - హిందీలో విడుదలైన విక్కీ డోనార్‌ని ఆధారంగా చేసుకుని తీస్తున్నారు. సుమంత్ చాలా రోజుల తర్వాత మంచి స్క్రిప్ట్ తో వస్తున్నాడు. చక్కటి కామెడీ రోల్‌ని చేశాడు. బావుంటుందని నమ్మి చేశాడు. ఈ సినిమాలో మెసేజ్ ఉంది. ఎంటర్‌టైనర్ ఉంది. హిందీలో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. వీర్య దానం అనే కాన్సెప్ట్ పై సినిమాను తెరకెక్కించారు. పిల్లలు పుట్టే సమయంలో భార్య భర్తలు మధ్య భయాలు, కాంప్లెక్స్ లు వంటి వాటికి సంబంధించిన సినిమా. ఇప్పటి రోజుల్లో మెసేజ్, ఎంటర్‌టైన్‌మెంట్ కలిసి ఉన్న సినిమాలు రావడం కష్టమైపోయాయి. కానీ ఈ సినిమాకు కుదిరాయి. కొత్తగా ఉన్నప్పుడు ఏ కథనైనా నేను కాదనను. ఇలాంటి కథ నాకు వచ్చినా చేసేవాడిని. ఇప్పుడు నమో వేంకటేశా చేస్తున్నా. ఆ తర్వాత కూడా న్యూ జానర్‌లో ట్రై చేద్దామని ఓ కథ విన్నా. అది విన్నప్పట నుంచి నిద్ర కూడా పట్టలేదు. అంత బావుంది అని అన్నారు.
అఖిల్ మాట్లాడుతూ - చాలా డిఫరెంట్ మూవీ తెలుగులో ఇలాంటి సినిమా చేయాలంటే గట్స్ కావాలి. ఇలాంటి కథతో సినిమా చేయాలని నాకూ ఉన్నా నేను చేయలేను. సుమంత్ చాలా మంచి సబ్జెక్ట్ తో ముందుకొస్తున్నాడు. హిట్ అవుతుందని భావిస్తున్నాను అని చెప్పారు.
యూత్ సహా అందరికీ నచ్చే సినిమా
సుమంత్ మాట్లాడుతూ - గోల్కొండ హైస్కూల్ సినిమా చేసేటప్పుడు రామ్మోహన్ నాకు ఈ సినిమా గురించి చెప్పారు. చేయమని ఐడియా ఇచ్చారు. ఆయన వల్లే ఈ కథను చూజ్ చేసుకుని చేయడానికి నిర్ణయించుకున్నాను. ఈ సినిమాలో కామెడీ ఉంది. యువత సహా అందరికీ సినిమా నచ్చేలా ఉంటుంది. ఎక్కడా బోర్ కొట్టదు. మంచి సినిమాతో మరలా వస్తున్నందుకు ఆనందంగా ఉంది. నిర్మాణ విలువలు బావుంటాయి. నవంబర్ 4న సినిమాను విడుదల చేస్తున్నాం అని అన్నారు.
నిర్మాత సుధీర్ మాట్లాడుతూ - సుమంత్‌తో ఇంకో సినిమా కూడా చేయాలని ఉంది. అంత బాగా కోఆపరేట్ చేశారు అని తెలిపారు.
పల్లవి సుభాష్ మాట్లాడుతూ - ఒరిజినల్ చూశాను. నేను కూడా బాగా చేశాననే భావిస్తున్నాను అని చెప్పారు.
దర్శకుడు మల్లిక్ రామ్ మాట్లాడుతూ - ఇంద్రగంటి మోహనకృష్ణ గోల్కొండ హైస్కూల్ చేశా.. అవకాశం ఈ సినిమాతో వచ్చింది. సుమంత్ గారు ఫోన్ చేసి విక్కీ డోనర్ చూశావా అన్నారు. అప్పటికి చూడలేదు. చూసి ఆయనకు ఫోన్ చేశాను. చాలా ఎగ్జయిటింగ్‌గా చేశాను. మ్యూజిక్, కెమెరా, ఎడిటింగ్ కూడా సినిమాకు చాలా బాగా హెల్ప్ అయ్యాయి. విక్కీ డోనర్‌ని మన నేటివిటికీ తేవడం కష్టం. అయినా నేటివిటీ మిస్ కాకుండా తెరకెక్కించాం అని తెలిపారు.
డా.వైజయంతి మాట్లాడుతూ - వీర్యకణం సమస్యలు అనేవి మహిళల్లో, పురుషుల్లో ఉంటాయి. కానీ మహిళల్లో ఉంటాయని అనుకుంటారు. కానీ అందులో నిజం లేదు. అవగాహన కల్పించే ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి అని తెలిపారు.
సంగీత దర్శకుడు మాట్లాడుతూ - 8 పాటలున్నాయి. తప్పకుండా అందరినీ అలరిస్తాయి అని చెప్పారు.
సుశాంత్ మాట్లాడుతూ - సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని యు సర్టిఫికెట్ వచ్చింది. కొత్త కోణంలో ఉంది. స్టైల్ అదిరిపోతుంది సుమంత్‌ది అని అన్నారు.
మంచు మనోజ్ మాట్లాడుతూ - ట్రైలర్ చూశాను. ఫెంటాస్టిక్‌గా ఉంది. మనదగ్గర ఎందుకు ఇలాంటి కథలు రావట్లేదా అనుకోవడానికి వీల్లేకుండా మంచి కథ వస్తుంది అని తెలిపారు.
లక్ష్మీ మంచు మాట్లాడుతూ - ట్రైలర్ చాలా బాగా కట్ చేశారు. మంచి ఆర్టిస్ట్ సుమంత్. సినిమాను ప్రేమించి తీస్తున్నవాళ్లు బాగా చేయాలి అని అన్నారు.
తనికెళ్ల భరణి మాట్లాడుతూ - నేను అరకులో ఉన్నప్పుడు సుమంత్ ఫోన్ చేసి మీరు హీరోగా ఒక సినిమా చేయాలి అని అన్నారు. నేను హీరో ఏంటయ్యా అని అన్నాను. వచ్చాక కథ వింటే చాలా బాగా అనిపించింది. సినిమా మొత్తం ఉంటాను. ఇలాంటి సబ్జెక్ట్ చేయడానికి దైర్యం కావాలి. అందరం త్రికరణ శుద్ధిగా చేస్తున్నాం. సుమంత్ చాలా బాగా చేశాడు అని అన్నారు.
>ట్రెమండస్ ఓపెనింగ్స్‌తో సూపర్‌హిట్ తెచ్చుకున్న కార్తీ 'కాష్మోరా'యంగ్ హీరో కార్తీ కథానాయకుడిగా పి.వి.పి. సినిమా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకాలపై గోకుల్ దర్శకత్వంలో పెరల్ వి. పొట్లూరి, పరమ్ వి. పొట్లూరి, కెవిన్ అన్నె, ఎస్.ఆర్.ప్రకాష్ బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్న భారీ చిత్రం 'కాష్మోరా'. ఈరోజు విడుదలైన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్‌తో సూపర్‌హిట్ టాక్ తెచ్చుకుంది. కార్తీ పెర్‌ఫార్మెన్స్‌ని అందరూ ప్రశంసిస్తున్నారు. భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో రూపొందిన కాష్మోరా విజువల్ వండర్‌గా అందర్నీ ఎంటర్‌టైన్ చేస్తోంది.
ఈ సందర్భంగా హీరో కార్తీ మాట్లాడుతూ - ఊపిరి వంటి సూపర్‌హిట్ సినిమా తర్వాత చేసిన ఈ సినిమా నా కెరీర్‌లో ది బెస్ట్ మూవీ అని అందరూ చెప్తున్నారు. సినిమాని స్టార్టింగ్ టు ఎండింగ్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నేను చేసిన కాష్మోరా, రాజనాయక్ క్యారెక్టర్లు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. హీరోగా, విలన్‌గా నేను చేసిన ఈ రెండు క్యారెక్టర్లు నా కెరీర్‌లో ది బెస్ట్‌గా నిలిచిపోతాయి. మా కాష్మోరా చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసి నాకు దీపావళి కానుక అందించిన ప్రేక్షకులకు, తెలుగులో చాలా గ్రాండ్‌గా 600కి పైగా థియేటర్లలో రిలీజ్ చేసిన పివిపిగారికి నా థాంక్స్ అన్నారు.
>దీపావళి సందర్భంగా ` నేను లోకల్` ఫస్ట్‌లుక్ రిలీజ్
`ఎవడే సుబ్రమణ్యం`, `భలే భలే మగాడివోయ్`, `కృష్ణగాడి వీర ప్రేమగాథ`, `జెంటిల్ మన్`, మజ్ను`..వరుస ఐదు చిత్రాల సక్సెస్‌తో ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ను సంపాదించుకున్న నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తిసురేష్ హీరోయిన్‌గా , హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు సమర్పణలో సినిమా చూపిస్తా మామా చిత్రానికి దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్న త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో శిరీష్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `నేను లోకల్`.ఆటిట్యూడ్ ఐస్ ఎవిరీథింగ్...క్యాప్షన్. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటోంది. దీపావళి సందర్బంగా సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా... చిత్ర సమర్పకుడు దిల్ రాజు మాట్లాడుతూ - ఎప్పటి నుండో నానితో ఓ సినిమా చేయాలనుకుంటున్నాను. నేను లోకల్ సినిమాతో కుదిరింది. త్రినాథరావు నక్కిన చెప్పిన కథ చాలా బాగా నచ్చింది. త్రినాథ్ స్టైల్ ఆప్ ఎంటర్‌టైన్మెంట్‌తో ఎనర్జీ ఉన్న క్యారెక్టర్ బేస్డ్ లవ్‌స్టోరీగా నేను లోకల్ సినిమా శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్‌కు, మా వెంకటేశ్వర క్రియేషన్స్‌కు ఉన్న రిలేషన్ తెలిసిందే. మా బ్యానర్‌లో ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలకు సంగీతాన్ని అందించిన దేవిశ్రీ అందించిన మ్యూజిక్ హైలైట్‌గా నిలుస్తుంది. హీరోగా సినిమాలు చేస్తోన్న నవీన్ చంద్ర ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేయటానికి ఒప్పుకున్నందుకు చాలా థాంక్స్. దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేస్తున్నాం. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటికే ఐదు వరుస సక్సెస్‌లు కొట్టిన నాని మా బ్యానర్‌లో విడుదలవుతున్న నేను లోకల్‌తో సెకండ్ హ్యాట్రిక్ పూర్తిచేస్తాడనే నమ్మకంగా ఉన్నాం. నాని కెరీర్‌లో ఈ చిత్రంలో ఓ డిఫరెంట్ మూవీగా నిలుస్తుంది అన్నారు.
>త్వరలోనే ప్రారంభం కానున్న 'నీ దేవుడే నా దేవుడు'!పెళ్లిపుస్తకం ఫేం దివ్యవాణి ప్రధాన పాత్రలో ప్రజ్ఞయ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై నిర్మాత డి.శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్న నూతన చిత్రం 'నీ దేవుడే నా దేవుడు'. 'తొలికిరణం' అనే హిస్టారికల్ సినిమాకు దర్శకత్వం వహిస్తోన్న జె.జాన్ బాబు ఈ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు పది కోట్ల వ్యయంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సీనియర్ సాంకేతిక నిపుణులు పని చేయనున్నారు. అత్తాకోడళ్ళ మధ్య జరిగే ఆసక్తికర సంఘటనల నేపధ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సంధర్భంగా చిత్ర నిర్మాత డి.శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. జాన్ బాబు తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సినిమా ఎక్కువ శాతం షూటింగ్ ను రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ వేసి చిత్రీకరించనున్నారు. కథానుగుణంగా ఈజిప్ట్ లో కొంత భాగం చిత్రీకరించనున్నాం. కథ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చిత్రాన్ని నిర్మించనున్నాం. త్వరలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోనుంది అని అన్నారు.