Advertisementt

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (24-10-16)..!

Tue 25th Oct 2016 05:18 PM
remo movie matter,intlo deyyam nakem bhayam song launch,iddaru iddare movie news  టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (24-10-16)..!
టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (24-10-16)..!
Advertisement
>నవంబర్ 1 న `రెమో` ఆడియో రిలీజ్‌

శివ‌కార్తికేయ‌న్‌, కీర్తిసురేష్ జంట‌గా బ‌క్కియ రాజ్ క‌న్న‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన లవ్  ఎంట‌ర్‌టైన‌ర్ `రెమో`. ఈ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో 24 ఎ.ఎం.స్టూడియోస్ బ్యాన‌ర్‌పై ఆర్‌.డి.రాజా స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు విడుద‌ల చేస్తున్నారు.  ఈ సినిమా ఆడియో నవంబర్ 1 న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. 

 దిల్ రాజు మాట్లాడుతూ - హీరో శివ‌కార్తికేయ‌న్ రెమో సినిమాలో మూడు వేరియేష‌న్స్‌లో అద్భుతంగా యాక్ట్ చేశాడు. పి.సి.శ్రీరాంగారి సినిమాటోగ్ర‌ఫీ, అనిరుధ్ సంగీతం సినిమాకు మ‌రింత స‌పోర్ట్ చేశాయి. రెమో ష్యూర్ షాట్ హిట్ మూవీ అవుతుంది. డెబ్యూ డైరెక్ట‌ర్ బక్కియ రాజ్ క‌న్న‌న్ చేసిన సినిమా త‌మిళనాడులో 65-70 కోట్లు క‌లెక్ట్ చేయ‌డం చిన్న విష‌యం కాదు. రెమో సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి ఎంట‌ర్ అవుతున్న శివ‌కార్తికేయ‌న్‌కు అభినంద‌న‌లు. ఈ చిత్రం ఆడియో నవంబర్ 1 న విడుదల అవుతుంది అన్నారు.

>అక్టోబర్‌ 28న 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం' ఆడియో 

అల్లరి నరేష్‌ హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ చిత్రాలు హిలేరియస్‌ కామెడీతో అందర్నీ ఎంటర్‌టైన్‌ చేశాయి. అత్తారింటికి దారేది, నాన్నకు ప్రేమతో వంటి భారీ చిత్రాలను అందించిన బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో భోగవల్లి బాపినీడు సమర్పణలో నిర్మిస్తున్న హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'ఇంట్లో దెయ్యం.. నాకేం భయం'. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాటను సోమవారం హైదరాబాద్‌లోని రేడియో మిర్చిలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో హీరో అల్లరి నరేష్‌, నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. 

అక్టోబర్‌ 28 ఆడియో, నవంబర్‌ 11 సినిమా విడుదల 

ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ మాట్లాడుతూ - ఫ్యామిలీ అంతా చూసి ఎంజాయ్‌ చేసే విధంగా 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' చిత్రం రూపొందుతోంది. అల్లరి నరేష్‌, నాగేశ్వరరెడ్డి కాంబినేషన్‌లో ఇలాంటి ఓ హార్రర్‌ కామెడీ మూవీ చెయ్యడం చాలా హ్యాపీగా వుంది. డెఫినెట్‌గా అందరికీ నచ్చే సినిమా ఇది. ఈరోజు రేడియో మిర్చిలో 'శతమానం భవతి.' అంటూ భాస్కరభట్ల రాసిన పాటను విడుదల చేశాం. ఈ చిత్రానికి సాయికార్తీక్‌ చాలా మంచి మ్యూజిక్‌ ఇచ్చారు. అక్టోబర్‌ 28న ఆడియో రిలీజ్‌ చేసి, నవంబర్‌ 11న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. 

అల్లరి నరేష్‌ మాట్లాడుతూ - ఈ చిత్రంలో నా ఫేవరేట్‌ సాంగ్‌ 'శతమానం భవతి..' ఈరోజు విడుదల చేయడం ఆనందం కలిగించింది. పాటలన్నీ చాలా బాగున్నాయి. సాయికార్తీక్‌ చాలా ఎక్స్‌లెంట్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. నాగేశ్వరరెడ్డిగారితో సీమశాస్త్రి, సీమటపాకాయ్‌ లాంటి సూపర్‌హిట్‌ సినిమాలు చేశాను. మా కాంబినేషన్‌లో ఇది డెఫినెట్‌గా హ్యాట్రిక్‌ మూవీ అవుతుంది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాలకు పూర్తి భిన్నమైన సబ్జెక్ట్‌ ఇది. చాలా ఫన్నీగా వుంటుంది. నేను చాలా ఎంజాయ్‌ చేస్తూ నటించాను. ప్రేక్షకులంతా ఎంజాయ్‌ చేస్తూ ఈ సినిమాని చూస్తారు. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్‌గారు చాలా మంచి క్యారెక్టర్‌ చేశారు. ఈ సినిమా నా కెరీర్‌లో మరో సూపర్‌హిట్‌ సినిమా అవుతుంది అన్నారు. 

దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ - ఈ సినిమాలోని అన్ని పాటలు బాగా చేశారు సాయికార్తీక్‌. అలాగే రీరికార్డింగ్‌ కూడా ఎక్స్‌లెంట్‌గా వచ్చింది. ఈరోజు విడుదలైన శతమానం భవతి సాంగ్‌ యూత్‌ అంతా హమ్‌ చేసుకునేలా వుంటుంది. ఇంత మంచి ఆడియో ఇచ్చిన సాయికార్తీక్‌కి థాంక్స్‌. ఈ సినిమాలో నరేష్‌ పెర్‌ఫార్మెన్స్‌ పీక్స్‌లో వుంటుంది. హండ్రెడ్‌ పర్సెంట్‌ అన్నివర్గాల ప్రేక్షకులు ఎంజాయ్‌ చేసేలా 'ఇంట్లో దెయ్యం నాకేం భయం' సినిమా వుంటుంది అన్నారు.

>ఛ‌ల్ ఛ‌ల్ గుర్రం చిత్ర యూనిట్ ను అభినందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

శైలేష్, దీక్షాపంత్, అంగనారాయ్ ప్రధాన పాత్రల్లో ఎం.ఆర్. ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మోహన ప్రసాద్ దర్శకత్వంలో ఎం.రాఘవయ్య నిర్మిస్తున్న చిత్రం ‘ఛల్ ఛల్ గుర్రం’. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ సినిమా ఆడియో, ట్రైల‌ర్ ల‌కు ప్రేక్ష‌కుల నుంచి మంచి స్పంద‌న వ‌స్తుంది. ఇప్పుడు స్వ‌యానా పవ‌న్ క‌ళ్యాణ్ ఈ చిత్ర బృందాన్ని అభినందించారు. ట్రైలర్ బాగా ఆక‌ట్టుకుంది. ఇలాంటి సినిమాను నిర్మించిన రాఘ‌వ‌య్య ను ఆయ‌న ప్ర‌త్యేకంగా అభినందించారు. డైర‌క్ట‌ర్ మోహ‌న్ సినిమాను బాగా తెర‌కెక్కించాడ‌ని, పాట‌ల‌న్నీ బాగున్నాయని, దీపావ‌ళికి విడుద‌లయ్యే ఈ సినిమా ప్ర‌తీ ఒక్క‌రినీ అల‌రిస్తుంంద‌ని ఆయ‌న అన్నారు

>మోహన్‌లాల్‌- సత్యరాజ్‌ 'ఇద్దరూ ఇద్దరే'!!

మోహన్‌లాల్‌- సత్యరాజ్‌ ఇద్దరూ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులే. వీళ్ళిద్దరూ కలిసి నటించిన మలయాళ చిత్రం ‘లైలా.. ఓ లైలా’. ప్రముఖ మలయాళ దర్శకుడు జోషి దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళంలో విడుదలై ఘనవిజయం సాధించింది. అమలాపాల్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఇద్దరూ ఇద్దరే’ పేరుతో అనువదిస్తున్నారు. రాహుల్‌దేవ్‌, సోనూసూద్‌ ప్రతినాయకులుగా నటించిన ఈ చిత్రాన్ని కె.ఆర్‌.ఫిలిం ప్రొడక్షన్స్‌ పతాకంపై కందల కృష్ణారెడ్డి ‘ఇద్దరూ ఇద్దరే’గా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ధియేటర్ ట్రైలర్ కు విశేషమైన స్పందన వస్తోంది. ప్రేమమ్"ఫేమ్  గోపిసుందర్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియోను త్వరలో విడుదల చేసి.. నవంబర్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చెందుకు నిర్మాత కందల కృష్ణారెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మనమంతా, జనతా గ్యారేజి చిత్రాల్లో నటించడానికి ముందే మోహన్‌లాల్‌ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఇక మిర్చి, బాహుబలి చిత్రాలతో సత్యరాజ్‌కు తెలుగులో ఏర్పడిన క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీళ్ళిద్దరూ పవర్‌ఫుల్‌ పాత్రలు పోషించిన చిత్రం ‘ఇద్దరూ ఇద్దరే’. అలాగే ఈ చిత్రంలో మోహన్‌లాల్‌కు జంటగా నటించిన అమలాపాల్‌ గ్లామర్‌ ఒలికించడంతోపాటు పర్‌ఫార్మెన్స్‌కు స్కోపున్న మంచి క్యారెక్టర్‌ చేసింది. మోహన్‌లాల్‌, సత్యరాజ్‌, అమలాపాల్‌తో పాటు రమ్య నంబిసన్‌, రాహుల్‌దేవ్‌, సోనూసూద్‌ తదితర సుపరిచితులు నటించిన సినిమా కావడంతో ..  డబ్బింగ్‌ సినిమాలా కాకుండా స్ట్రయిట్‌ సినిమా చూస్తున్న అనుభూతికి ప్రేక్షకులు లోనవుతారు.  ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి విశేషమైన స్పందన వస్తోంది.  అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో ఆడియో విడుదల చేసి, నవంబర్ లో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement