మాస్ యాక్షన్ హీరో గోపీచంద్, హ్యాట్రిక్ హిట్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యానర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మాతలుగా ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా సినిమా బ్యాంకాక్‌లో జరిగిన భారీ తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ షెడ్యూల్‌లో 70 మంది నటీనటులు పాల్గొనగా 30 రోజుల పాటు చిత్రీకరణ జరిగింది. అద్భుతమైన బ్యాంకాక్ లోకేషన్స్‌లో సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సందర్భంగా...
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ - మొదటి షెడ్యూల్ చిత్రీకరణ అనుకున్న ప్లానింగ్‌లో చక్కగా పూర్తయ్యింది. దర్శకుడు సంపత్ నంది, సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్ తెరకెక్కించిన విజువల్స్ చాలా గ్రాండియర్‌గా వచ్చాయి. బ్యాంకాక్ ఎయిర్‌పోర్ట్‌లో చిత్రీకరించిన ప్రీ క్లైమాక్స్ సీన్స్, బ్యాంకాక్ బ్రిడ్జ్‌పై హెలికాప్టర్‌తో చిత్రీకరించిన భారీ కార్ చేజింగ్ సీన్ అద్భుతంగా వచ్చాయి. అలాగే రిచ్‌నెస్ కోసం సినిమాను బ్యాంకాక్‌లోని ప్రముఖ బార్స్, పబ్స్‌లో చిత్రీకరించాం. ఫ్యామిలీ సన్నివేశాలు, క్యాథరిన్ ఇంట్రడక్షన్ సన్నివేశం, విలన్‌కు సంబంధించిన సన్నివేశాలను, తనికెళ్ళ భరణి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ సరికొత్త లుక్‌లో కనపడతారు. ఎంజాయ్ చేసేలా ప్రతి సన్నివేశాన్ని రిచ్ లుక్‌తో రూపొందిస్తున్నాం అన్నారు.
ముఖేష్ రుషి, సచిన్ కేడేఖర్, నికితన్ ధీర్(తంగబాలి), అజయ్, వెన్నెల కిషోర్ ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: సుధాకర్ పావులూరి, కో డైరెక్టర్: హేమాంబర్ జాస్తి, ఆర్ట్: కడలి బ్రహ్మ, యాక్షన్: రామ్-లక్ష్మణ్, ఎడిటర్: గౌతంరాజు,సంగీతం: ఎస్.ఎస్.థమన్, నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: సంపత్ నంది.
>టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ 'ధృవ'మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ప్రతిష్టాత్మకమైన గీతాఆర్ట్స్ బ్యానర్ లో, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రెస్టిజియస్ మూవీ `ధృవ` మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా గీతాఆర్ట్స్ బ్యానర్లో `మగధీర` తర్వాత రూపొందుతోన్న ఈ స్టైలిష్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రీకరణ దశలో ఉంది. ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, మరో నిర్మాత ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని హై బడ్జెట్, టెక్నికల్ వాల్యూస్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు.
సినిమా టాకీ పార్ట్ చిత్రీకరణ పూర్తయ్యింది. నవంబర్ మొదటివారంలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ పూర్తవుతుంది. ఒక పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంటుంది. మరోవైపు నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సినిమా అనౌన్స్‌మెంట్ నుండి మెగాభిమానులు, ప్రేక్షకుల అటెన్షన్‌ను తనవైపు తిప్పుకున్న మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనపించనున్నారు. సినిమా ఆడియో వివరాలను నిర్మాతలు త్వరలోనే తెలియజేస్తారు. అలాగే అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
విజయదశమి సందర్భంగా ధృవ టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
`నీ స్నేహితుడెవరో తెలిస్తే..నీ క్యారెక్టర్ తెలుస్తుంది...నీ శత్రువు ఎవరో తెలిసే..నీ కెపాసిటీ తెలుస్తుంది` అంటూ చరణ్ చెప్పిన డైలాగ్ తో ఉన్న ఈ యాభై సెకన్ల ఈ టీజర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
>నవంబర్ 4న విడుదలవుతున్న `నరుడా..! డోనరుడా!`హీరో సుమంత్ కథానాయకుడుగా రూపొందుతోన్న కొత్త చిత్రం `నరుడా..! డోనరుడా..!`. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రమా రీల్స్, ఎస్.ఎస్.క్రియేషన్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది.మల్లిక్‌రామ్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని వై.సుప్రియ, సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు. అక్టోబర్ 27న ఆడియో, నవంబర్ 4న సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా...
చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ - వీర్యదానం అనే కాన్సెప్ట్‌తో నరుడా..! డోనరుడా..! సినిమా కాన్సెప్ట్ తెలుగు ఆడియెన్స్‌కు చాలా కొత్తగా ఉంటుంది. నాగార్జునగారు విడుదల చేసిన ఫస్ట్‌లుక్, మహేష్ బాబు విడుదల చేసిన థియేట్రికల్ ట్రైలర్‌తో పాటు అల్రెడి యూ ట్యూబ్‌లో విడుదల చేసిన రెండు సాంగ్స్‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి స్పందన వచ్చింది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందిన ఈ హిలేరియస్ ఎంటర్‌టైనర్ పాటలను అక్టోబర్ 27న, సినిమాను నవంబర్ 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. వీర్యదాతగా హీరో సుమంత్, ఇన్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డా.ఆంజనేయులు పాత్రలో తనికెళ్ళభరణిగారి నటన ప్రేక్షకులను అలరిస్తుంది. హీరోయిన్ పల్లవి సుభాష్, సుమన్‌శెట్టి సహా ప్రతి పాత్ర విలక్షణంగా ఉంటుంది అన్నారు.
>`శ్రీ సత్యసాయి బాబా` 2వ షెడ్యూల్ పూర్తిసౌభాగ్య చిత్ర పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం శ్రీ సత్యసాయి బాబా. అమ్మోరు, అరుంధతి, దేవుళ్లు వంటి విజువల్ వండర్స్‌ని అందించిన కోడి రామకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దేవుళ్లు నిర్మాత కరాటం రాంబాబు నిర్మిస్తున్నారు. పుట్టపర్తి సత్యసాయి బాబాపై తెరకెక్కిస్తున్న సేవా ధృక్పథ భక్తి చిత్రమిది. మ్యాస్ట్రో ఇళయరాజా స్వరాల్ని అందిస్తున్నారు. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు సింగిల్ కార్డ్‌లో 14 పాటలకు సాహిత్యం అందించడం విశేషం. ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తయింది. అక్టోబర్ 14 నుంచి 2వ షెడ్యూల్ చిత్రీకరణ అల్లూమినియం ఫ్యాక్టరీ, సారథి స్టూడియోస్‌లో వేసిన భారీ సెట్స్‌లో తెరకెక్కించారు. తాజా షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్లో ప్రధాన పాత్రధారులపై కీలక సన్నివేశాలు తెరకెక్కించారు.
సత్యసాయిగా మలయాళ నటుడు శ్రీజిత్ విజయ్ నటిస్తున్నారు. సత్యసాయికి మాతృమూర్తి గా జయప్రద, తండ్రి పాత్రలో శరత్‌బాబు నటిస్తున్నారు. ఉలగనాయగన్ కమల్‌హాసన్‌కి మేకప్‌మేన్‌గా పనిచేసిన రమేష్ మెహంతి ఈ చిత్రానికి పని చేస్తున్నారు. ఇటీవలే పాటల రికార్డింగ్ పూర్తయింది. ఎస్.పి.బాలసుబ్రమణ్యం, వందేమాతరం శ్రీనివాస్, హరిహరన్, బాల మురళి కృష్ణ, చిత్ర, హరిచరణ్, విజయ్ ప్రకాష్, కవితా కృష్ణమూర్తి, కైలాస్ గురి, సుఖ్విందర్ సింగ్, మల్లాడి బ్రదర్స్, ఆండ్రియా, టిప్పు తదితరులు గానాలాపన చేశారు. ప్రఖ్యాత ఛాయాగ్రాహకుడు బి.వాసు ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తున్నారు.
>హ్రితిక్ రోషన్ 'కాబిల్' కు తెలుగు లో టైటిల్ ఖరారుబాలీవుడ్ సూపర్ స్టార్ హ్రితిక్ రోషన్ మరియు రాకేష్ రోషన్ కాంబినేషన్ లో వస్తోన్న భారీ ఆక్షన్ థ్రిల్లర్ కాబిల్ . ఈ చిత్రాన్ని తెలుగు లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి తెలుగు టైటిల్ బలం.
గతం లో క్రిష్, క్రిష్ 3, కోయి మిల్ గయా, కహో నా ప్యార్ హై వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన ఈ కాంబినేషన్ ఇప్పుడు మళ్ళీ బలం తో తెలుగు ప్రేక్షకుల ముందు కు రాబోతోంది. ఈ చిత్రం లో హ్రితిక్ రోషన్ సరసన యామీ గౌతమ్ హీరోయిన్ గా నటిస్తోంది.
సంజయ్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తం గా జనవరి 26 2017 న విడుదల అవుతుంది. గతం లో హ్రితిక్ నటించిన క్రిష్ చిత్రాలు మరియు ధూమ్ 2 చిత్రం తెలుగు లో విశేష ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. హ్రితిక్ కి ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణా లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం తో, తెలుగు లో కూడా భారీ విడుదల కు నిర్మాతలు సిద్ధ పడుతున్నారు.
ఈ చిత్రం మొదటి ట్రైలర్ మరియు లుక్ దీపావళి కానుకగా విడుదల అవుతుంది. బలం చిత్రానికి రాజేష్ రోషన్ సంగీతాన్ని అందించారు.
>నవంబర్ 4న విడుదలకు సిద్ధమవుతున్న `మనలో ఒకడు`ఆర్పీ పట్నాయక్ నటిస్తూ, సంగీతం అందిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం `మనలో ఒకడు`. యూనిక్రాఫ్ట్ మూవీ పతాకంపై జగన్ మోహన్ నిర్మిస్తున్నారు. 'నువ్వు నేను' ఫేం అనితా హెచ్. రెడ్డి కథానాయికగా నటించారు. ఈ సినిమాను నవంబర్ 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా....
ఆర్పీ పట్నాయక్ మాట్లాడుతూ మనలో ఒకడుపాటలకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇటీవల తిరుపతిలో వన్ మిలియన్ క్లిక్స్ డిస్క్ ఫంక్షన్స్ నిర్వహించాం. థియేట్రికల్ ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన వచ్చింది. కొన్ని యదార్థ ఘటనల ఆధారంగా మనలో ఒకడు కథను రాసుకున్నాం. ఈ సినిమాలో నేను కృష్ణమూర్తి అనే అధ్యాపకుడి పాత్రలో నటించాను. పవర్‌ఫుల్ పాత్ర అది. డైలాగ్ కింగ్ సాయికుమార్‌గారి పాత్ర కూడా అద్భుతంగా ఉంటుంది. మనలో ఒకడు సినిమా ఫస్ట్ కాపీ సిద్ధమైంది. సినిమా చాలా బాగా వచ్చింది. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను నవంబర్ 4న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు.
నిర్మాత జగన్ మోహన్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మీడియా పాత్ర ఏంటో మనందరికీ తెలుసు. అలాంటి మీడియా నేపథ్యంలో సాగే కథతో ఈ సినిమాను తెరకెక్కించాం. ఇటీవల విడుదలైన పాటలకు, థియేట్రిలక్ ట్రైలర్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఫస్ట్‌కాపీ సిద్ధమైంది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసి నవంబర్ 4న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని చెప్పారు.