Advertisementt

వైజాగ్ లో మొదలై.. హైద్రాబాద్ లో ముగిసింది!

Thu 20th Oct 2016 09:34 PM
singam 3,suriya,suriya singham 3 shooting completed,suriya singam 3,malkapuram sivakumar,anushka,shruti haasan  వైజాగ్ లో మొదలై.. హైద్రాబాద్ లో ముగిసింది!
వైజాగ్ లో మొదలై.. హైద్రాబాద్ లో ముగిసింది!
Advertisement
Ads by CJ

తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ ఇమేజ్‌ను దక్కించుకున్న ప్రముఖ కథానాయకుడు సూర్య నటిస్తున్న తాజా చిత్రం సింగం-3. గతంలో వచ్చిన సింగం, సింగం-2 చిత్రాలు ఘనవిజయాలు సాధించిన సంగతి తెలిసిందే. సింగం సిరీస్‌లో భాగంగా హరి దర్శకత్వంలో తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న  సీక్వెల్ సింగం-3పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. తమిళ్ లో ప్రముఖ నిర్మాత స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ. జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో  ప్రముఖ నిర్మాత సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్ మీడియా అధినేత మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్ర విశేషాలను తెలియజేస్తూ ఈ చిత్రానికి తమిళం తో పాటు తెలుగు లో వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తప్పకుండా ఈ చిత్రం అందరి అంచనాలను అందుకుంటుందని నమ్మకం వుంది. సూర్య సరసన అనుష్క, శృతి హాసన్ నాయికలుగా నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో ప్రారంభమైన షెడ్యూల్ ఈ నెల 20 తో పూర్తయ్యింది. దీంతో టాకీ పార్ట్ పూర్తయ్యింది. బ్యాలన్స్ గా వున్న ఒక పాటను సూర్య, అనుష్క ల పై విదేశాల్లో త్వరలో చిత్రీకరించడంతో షూటింగ్ పార్ట్ పూర్తి అవుతుంది. దీపావళి కి టీజర్ ను,  నవంబర్ లో ఆడియో ని విడుదల చేసి డిసెంబర్ 16 న తెలుగు, తమిళ్ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. తెలుగు నేటివిటికి దగ్గరగా వుండే ఈ చిత్ర నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులకు నచ్చే అన్ని అంశాలుంటాయి. వైజాగ్ లో ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్  హైదరాబాద్ లో జరిగిన షెడ్యూల్ తో షూటింగ్ పూర్తి చేసుకోవడం విశేషం. ఇప్పటికే తెలుగులో ఈ చిత్రానికి సంబంధించి అన్ని ఏరియాల్లో ఫ్యాన్సీ రేట్లతో బిజినెస్ పూర్తయింది..అని అన్నారు. 

అనుష్క శెట్టి, శృతీహాసన్, రాధిక శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం:హేరీస్‌జైరాజ్

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ