Advertisementt

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (10-10-16)..!

Tue 11th Oct 2016 01:17 AM
movie news,seethadevi movie news,bahubali 2 movie,saptagiri express movie news   టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (10-10-16)..!
టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (10-10-16)..!
Advertisement
Ads by CJ

మోహన్ లాల్ ఖాతాలో ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్

మళయాల చిత్ర సీమలోనే మునుపెన్నడు లేని రీతన అత్యంత భారీ వసూళ్లతో దూసుకుపోతుంది మోహన్ లాల్ తాజా చిత్రం పులిమురుగన్. మల్లూవుడ్ లో ఇప్పటివరకు క్రియేటైన రికార్డులు అన్నిటిని బ్రేక్ చేస్తూ విడుదలైన మూడు రోజుల్లోనే దాదాపు 15 కోట్లకి పైగా కలెక్షన్స్ తెచ్చుకుంది ఈ విజువల్ వండర్. ప్రపంచవ్యప్తంగా కూడా పులి మురుగన్ కి రికార్డు స్థాయిలో కలెక్షన్స్ వస్తున్నాయి. మోహన్ లాల్ సినీ కెరీర్ లో ఈ రెంజ్ కలెక్షన్స్ రావడం ఇదే తొలిసారి, ఇక ఈ ఏడాది విడుదలైన మోహన్ లాల్ మరో సినిమా 'ఒప్పమ్' కూడా హిట్ టాక్ సొంతం చేసుకోవడం విశేషం. కేరళ సీమలో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోన్న పులిమురగన్ కు సంబంధించిన రైట్స్ కోసం అప్పుడే సౌత్ ఇండియాలో ఉన్న ప్రముఖ నిర్మాణ సంస్థలు పోటిపడుతున్నాయి. త్వరలోనే పులిమురుగన్ తెలుగు వెర్షన్ గురించిన వివరాలు రాబోతున్నాయి. ఈ సినిమాకు నిర్మాత : తోమిచమ్ ములకుపాదమ్, దర్శకుడు : వైశాఖ, కథ : ఉదయకృష్ణ, సంగీతం : గోపీ సుందర్, కెమెరా : షాజీకుమార్. ​

పవన్ కళ్యాణ్ అభిమానిని

పవన్ కళ్యాణ్ మీద అభిమానంతో సినిమా పరిశ్రమలోకి వచ్చానని...పవర్ స్టార్ అభిమానులు తనను ఆదరించాలని కోరుతున్నారు యువ కథానాయకుడు సందీప్. ఆయన హీరోగా నటించిన నేనూ సీతాదేవి ఈ నెల 14న విడుదలకు సిద్ధమవుతోంది. సుమారు వంద థియేటర్లలో ప్రేక్షకుల ముందుకొస్తోందీ సినిమా. హార్రర్ లవ్ స్టోరీ తో యువతను ఆకట్టుకునే అంశాలతో పుష్కలమైన వినోదాన్ని అందించేలా నేనూ సీతాదేవి తెరకెక్కింది. శ్రీనివాస్ మల్లం దర్శకుడు. కోమలి, భవ్య శ్రీ నాయికలుగా నటించారు. సందీప్ క్రియేషన్స్ పతాకంపై డాక్టర్ వెంకన్న నిర్మాణ బాధ్యతలు వహించారు. నేనూ సీతా దేవి విడుదల సందర్భంగా చిత్ర కథానాయకుడు సందీప్ మాట్లాడుతూ...పవన్ కళ్యాణ్ నటన చాలా ఇష్టం. ఆయన సినిమాల ప్రభావంతోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. నేను కథానాయకుడిగా నటించిన తొలి సినిమా నేనూ సీతాదేవి ఈనెల 14న విడదులకు సిద్ధమవుతోంది. నాకు మొదటి సినిమా అయినా తోటి నటులు పేరున్న వాళ్లు కావడం కలిసొచ్చింది. జీవా, వెన్నెల కిషోర్ లాంటి నటులు కొత్తవాడినైనా నన్ను ప్రోత్సహించారు. ఓ స్నేహితుడిలా చూశారు. హార్రర్ లవ్ స్టోరీ ఇది. యూత్ ఫుల్ అంశాలుంటాయి. చైతన్య సంగీతం అందించిన పాటలు బాగా కుదిరాయి. వాటిని అందమైన లొకేషన్లలో చిత్రీకరించాం. సినిమా అంతా ఆహ్లాదకరంగా సాగుతుంటుంది. కుటుంబమంతా కలిసి చూసే సినిమా అవుతుంది. కథలో వచ్చే మలుపులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. కథ ఎలా ఉంటుందో అన్నది ఊహించకుండా కథనం సాగుతుంటుంది. క్లైమాక్స్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుంది. నేను నటుడు కావాలన్నది మా నాన్న కల. ఆయన ప్రోత్సహాంతోనే హీరోను అయ్యాను. సందీప్ క్రియేషన్స్ పై మంచి ఛిత్రాలు చేయాలని అనుకుంటున్నాము. అన్నారు.

'సప్తగిరి ఎక్స్ ప్రెస్' వచ్చేస్తోంది - డా.రవి కిరణ్

కమెడియన్ గా కడుపుబ్బా నవ్విస్తున్న స్టార్ కమెడియన్ సప్తగిరి ఇప్పుడు హీరోగానూ అలరించేందుకు సిద్ధమయ్యాడు. 'సప్తగిరి ఎక్స్ ప్రెస్' పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శిష్యుడు అరుణ్ పవార్ దర్శకత్వం వహిస్తున్నాడు. మాస్టర్ హోమియోపతి ద్వారా వైద్యరంగంలో సేవలందిస్తున్న డాక్టర్ కె.రవికిరణ్... సాయి సెల్యూలాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ పతాకంపై తొలి ప్రయత్నంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా మోషన్ పోస్టర్ ఇటీవలై విడుదలైన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ కి అనూహ్యమైన స్పందన వస్తోంది. ఈ సందర్భంగా ప్రేక్షకులతో పాటు మీడియా వారికి సప్తగిరి ఎక్స్ ప్రెస్ నిర్మాత డాక్టర్ రవికిరణ్ కృతజ్ఞతలు తెలిపారు. అలానే త్వరలోనే విడుదల కాబోతున్న తమ సినిమాను పెద్ద మనసుతో ఆదరించాలని కోరారు. సినిమా ప్రేమికుడుగా సినిమా ఎలా ఉండాలో అని మాత్రమే డిస్కస్ చేసేవాడిని. అయితే ఓ సినిమా కోసం 24 క్రాఫ్ట్స్ వారు ఎంతగా కష్డపడతారో, తపన పడతారో ఈ సినిమాతోనే నాకు తెలిసింది. ఎటువంటి అశ్లీలతకు చోటు లేకుండా.. ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కలసి చూసేలా ఈ సినిమా ఉంటుంది అన్నారు. 

అమెరికా న్యూజెర్సీ లో స్వచ్ఛంద కచేరి

కాశ్మీరీ పండిట్లపై జరిగిన ఉగ్రవాద దాడుల్లో నష్టపోయినవారిని ఆదుకోవడానికి శల్లి కుమార్ అనే వ్యక్తి ఛారిటీ కాన్సెర్ట్ ను ఏర్పాటుచేసారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఈనెల 15న జరుగబోయే ఈవెంట్ లో సినీతారలు పాల్గొని పర్ఫార్మెన్స్ లు చేయనున్నారు. ఈ ఈవెంట్ లో అఖిల్,రామ్ చరణ్ , శ్రియసరన్, ప్రభుదేవా, మలైకా అరోరా, సోఫీ చౌదరిలు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోనాల్డ్ ట్రంప్ హాజరుకాకున్నారు.

హైద్రాబాద్ లో జరిగిన ప్రమోషన్ కార్యక్రమంలో హీరోయిన్ శ్రియ పాల్గొన్నారు. ఇలాంటి ఛారిటీ కార్యక్రమాల్లో పాల్గొడం చాలా సంతోషంగా ఉందని శ్రియ తెలిపారు. ఉగ్రవాద దాడుల్లో నష్టపోయిన వారికోసం పెర్ఫార్మ్చే యడం మా బాధ్యత అనుకొనే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. సౌత్ లో నేను చేసిన సినిమా పాటలకు పెర్ఫార్మ్ చేయనున్నాను.

ఎషియన్ సినిమాస్ కు బాహుబలి 2 నైజాం రైట్స్

బాహుబలి 2 విడుదలకు ఇంకా ఆరు నెలల సమయం ఉంది.  హడావుడి మాత్రం ఇప్పటి నుంచె మొదలపొయింది.ఇటీవలె చిత్రీకరణ పూర్తిచెసుకొన్న ఈ రెండోభాగం, బాహుబలి తొలిభాగం సృష్టించిన రికార్డ్ లను బిజినెస్ తొనె  బ్రేక్ చెసెస్తోంది. ఓవర్సీస్ రైట్స్ ను రికార్డ్ స్థాయిలో అమ్మేసిన బాహుబలి నిర్మాతలు తాజాగా నైజాం రైట్స్ ను సైతం అదే స్థాయిలో భారీ మొత్తానికి ఎషియన్ సినిమాస్ కు ఇచ్చారు.ముందు నుంచి  దిల్ రాజు ,సురేష్ బాబు , పలు కార్పొరెట్ డిష్ట్రిబ్యూషన్ కంపెనీలు రైట్స్ కొసం పొటీ పడగా, ఎషియన్ సినిమాస్ నారాయణ దాస్, సునీల్ నారంగ్ లు ఫ్యాన్సీ ఆఫర్ తో బాహుబలి 2 నైజాం హక్కులను కొనుగొలు చేశారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ