Advertisementt

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (6-10-16)..!

Fri 07th Oct 2016 07:04 PM
vaishakham movie swachh bharat photos,santhosh sobhan new movie launch,idho prema lokam dubbing,jayammu nischayammu raa teaser launch,naruda donoruda post production,yentha varaku ee prema post production,jathagaa censor,tollywood tajaa updates  టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (6-10-16)..!
టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (6-10-16)..!
Advertisement
Ads by CJ
>1. 'వైశాఖం'లో స్వచ్ఛ భారత్‌ 

డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి, దర్శకత్వంలో ఆర్‌.జె. సినిమాస్‌ పతాకంపై బి.ఎ.రాజు నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'వైశాఖం'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్‌ జరుగుతోంది. ఈ నెలాఖరు వరకు జరిగే ఈ షెడ్యూల్‌తో షూటింగ్‌ దాదాపు పూర్తవుతుంది. 

ఈ చిత్ర విశేషాల గురించి నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ - మా ఆర్‌.జె. సినిమాస్‌ బేనర్‌లో వస్తున్న మరో సూపర్‌హిట్‌ చిత్రం 'వైశాఖం'. కుటుంబ సమేతంగా చూసి ఎంజాయ్‌ చేసేలా ఈ చిత్రం రూపొందుతోంది. సాధారణంగా సినీ ప్రముఖులు స్వచ్ఛ భారత్‌ గురించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు పలు కార్యక్రమాలు చేపడుతూనే వున్నారు. అయితే స్వచ్ఛ భారత్‌ గురించి 'వైశాఖం' చిత్రంలో స్వచ్ఛ భారత్‌కి సంబంధించి ఓ సీన్‌ని చిత్రీకరించడం జరిగింది. చిత్రంలోని ప్రముఖ తారాగణం అంతా పాల్గొన్న ఈ సన్నివేశం కథలో భాగంగానే వుంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌, సెంటిమెంట్‌తోపాటు అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ వున్న 'వైశాఖం' తప్పకుండా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. కజక్‌స్థాన్‌లోని అందమైన లొకేషన్స్‌లో చిత్రీకరించిన పాటలు సినిమాకి పెద్ద ఎస్సెట్‌ అవుతాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్‌ జరుగుతోంది. అక్టోబర్‌ నెలాఖరు వరకు జరిగే ఈ షెడ్యూల్‌తో షూటింగ్‌ దాదాపు పూర్తవుతుంది... అన్నారు. 

>2. సంతోష్‌ శోభన్‌ హీరోగా సింప్లిజిత్‌ ప్రొడక్షన్స్‌ చిత్రం ప్రారంభం 

'గోల్కొండ హైస్కూల్‌', 'తను నేను' ఫేం సంతోష్‌ శోభన్‌ హీరోగా సింప్లిజిత్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై అభిజిత్‌ జయంతి నిర్మిస్తున్న చిత్రం షూటింగ్‌ అక్టోబర్‌ 5న ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణవంశీ శిష్యుడు శ్రీనివాస్‌ చక్రవర్తి దర్శకుడుగా పరిచయమవుతున్నారు. ముహూర్తపు షాట్‌కి సింప్లీజిత్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ డైరెక్టర్‌ మాధవీలత క్లాప్‌ నివ్వగా, ప్రముఖ దర్శకుడు వంశీ పైడిపల్లి కెమెరా స్విచ్చాన్‌ చేశారు. 

ఈ సందర్భంగా నిర్మాత అభిజిత్‌ జయంతి మాట్లాడుతూ - కృష్ణవంశీగారి శిష్యుడు శ్రీనివాస్‌ చక్రవర్తి చెప్పిన కథ వినగానే ఎంతో బాగా నచ్చడంతో ఈ సినిమా నిర్మిస్తున్నాను. ఈ సినిమా సంతోష్‌ శోభన్‌కి హీరోగా చాలా మంచి పేరు తెస్తుంది..అన్నారు. 

దర్శకుడు శ్రీనివాస్‌ చక్రవర్తి మాట్లాడుతూ - ఈ సినిమాకి దర్శకత్వం వహించే అవకాశం ఇచ్చిన నిర్మాత అభిజిత్‌ జయంతిగారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అన్నివర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుంది.. అన్నారు. 

సంతోష్‌ శోభన్‌, కాషిష్‌ వోహ్రా హీరో హీరోయిన్లుగా కీలక పాత్రల్లో డా|| నరేష్‌, తనికెళ్ల భరణి, అజయ్‌, వెన్నెల కిషోర్‌, గుండు సుదర్శన్‌, జెమిని సురేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: డిజె వసంత్‌, కెమెరామెన్‌: సామల భాస్కర్‌, ఆర్ట్‌: కిరణ్‌కుమార్‌ మన్నె, పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, బాలాజీ, కాస్ట్యూమ్స్‌: రాజు, మేకప్‌: రామకృష్ణ, స్టిల్స్‌: మల్లిక్‌, పబ్లిసిటీ డిజైనర్‌: అనంత్‌, నిర్మాత: అభిజిత్‌ జయంతి, రచన-దర్శకత్వం: శ్రీనివాస్‌ చక్రవర్తి. 

>3. 'ఇదో ప్రేమ లోకం' డబ్బింగ్ పూర్తి

శ్రీ శ్రీనివాసా ఫిలింస్‌ బ్యానర్‌లో ఎస్‌.పి. నాయుడు నిర్మాతగా సెన్సేషనల్‌ దర్శకుడు కోడిరామకృష్ణ శిష్యుడైన టి. కరణ్‌రాజ్‌ దర్శకత్వంలో అశోక్‌చంద్ర(నూతనపరిచయం), రాజా సూర్యవంశీ, తేజారెడ్డి, కారుణ్య హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకున్న చిత్రం 'ఇదో ప్రేమ లోకం'. ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు టి. కరణ్‌రాజ్‌ మాట్లాడుతూ..ఇదో అందమైన ప్రేమకథ. ప్రియుడికి ఇచ్చిన మాటకోసం తన వాళ్ళను వదులుకుని, ఓ రాతి మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ఓ మేఘమాల కథ. నేను రాసుకున్న కథను నమ్మి..ఈ కథను చిత్రంగా మలిచేందుకు నిర్మాత ఎస్‌.పి. నాయుడు గారు ఎంతగానో సహకరించారు. ఖర్చుకు వెనకాడకుండా అందమైన లోకేషన్లలో చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు ఆయన ఎంతగానో తోడ్పడ్డారు. అలాగే ఈ ప్రేమలోకానికి నటీనటులు, టెక్నిషియన్లు ఇచ్చిన సహకారం మర్చిపోలేనిది. తప్పకుండా ప్రేక్షకులు మెచ్చే ఓ మంచి ప్రేమకథా చిత్రంగా ఈ చిత్రం ఉంటుంది..అని అన్నారు.

నిర్మాత ఎస్‌.పి. నాయుడు మాట్లాడుతూ..దర్శకుడు కరణ్‌రాజ్‌ ఓ మంచి కథా చిత్రాన్ని మా బ్యానర్‌ ద్వారా ఇవ్వబోతున్నందుకు సంతోషంగా ఉంది. ప్రత్యేకపాత్రలో నటించిన సుమన్‌ మరియు నరేష్‌ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వందేమాతరం శ్రీనివాస్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. కోదాడ, మట్టపల్లి, వేదాద్రి వంటి ప్రాంతాల్లో షూటింగ్‌ జరిపాము. అరకులోని సుందరమైన లోకేషన్లలో రెండు పాటలను చిత్రీకరించాము. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అతి త్వరలో ఆడియోని రిలీజ్ చేయనున్నాము. తప్పకుండా ప్రేక్షకులు మెచ్చే ఓ మంచి చిత్రంగా 'ఇదో ప్రేమ లోకం' ఉంటుందని తెలుపుతున్నాము..అని అన్నారు.

>4. 'దేశవాళి వినోదం' పంచే 'జయమ్ము నిశ్చయమ్మురా' సమైక్యంగా నవ్వుకుందాం రండి!

క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన సినిమాలను-సకుటుంబ సమేతంగా చూసి ఆనందించదగ్గ సినిమాలుగా పేర్కొంటుంటారు. కానీ.. 'జయమ్ము నిశ్చయమ్మురా' సినిమా దర్శకనిర్మాత శివరాజ్ కనుమూరి మాత్రం 'సమైక్యంగా నవ్వుకుందాం' అంటున్నారు. అలాగే తన సినిమాలో తాను పండించిన వినోదానికి 'దేశవాళి వినోదం' అనే నామకరణం చేసి అందరి దృష్ఠినీ విశేషంగా ఆకర్షిస్తున్నారాయన. 

ఇక రీరికార్డింగ్ అవ్వకుండానే ఈ సినిమా రష్ చూసిన ప్రముఖ దర్శకుడు సుకుమార్- శివరాజ్ కనుమూరి దర్శకత్వంలో- తన స్వంత నిర్మాణ సంస్థ 'సుకుమార్ రేటింగ్స్' పతాకం పై సినిమా ప్రకటించడం పరిశ్రమ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.     

శ్రీనివాసరెడ్డి -పూర్ణ జంటగా శివరాజ్ ఫిలింస్ పతాకంపై ఏ.వి.ఎస్.రాజు సమర్పణలో శివరాజ్ కనుమూరి స్వీయనిర్మాణంలో దర్శకత్వం వహిస్తున్న 'జయమ్ము నిశ్చయమ్మురా'. సాంగ్ టీజర్ ను సుకుమార్ విడుదల చేసారు. ఈ సినిమా రష్ చూసి తాను స్పిల్ బౌండ్ అయ్యానని ఈ సందర్భంగా సుకుమార్ అన్నారు. శివరాజ్ మా మట్టపర్రు (సుకుమార్ స్వస్థలం)కుర్రాడని చెప్పుకోవడానికి చాల గర్వపడుతున్నానని అయన పేర్కొన్నారు. 

'జయమ్ము నిశ్చయమ్మురా' నా కెరీర్ కు గొప్ప టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందని శ్రీనివాస్ రెడ్డి తెలుపగా - ఈ సినిమా విడుదలయ్యాక తనను అందరూ 'జయమ్ము నిశ్చయమ్మురా' పూర్ణ అంటారని హీరోయిన్ పూర్ణ పేర్కొన్నారు.

రవిచంద్రన్ కార్తీక్ తీర్చిదిద్దిన 'ఓ సారి ఇటు చూడవే'  పాటకు అద్భుతమైన స్పందన వస్తోందని, ఓ మళయాళ గీతం ప్రేరణతో ఈ పాటకు వారు ప్రాణం పోశారని దర్శకనిర్మాత శివరాజ్ కనుమూరి అన్నారు. సుకుమార్ గారి ప్రేరణతో ఈ చిత్రాన్ని తాను నిర్మించానని, సినిమా రష్ చూసిన ఆయన అందరికీ ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెబుతుండడంతో పాజిటివ్ బజ్ ఏర్పడిందని శివరాజ్ తెలిపారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో ఈ చిత్ర సమర్పకులు ఏ.వి.ఎస్.రాజు, రవివర్మ, సినిమాటోగ్రాఫర్ నగేష్, ఎడిటర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

>5. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న 'ఎంత వరకు ఈ ప్రేమ'

'రంగం' వంటి సూపర్ హిట్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు సుపరచితుడైన జీవా హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ 'కవలై వేండాం'. ఈ చిత్రాన్ని తెలుగులో 'ఎంత వరకు ఈ ప్రేమ' అనే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు. 'యామిరుక్క బ‌య‌మేన్‌' ఫేమ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి మాట‌లు, పాట‌లు అందించిన వెన్నెల‌కంటి మాట్లాడుతూ - సినిమా ఫీల్ గుడ్ మూవీ. జీవా, కాజ‌ల్ జంట న‌టించిన ప్ర‌తి సీన్ పొయెటిక్‌గా ఉంటుంది. సినిమాకు లియోన్ జేమ్స్ మ్యూజిక్‌, అభినంద‌న్ రామానుజ‌మ్ సినిమాటోగ్ర‌ఫీ పెద్ద ఎసెట్ అవుతాయి. తెలుగులో చ‌క్క‌టి మాట‌లు, పాట‌లు కుదిరాయి. ఈ సినిమాకు డ‌బ్బింగ్ చెప్పే క‌ళాకారులు కూడా చాలా బాగా ఉంద‌ని అప్రిసియేట్ చేశారు. డ‌బ్బింగ్ స‌మ‌యంలో బాగా ఎంజాయ్ చేశాం. అవుటండ్ అవుట్ ఎంట‌ర్‌టైనింగ్ ఎలిమెంట్స‌తో పాటు సినిమా మ‌న‌సుకు హ‌త్తుకునేలా సినిమా అహ్లాదంగా ఉంటుంది.. అన్నారు.

డి.వి.సినీ క్రియేషన్స్ అధినేత, నిర్మాత డి.వెంకటేష్ మాట్లాడుతూ- సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. వెన్నెల‌కంటిగారు అద్భుత‌మైన మాట‌లు, పాట‌లు అందించారు. జీవా, కాజ‌ల్ న‌ట‌న‌తో పాటు మిగ‌తా ఆర్టిస్టుల పెర్‌ఫార్మ‌న్స్‌, టెక్నిషియ‌న్ స‌పోర్ట్‌తో సినిమా చాలా బాగా వ‌చ్చింది.  సినిమా వ‌చ్చే నెల మొద‌టి వారంలో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం.. అన్నారు.

జీవా, కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ సింహా, శృతి రామకృష్ణన్, సునయన, మంత్ర తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్: టి.ఎస్.సురేష్, సినిమాటోగ్రఫీ: అభినందన్ రామానుజమ్, మ్యూజిక్: లియోన్ జేమ్స్, నిర్మాత: డి.వెంకటేష్, దర్శకత్వం: డీకే.

>6. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న న‌రుడా...డోన‌రుడా...!

హీరో సుమంత్ కథానాయ‌కుడుగా రూపొందుతోన్న కొత్త చిత్రం నరుడా..! డోన‌రుడా..!. అన్న‌పూర్ణ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణ‌లో ర‌మా రీల్స్‌, ఎస్‌.ఎస్‌.క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌ పై సంయుక్తంగా ఈ చిత్రం రూపొందుతోంది.మ‌ల్లిక్‌రామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని వై.సుప్రియ‌, సుధీర్ పూదోట నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు తెలుగులో రాని వీర్య‌దానం అనే కాన్సెప్ట్‌తో సినిమా రూపొందుతుండ‌టం సినిమాపై అంచ‌నాల‌ను పెంచాయి. ఈ చిత్రంలో ఇన్‌ఫెర్టిలిటీ డాక్ట‌ర్ ఆంజ‌నేయులుగా త‌నికెళ్ల‌భ‌ర‌ణి సంద‌డి చేస్తున్నారు. ప‌ల్ల‌వి సుభాష్ ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తుంది. ప్ర‌స్తుతం సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్  కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా...

చిత్ర నిర్మాత‌లు మాట్లాడుతూ - నరుడా డోన‌రుడా సినిమా కాన్సెప్ట్ తెలుగు ఆడియెన్స్‌కు చాలా కొత్త‌గా ఉంటుంది. నాగార్జున‌గారు విడుద‌ల చేసిన ఫ‌స్ట్‌లుక్‌, మ‌హేష్ బాబు విడుద‌ల చేసిన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు ఆడియెన్స్ నుండి మంచి స్పంద‌న వ‌చ్చింది. ముఖ్యంగా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు టు మిలియ‌న్ వ్యూస్ రావ‌డం ఆనందంగా ఉంది. ఈ రెస్పాన్సే సినిమాపై ఆడియెన్స్ ఎంత ఆస‌క్తిగా ఉన్నార‌నే విష‌యాన్ని తెలియజేస్తుంది. సుమంత్‌, త‌నికెళ్ళ‌భ‌ర‌ణిగారు, ప‌ల్ల‌వి సుభాష్‌, సుమ‌న్‌శెట్టి స‌హా ప్ర‌తి పాత్ర విల‌క్ష‌ణంగా ఉంటుంది. సినిమా ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. వీలైనంత త్వ‌ర‌గా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం`` అన్నారు. 

>7. 'జ‌త‌గా' చిత్రానికి సెన్సార్ యు/ఎ 

రింగులజుత్తు సోయ‌గం నిత్యామీన‌న్ - దుల్కార్ స‌ల్మాన్ కాంబినేష‌న్ అంటేనే యువ‌త‌రంలో విప‌రీత‌మైన‌ క్రేజు. మ‌ల‌యాళంలో వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ల త‌ర్వాత ఈ జంట న‌టించిన 'ఓకే బంగారం' తెలుగులో మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌. దుల్కార్‌-నిత్యా జంట‌గా న‌టించిన తాజా చిత్రం 'జ‌త‌గా'. మ‌ల‌యాళంలో జాతీయ అవార్డులు సంపాదించిన 'ఉస్తాద్ హోట‌ల్' ని 'జ‌త‌గా' పేరుతో అందిస్తున్నారు. అన్వర్ రషీద్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్రేమిస్తే, జ‌ర్నీ, పిజ్జా వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల్ని అందించిన నిర్మాత‌  సురేష్ కొండేటి ఎస్‌.కె.పిక్చ‌ర్స్ ప‌తాకంపై తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.  'జ‌త‌గా' మూవీ సెన్సార్ కార్య‌క్ర‌మాలు మంగ‌ళ‌వారం(4అక్టోబ‌ర్‌) హైద‌రాబాద్‌లో పూర్త‌య్యాయి. సెన్సార్ యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చి అభినందించింది.  ఈ గురువారం (06-10-16) 'సంతోషం' ఎడిట‌ర్ అండ్ ప‌బ్లిష‌ర్‌, ఎస్‌.కె.పిక్చ‌ర్స్ అధినేత‌, నిర్మాత సురేష్ కొండేటి బ‌ర్త్‌డే, తాజా చిత్రం 'జ‌త‌గా' సెన్సార్ పూర్త‌యిన సంద‌ర్భంగా.. 

నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ - చ‌క్క‌ని సందేశాత్మక కథాంశంతో రూపొందిన అందమైన ప్రేమకథా చిత్రమిది. పేద, ధనిక వర్గాల మధ్య ఉండే అంతరాలను స్పృశిస్తూ సున్నితమైన భావోద్వేగాలతో దర్శకుడు జనరంజకంగా తీర్చిదిద్దారు. దుల్కార్ సల్మాన్, నిత్యామీనన్ జంట మధ్య వచ్చే సన్నివేశాలు హైలైట్‌. గోపీసుందర్ బాణీలు సినిమాకి పెద్ద ప్ల‌స్‌. యూత్‌, ఫ్యామిలీ ఆడియెన్‌కి న‌చ్చే పూర్తి స్థాయి కమర్షియల్ అంశాలున్నాయి. మ‌ల‌యాళంలో  జాతీయ అవార్డులు అందుకున్న 'ఉస్తాద్ హోట‌ల్‌' చిత్రాన్ని 'జ‌త‌గా' పేరుతో తెలుగులో అందిస్తున్నాం. మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో సెన్సార్ పూర్త‌యింది. సెన్సార్ బృందం యు/ఎ స‌ర్టిఫికెట్ ఇచ్చి అభినందించింది. ప్రేమిస్తే, జ‌ర్నీ త‌ర‌హాలో అసాధార‌ణ విజ‌యం సాధించే చిత్ర‌మిద‌ని, చ‌క్క‌ని ప్రేమ‌క‌థా చిత్ర‌మ‌ని సెన్సార్ బృందం అభినందించ‌డం ఆనందాన్నిచ్చింది.. అన్నారు. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్, తిల‌క‌న్‌, సిద్ధిఖి, అసీమ్ జ‌మాల్ త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, కెమెరా: ఎస్. లోకనాథన్, ర‌చ‌న‌: అంజ‌లి మీన‌న్‌, పాట‌లు:  శ్రీ‌మ‌ణి, పుల‌గం చిన్నారాయణ‌, శ్రీ‌వ‌ల్లి, మాట‌లు: సాహితి.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ