అక్టోబర్ 20న నందమూరి కళ్యాణ్‌రామ్, పూరి జగన్నాథ్‌ల 'ఇజం'
డేరింగ్ హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ కథానాయకుడిగా నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో నందమూరి కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్న పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'ఇజం'. ఈ చిత్రాన్ని అక్టోబర్ 20న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్‌కు, ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. యూ ట్యూబ్‌లో టీజర్‌కు, ట్రైలర్‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. కళ్యాణ్‌రామ్ కెరీర్‌లోనే మోస్ట్ పవర్‌ఫుల్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కళ్యాణ్‌రామ్ డిఫరెంట్ లుక్‌తో కనిపించబోతున్నారు. కళ్యాణ్‌రామ్ పెర్‌ఫార్మెన్స్, పూరి జగన్నాథ్ టేకింగ్ హైలైట్‌గా రూపొందుతున్న ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చెయ్యడానికి సిద్ధమవుతోంది.
అక్టోబర్ 5న ఆడియో
ఈ చిత్రం ఆడియోను అక్టోబర్ 5న చాలా గ్రాండ్‌గా రిలీజ్ చెయ్యబోతున్నారు. అనూప్ రూబెన్స్ అందించిన ఎక్స్‌ట్రార్డినరీ మ్యూజిక్ సినిమాకి పెద్ద ఎస్సెట్ అవుతుంది. కళ్యాణ్‌రామ్, అనూప్ రూబెన్స్ ఫస్ట్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ ఆడియో మ్యూజికల్‌గా సెన్సేషన్ క్రియేట్ చెయ్యబోతోంది.
`అప్పట్లో ఒకడుండేవాడు` - ఎగ్జయిటింగ్ కాంటెస్ట్
అప్పట్లో ఒకడుండేవాడు అని చాలా మంది తమ మాటల్లో అంటూ ఉండటం మనం చాలా సార్లు వినే ఉంటాం. జనాల నోళ్లలో బాగా నానిన అదే మాటతో సినిమా చేస్తున్నారు నారా రోహిత్, శ్రీ విష్ణు. వారిద్దరు కలిసి నటించిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని అక్టోబర్‌లో విడుదలకు సిద్ధమైంది. తన్య హోప్, సాష కీలక పాత్రల్లో నటించిన చిత్రమిది. ఆరన్ మీడియా వర్క్స్ నిర్మిస్తోంది. రోహిత్ సమర్పిస్తున్నారు. ప్రశాంతి, కృష్ణ విజయ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ ఈ మధ్య ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఇందులో నటించిన నటీనటుల చిన్నప్పటి ఫోటోలను చూపించి వాళ్లెవరో కనిపెట్టిన వారికి అద్భుతమైన బహుమతులను ఇస్తామని ఇటీవల సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో నిర్మాతలు ప్రకటించారు. ప్రైజ్ ల్లో ఐప్యాడ్‌లు కూడా ఉండటం ఆసక్తికరం.
దాంతో ఈ కాంటెస్ట్ కు విపరీతమైన స్పందన వచ్చింది. స్పందనకు దర్శకనిర్మాతలు చాలా ఆనందంగా ఫీలవుతున్నారు. అదే ఆనందంతో ఈ కాంటెస్ట్ కోసం మరి కొన్ని రోజుల్లో ఇంకా ఆసక్తికరమైన ఫోటోలను కూడా పోస్ట్ చేయనున్నారు.
అప్పట్లో ఒకడుండేవాడు అక్టోబర్‌లో గ్రాండ్‌గా విడుదల కానుంది. యాక్షన్ డ్రామాగా సాగే ఈ చిత్రంలో నారా రోహిత్ స్పెషల్ పార్టీ పోలీస్ ఆఫీసర్ నూరుద్దీన్ మొహమ్మద్ అలీగా నటించారు. క్రికెటర్ కావాలనుకునే యువకుడిగా శ్రీవిష్ణు నటించారు. త్వరలోనే ఆడియో విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. టీజర్‌ను అతి త్వరలో విడుదల చేయనున్నారు.
షార్ట్ ఫిలిం: సునీత జీవన`రాగం`
మేటి గాయని సునీత ఓ షార్ట్ ఫిలిం (లఘుచిత్రం)లో నటిస్తున్నారు అన్న వార్త ఇటీవలి కాలంలో మీడియాలో, సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ అయ్యింది. సునీత కథానాయికగా నటిస్తున్నారు అంటూ ప్రచారం సాగింది. అయితే ఎట్టకేలకు సునీత నటించిన లఘుచిత్రం `రాగం` అఫీషియల్‌గా లాంచ్ అయ్యింది. హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్‌లో ఈ లఘుచిత్రాన్ని ప్రముఖుల కోసం ప్రదర్శించారు. కార్యక్రమంలో వర్ధమాన గాయనీగాయకులు, నటీనటులు పాల్గొన్నారు.
`రాగం` హృదయాన్ని టచ్ చేసే ఓ సింపుల్ స్టోరి. ఒంటరి మహిళ అనగానే సమాజం దృక్పథం ఎలా ఉంటుంది? పెళ్లయి భర్తకు దూరంగా ఉండే మహిళ విషయంలో చుట్టూ ఉన్నవాళ్లు ఎలా అపార్థం చేసుకుంటారు? అన్న ఓ రియలిస్టిక్ పాయింట్‌ని ఎంతో హుందాగా ఆవిష్కరించారు ఈ లఘుచిత్రంలో. ముఖ్యంగా సునీత నటన, ఆహార్యం అద్భుతం. సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకున్నారు. అలాగే నటుడు సమీర్ కథానాయిక స్నేహితుడి పాత్రలో, సాయి కిరణ్ నాయిక భర్త పాత్రలో, సాటి గాయకుడిగా ఎంతో ఒదిగిపోయి నటించారు. సునీల్ కశ్యప్ రీరికార్డింగ్, మెలోడి ఆహ్లదకరమైన ఫీల్‌ని తెచ్చింది. దర్శకురాలు శ్రీచైతు ఓ సెన్సిటివ్ పాయింట్‌ని ఎలివేట్ చేసిన తీరు ఎంతో ఇంట్రెస్టింగ్. లఘుచిత్రాలు అనగానే ఏవో వెకిలిగా ఉండే పాయింట్‌ను ఎంచుకుని లైటర్ వెయిన్‌లో కామెడీలు, బూతు జోకులతో సినిమా తీసేస్తే ఆన్‌లైన్‌లో లైక్‌లు కొట్టేయొచ్చు అనుకునే వారికి ఇదో కనువిప్పు కలిగించే అర్థవంతమైన ప్రయత్నం.
షూటింగ్ పూర్తి చేసుకున్న ‘నేత్ర’
రామ్ క్రియేషన్స్ పతాకంపై గోపీచరణ్, ఐశ్వర్య అడ్డాల హీరో హీరోయిన్‌లుగా రెడ్డెం యాదకుమార్ దర్శకత్వంలో పీరికట్ల రాము నిర్మిస్తోన్న చిత్రం నేత్ర. మై స్వీట్ హార్ట్ అనేది ట్యాగ్‌లైన్. విశాఖపట్నం, అరకు, రాజమండ్రి ప్రాంతాల్లో జరిపిన షూటింగ్‌తో చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పీరికట్ల రాము మాట్లాడుతూ... చిన్నప్పటి నుంచి సినిమాలపై ఉన్న ఆసక్తితో స్నేహితుల సహకారంతో నేత్ర చిత్రాన్ని రూపొందించాను. విశాఖ, అరకు, రాజమండ్రి ప్రదేశాల్లో జరిపిన షూటింగ్‌తో చిత్రీకరణ మొత్తం పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు చిత్రాన్ని చక్కగా మలిచాడు. చిత్ర యూనిట్ సభ్యుల సహకారంతో సినిమా చాలా బాగా వచ్చింది. అక్టోబర్‌లో ఆడియోను విడుదల చేసి, నవంబర్ నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.
చిత్ర దర్శకుడు రెడ్డెం యాదకుమార్ మాట్లాడుతూ... లవ్ అండ్ హర్రర్ కామెడీ ఎంటర్‌టైనర్ చిత్రమిది. ఫస్టాఫ్ సిటీ నేపథ్యంలో నడుస్తుంది. సెకండాఫ్ గ్రామీణ నేపథ్యంలో ఉంటుంది. ఆడియన్స్‌కి కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి. గతంలో లైఫ్ అనే చిత్రాన్ని డైరెక్ట్ చేస్తూ హీరోగా నటించాను. ఈ సినిమాలో కూడా గెస్ట్ రోల్ చేశాను. హీరో గోపిచరణ్, హీరోయిన్ ఐశ్వర్య బాగా నటించారు. కెమెరా పనితనం ఈ చిత్రానికి ప్లస్ అవుతుంది. మా నిర్మాతకు ఇదే తొలి సినిమా అయినా ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. అనుకున్న దానికంటే కూడా సినిమా చాలా బాగా వచ్చింది. సత్యానంద్‌గారు, వారి అబ్బాయి ఈ చిత్రంలో నటించారు. వీరిరువురూ కలిసి నటించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి అన్నారు.