Advertisementt

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (21-9-16)..!

Thu 22nd Sep 2016 03:02 PM
pawan kalyan,katamarayudu,majnu,nani,tanu vachenanta,avanthika,poorna,angel movie,nagabharanam,kodi rama krishna,tollywood tajaa updates,tollywood tazaa updates,september 21st  టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (21-9-16)..!
టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (21-9-16)..!
Advertisement
Ads by CJ
>1. 'కాటమరాయుడు' షూటింగ్ మొదలైంది 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' గా నిర్మితమవుతున్న చిత్రం షూటింగ్  హైదరాబాద్ లో ప్రారంభమైంది. శృతి హాసన్ కథానాయికగా నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ కుమార్ పార్దసాని (డాలి) దర్శకుడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో 15 రోజులపాటు తొలి షెద్యూల్ జరుగుతుంది. ఈ షెద్యూల్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు అలీ,అభినవ్ సింగ్,రావు రమేష్, లతో పాటు మరికొంతమంది పాల్గొంటారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ప్రసాద్ మూరెళ్ళ, సంగీతం: అనూప్ రూబెన్స్,

>2. సంచలనానికి ముస్తాబవుతున్న కోడి రామకృష్ణ విజువల్ వండర్ నాగభరణం

అమ్మోరు, అరుంధతి వంటి విజువల్ వండర్స్‌ని రూపొందించిన శత చిత్ర దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న మరో అద్భుత చిత్రం నాగభరణం. కన్నడ సూపర్‌స్టార్ విష్ణువర్థన్‌ను ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్‌తో క్రియేట్ చేయడం వండర్ అని అందరూ ప్రశంసించడం విశేషం. అద్భుతమైన గ్రాఫిక్స్‌తో.. విజువల్ వండర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని జయంతి లాల్ గాడా సమర్పణలో సాజిద్ ఖురేషి, దవల్‌గాడా, సొహైల్ అన్సారీ  నిర్మిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. రమ్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసిన 48 గంటల్లోనే 25 లక్షల వ్యూస్ రావడం విశేషం.కాగా ఈ చిత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పంపిణీ హక్కులను సురక్ష్ మీడియా అధినేత మల్కాపురం శివకుమార్ ఫ్యాన్సీ రేటుతో సొంతం చేసుకున్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని ఆయన భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ..  ఈ చిత్రం తెలుగులో తప్పకుండా సంచలనం సృష్టించడం ఖాయం. ఈగ, బహుబలి చిత్రానికి అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌ని క్రియేట్ చేసిన మకుట ఈ చిత్రానికి వండర్‌ఫుల్ విజువల్ ఎఫెక్ట్స్ సృష్టిస్తున్నారు. ఒక గొప్ప చిత్రాన్ని తెలుగులో విడుదల చేయడం ఆనందంగా వుంది అని తెలిపారు. దర్శకుడు  కోడి రామకృష్ణ మాట్లాడుతూ పూర్వ జన్మలో తాను కోల్పోయిన అనుబంధాలు, ఆప్యాయతల్ని మరు జన్మలో ఓ యువతి ఏ విధంగా తిరిగి సొంతం చేసుకోగలిగింది? నాగభరణంతో ఆమెకున్న సంబంధమేమిటి? అనేది చిత్ర ఇతివృత్తం. మకుట సంస్థ సమకూర్చిన గ్రాఫిక్స్ హంగులు ప్రేక్షకుల్ని సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తాయి. పతాక ఘట్టాల్లో విజువల్ ఎఫెక్ట్స్ ద్వారా కన్నడ నటుడు విష్ణువర్థన్‌ను పునఃసృష్టించాం. ఈ సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇటీవలే విడుదలైన ప్రచార చిత్రానికి చక్కటి ఆదరణ లభిస్తోంది అని తెలిపారు.

>3. అక్టోబర్ 5న మంచు లక్ష్మీ ప్రసన్న 'లక్ష్మీ బాంబ్' ఆడియో

మంచు లక్ష్మీ ప్రసన్న టైటిల్‌పాత్రలో గునపాటి సురేష్‌ రెడ్డి సమర్పణలో ఉద్భవ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వంలో వేళ్ల మౌనిక చంద్రశేఖర్‌, ఉమా లక్ష్మీనరసింహ నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం 'లక్ష్మీబాంబ్`. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. అక్టోబర్ 5న సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.  ఈ సంద‌ర్బంగా....

దర్శకుడు కార్తికేయ గోపాలకృష్ణ మాట్లాడుతూ ..సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. జయప్రదగారి జస్టిస్ రుద్రమదేవి తర్వాత అంతటి పవర్ ఫుల్ రోల్ చేస్తుంది లక్ష్మీగారే. మనోజ్ గారు క్లైమాక్స్ ఫైట్ కంపోజ్ చేయడం ఎసెట్ అవుతుంది. నిర్మాతలు సురేష్ రెడ్డిగారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. అక్టోబర్ 5న సినిమాను విడుదల చేసి మూవీని దీపావళి సందర్బంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం..అన్నారు.

>4. 'మజ్ను' నా సినిమా అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది  - నేచురల్‌ స్టార్‌ నాని 

వరుస హిట్స్‌తో ముందుకు దూసుకెళ్తున్న హ్యాట్రిక్‌ హీరో నాని 'మజ్ను'తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 'అంత:పురం', 'ఒకరికొకరు', 'నువ్వు నేను' రీసెంట్‌గా 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌', 'బీరువా' వంటి సూపర్‌హిట్‌ చిత్రాల్ని నిర్మించిన ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ అధినేత పి.కిరణ్‌ కేవ మూవీస్‌ అధినేత్రి గీత గొల్ల సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'మజ్ను'. హను ఇమ్మాన్యుయేల్‌, ప్రియ హీరోయిన్స్‌గా 'ఉయ్యాల జంపాల' ఫేం విరించివర్మ దర్శకత్వంలో రూపొందిన 'మజ్ను' చిత్రం సెప్టెంబర్‌ 23న వరల్డ్‌వైడ్‌గా ఏసియన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ద్వారా రిలీజ్‌ అవుతోంది. సూపర్‌హిట్‌ చిత్రాల మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపిసుందర్‌ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవల విడుదలై శ్రోతల నుండి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఆడియో సక్సెస్‌ మీట్‌ను సెప్టెంబర్‌ 20న హైదరాబాద్‌ దసపల్లా హోటల్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో నాని, హీరోయిన్‌ హను ఇమ్మానుయేల్‌, దర్శకుడు విరించివర్మ, మాటల రచయిత మిర్చి కిరణ్‌, ఏసియన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అధినేత సునీల్‌ నారంగ్‌, కమెడియన్‌ సత్య, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ సంతోషి లంక, నిర్మాతలు పి. కిరణ్‌, గీత గొల్ల పాల్గొన్నారు. 

చిత్ర దర్శకుడు విరించివర్మ మాట్లాడుతూ - నా రెండో సినిమా నానితో చేయడం లక్కీగా భావిస్తున్నాను. అలాగే ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ వంటి బిగ్‌ బ్యానర్‌లో నా రెండో సినిమా చేస్తానని ఎప్పుడూ ఊహించలేదు. కథ విని కిరణ్‌గారు బాగా ఇంప్రెస్‌ అయి నాని దగ్గరకు తీసుకెళ్లి కథ చెప్పించారు. నాని కూడా చాలా ఎగ్జైట్‌ అయి సినిమాని వెంటనే ఓకే చేశారు. కేవ మూవీస్‌ గీతగారు ఫస్ట్‌ నుండి లాస్ట్‌ వరకు ఫ్రెండ్‌లా ట్రీట్‌ చేస్తూ ఎంతో సపోర్ట్‌ చేసినందుకు చాలా థాంక్స్‌. గోపిసుందర్‌ సబ్జెక్ట్‌ విని ఇంప్రెస్‌ అయి ఎక్స్‌లెంట్‌ ట్యూన్స్‌ ఇచ్చారు. రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, రాంబాబు గోసాల మంచి లిరిక్స్‌ రాశారు. నేను రాసుకున్న కథని విజువల్‌గా అద్భుతంగా తీసి సినిమాని నెక్ట్స్‌ లెవల్‌కి తీసుకెళ్లారు. ఆర్ట్‌ డైరెక్టర్‌ అశోక్‌ రిచ్‌ లొకేషన్స్‌ని సెలక్ట్‌ చేశాడు. నానితో సినిమా చేయడం మంచి ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చింది..అన్నారు. 

హీరో నాని మాట్లాడుతూ -విరించివర్మ వచ్చి 'ఉయ్యాల జంపాల' కథ చెప్పాడు. నాకు బాగా నచ్చింది. కానీ ఇది కొత్త వాళ్లతో చేస్తే బాగుంటుందని విరించికి చెప్పాను. అతన్ని చూడగానే నాకు బాగా నచ్చాడు. అప్పుడే ఫిక్స్‌ అయ్యాను విరించివర్మతో ఒక సినిమా చేయాలని. అతను ఫస్ట్‌ 'వెన్నెల' అనే ఒక క్యూట్‌ షార్ట్‌ ఫిలిం తీశాడు. న్యూ కాన్సెప్ట్‌తో చాలా బాగా తీశాడు. తర్వాత కిరణ్‌గారు, గీతగారు విరించివర్మను తీసుకొచ్చి కథ చెప్పారు. బాగా నచ్చింది. చాలా ఎగ్జైట్‌ అయ్యాను. నాకు ఎప్పటి నుంచో లవ్‌స్టోరీస్‌ చేయాలని ఉంది. కథ విన్నాక 150 శాతం ఈ సినిమా చేయాలని డిసైడ్‌ అయ్యాను. నిజంగా ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్‌ చేశామో, ఎప్పుడు ఫినిష్‌ అయిందో తెలియకుండా కంప్లీట్‌ అయింది. సినిమా చేసేటపుడు హాయిగా ఎంజాయ్‌ చేస్తూ చేశాం. ఫైనల్‌ రిజల్ట్‌ చూశాక టు హండ్రెడ్‌ పర్సెంట్‌ విరించివర్మ న్యాయం చేశాడు అనిపించింది. చాలా ప్రౌడ్‌గా ఫీలయ్యాను. 'మజ్ను' ఇది నా సినిమా అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంది. సినిమా చూసి ఆడియన్స్‌ చాలా ఇంప్రెస్‌ అవుతారు. ఏ లెక్కలు వేసుకోకుండా సింపుల్‌గా తన మనసులో ఉన్న కథని అందంగా చూపించాడు. సినిమా చేసేటప్పుడు స్టార్టింగ్‌ నుండి ఎండింగ్‌ వరకు ఒక స్మైల్‌ ఉంటుంది. తెలియని ఒక హానెస్ట్‌, సింప్లిసిటీ ఉంది. ఈ చిత్రంలో ఫస్టాఫ్‌లో నాలుగు పాటలుంటాయి. ఈమధ్య కాలంలో ఏ సినిమాలో లేవు. పాటలన్నీ కథలో భాగంగానే ఉంటాయి. గోపిసుందర్‌ అవుట్‌ స్టాండింగ్‌ మ్యూజిక్‌ ఇచ్చారు. లవ్‌స్టోరీ కామెడీ, ఎమోషన్స్‌తో పాటు ఒక అందమైన కథ చెప్పాలనే ప్రయత్నం చేశాం. నా సినిమాల విషయంలో ప్రేక్షకుల్లో ఒక నమ్మకం ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నా సినిమా చూస్తారు. 'మజ్ను'తో అది డబుల్‌ అవుతుంది. కంప్లీట్‌గా కుటుంబం అంతా చూసి ఎంజాయ్‌ చేయగల సినిమా ఇది. జ్ఞానశేఖర్‌ ఫొటోగ్రఫి, గోపిసుందర్‌ మ్యూజిక్‌, విరించివర్మ టేకింగ్‌, మిర్చి కిరణ్‌ డైలాగ్స్‌ ఈ సినిమాకి మెయిన్‌ హైలైట్స్‌. సత్య నా ఫ్రెండ్‌ క్యారెక్టర్‌లో చాలా చాలా ముఖ్యమైన పాత్ర చేశాడు. మంచి పాటలు రాసిన లిరిక్‌ రైటర్స్‌కి నా థాంక్స్‌. 'మజ్ను' హండ్రెడ్‌ పర్సెంట్‌ హిట్‌ కాబోతోంది. అది ఏ రేంజ్‌ హిట్‌ అనేది ప్రేక్షకులే చెప్పాలి. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ నా థాంక్స్‌.. అన్నారు. 

>5. భీమవారం టాకీస్ 'అవంతిక' ఆరంభం !!

భీమవారం టాకీస్ పతాకంఫై ప్రొడక్షన్ నెం 90గా పూర్ణ. గీతాంజలి హీరోయిన్లుగా  కే.ఆర్.ఫణిరాజ్ సమర్పణలో శ్రీ రాజ్ బళ్ళా దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న హారర్ ఎంటర్ టైనర్  'అవంతిక'. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ నెల 21న ప్రముఖ దర్శకులు డా. దాసరి నారాయణరావు చేతుల మీదుగా..  పలువురు చిత్ర ప్రముఖుల సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్ణ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి .దాసరి క్లాప్ కొట్టగా..  ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. దర్శకులు రేలంగి నరసింహారావు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. మా భీమవారం టాకీస్ సంస్థలో నిర్మాణమవుతున్న 90వ చిత్రమిది. గురువుగారు దాసరి నారాయణరావుగారి క్లాప్ తో  ఈ సినిమా ప్రారంభం కావడం చాల ఆనందంగా వుంది. దర్శకుడు శ్ర్రీ రాజ్ బళ్ళా మీద పూర్తి నమ్మకంతో ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. పూర్ణ నటించిన  అవును, రాజుగారి గది సినిమాలు చాలా  పెద్ద హిట్ అయ్యాయి. ఆ కోవలో ఈ 'అవంతిక' కూడా పూర్ణతో పాటు మా సంస్థకి కూడా చాలా మంచి సినిమా అవుతుందన్న నమ్మకముంది. కథ మీద నమ్మకంతో ఎక్కడా రాజీ పడకుండా భారీగా  ఈ సినిమాని మా సంస్థలో నిర్మిస్తున్నాం. 34 రోజుల పాటు చేసే షెడ్యూలుతో షూటింగ్ పూర్తి చేసి..  ఆ తర్వాత 40 రోజులు చేసే పోస్టుప్రొడక్షన్ తో.. సినిమా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం... అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సి.కళ్యాణ్, రేలంగి నరసింహారావు,పూర్ణ, గీతాంజలి, శ్రీరాజ్, సమర్పకుడు  కె.ఆర్.ఫణిరాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ధీరజ అప్పాజీ, హీరోయిన్ గీతాంజలి, కెమెరామెన్ కర్ణ ప్యారసాని మరియి చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

పూర్ణ, గీతాంజలి, శ్రీరాజ్, ధనరాజ్, షకలక శంకర్, మల్లిక, రవి, సంపత్, గిరిధర్, ఫణి, పుచ్ఛా రామకృష్ణ, అజయ్ ఘోష్, నామాల మూర్తి, శివరామకృష్ణ నటిస్తున్న ఈ చిత్రానికి..  పబ్లిసిటీ డిజైనర్: వెంకట్.ఎం, కెమెరా: కర్ణ ప్యారసాని, ఎడిటింగ్: సోమేషే పోచం, డి. ఐ & 5.1: శివ వై.ప్రసాద్, మాటలు: క్రాంతి.సైనా, పాటలు: భారతీబాబు, సంగీతం: రవిరాజ్  బళ్ళా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ అప్పాజీ, సమర్పణ: కె.ఆర్.ఫణిరాజ్, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీరాజ్ బళ్ళా !!

>6. పాలకొల్లులోనాగ అన్వేష్ 'ఏంజెల్' సెకండ్ షెడ్యూల్ ...

నాగ అన్వేష్, హేబా పటేల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం 'ఏంజెల్'. 'బాహుబలి' ఫేం పళని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై భువన్ సాగర్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ సోషియో ఫాంటసీగా రానున్న 'ఏంజెల్' చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అక్టోబర్ 15 నుంచి పాలకొల్లు పరిసరాల్లోని అందమైన లొకేషన్స్ లో ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. దాదాపు 20 రోజులపాటు జరిగే ఈ షెడ్యూల్ లో నాగ అన్వేష్, హేబా పటేల్, సప్తగిరి, షియాజీ షిండే, ప్రదీప్ రావత్ తదితరులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మరోవైపు భీమ్స్ సంగీత సారధ్యంలో పాటల రికార్డింగ్ కూడా జెట్ స్పీడులో జరుగుతోంది. ఈ నెలాఖరు నుంచి ముంబైలో వాయిస్ మిక్సింగ్ చేయనున్నాడు భీమ్స్. ఇక ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ రషెస్ చూసిన చిత్రబృందం, సినిమా అద్భుతంగా వచ్చిందని, ఇదే ఉత్సాహంతో ముందుకు సాగుతామని అంటున్నారు. అలానే తన కెరీర్ లోనే 'ఏంజెల్' గొప్ప సినిమా అవుతోందని హెబ్బా కాన్ఫీడెంట్ గా చెబుతోంది. అంతేకాదు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న సప్తగిరి ఈ సినిమా రిలీజ్ తరువాత తను నెక్ట్స్ లెవల్ కి వెళ్తానంటూ స్టేట్ మెంట్స్ ఇస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ లో నాగ అన్వేష్ ప్రదర్శీస్తోన్న నటన చూసి పలువురు సీనియర్ నటులు మెచ్చుకోవడం విశేషం. 

>7. అచ్యుత ఆర్ట్స్‌ 'తను.. వచ్చేనంట..' 

తేజ కాకుమాను, రేష్మి గౌతమ్‌, ధన్యబాలకృష్ణన్‌, చలాకి చంటి, శివన్నారాయణ, ఫిష్ వెంకట్ తదితరులు నటీనటులుగా రూపొందుతున్న చిత్రం 'తను.. వచ్చేనంట'. అచ్యుత ఆర్ట్స్‌  పతాకంపై చంద్రశేఖర్‌ ఆజాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వెంకట్‌ కాచర్ల దర్శత్వం వహిస్తున్నారు. శరవేగంగా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ నెలాఖరులో విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్ నిమిత్తం రేష్మి గౌతమ్, తేజ కాకుమాను విజయవాడ రేడియో మిర్చిలో మరియు విజయవాడ సిద్దార్ధ కాలేజీ స్టూడెంట్స్ తో హల్చల్ చేసారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీ చంద్రశేఖర్ ఆజాద్ పాటిబండ్ల మాట్లాడుతూ..ఇటీవల రిలీజ్ చేసిన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. మా హీరో తేజ కాకుమాను విజయవాడ వాడే కావడంతో జనాల్లో అతనికి మంచి రెస్పాన్స్ వస్తుంది. రేడియో మిర్చి ప్రోగ్రాం కి, సిద్దార్ధ కాలేజీ కి వెళ్ళినప్పుడు అందరు మీ చిత్రం ట్రైలర్ చూసాము, సాంగ్స్ విన్నాము చాల బాగున్నాయి అని చెప్తున్నారు. జామెడీ అంటే ఏంటి అని ఎంతో ఆతృతగా అడుగుతున్నారు. మా చిత్రానికి మేము అనుకున్నదానికంటే మంచి రెస్పాన్స్ ప్రేక్షకుల నుంచి వస్తుంది. మొదటినుంచి మాచిత్రాన్ని జనాలకి బాగా చేరువ చేసిన మీడియా వారికి కృతఙ్ఞతలు తెలుపుతున్నాము అని అన్నారు. హీరో తేజ కాకుమాను మాట్లాడుతూ..నేను విజయవాడ లోనే చదువుకున్నాను. నను ఇంతగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు. బాహుబలి చిత్రం తర్వాత ఈ సినిమాలో హీరోగా తొలి పరిచయం కావడం ఆనందంగా ఉంది.. అని అన్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ