Advertisementt

బ్యాంకాక్ నుండి బరిలోకి దిగుతున్నారు!

Wed 21st Sep 2016 01:55 PM
sampath nandi,gopichand,bangkok city,sampath nandi new movie  బ్యాంకాక్ నుండి బరిలోకి దిగుతున్నారు!
బ్యాంకాక్ నుండి బరిలోకి దిగుతున్నారు!
Advertisement
Ads by CJ

సెప్టెంబర్ 22 నుండి బ్యాంకాక్ లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకోనున్నగోపీచంద్, సంపత్ నంది చిత్రం

మాస్, యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడుగా ...హ్యాట్రిక్ హిట్ చిత్రాల దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో అన్నీ ర‌కాల క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌ తో కూడిన హై ఓల్టేజ్ యాక్ష‌న్‌ మాస్ ఎంటర్ టైనర్ రూపొందనున్న సంగతి తెలిసిందే.  శంఖం, రెబల్ వంటి యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ సినీ మీడియా బ్యాన‌ర్‌పై జె.భగవాన్, జె.పుల్లారావు  నిర్మాత‌లుగా ఓ భారీ బ‌డ్జెట్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ఇటీవల లాంచనంగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో హన్సిక, క్యాథరిన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ సెప్టెంబర్ 22 నుండి బ్యాంకాక్ లో జరగనుంది. ఈ సందర్భంగా...

చిత్ర నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు మాట్లాడుతూ - గోపీచంద్ హీరోగా, సంపత్ నంది దర్శకత్వంలో హై ఓల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్ తో నిర్మిస్తున్నాం. హీరో, హీరోయిన్, విలన్ ఇంట్రడక్షన్ సీన్స్ తో పాటలు, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తాం. ఇప్పటి వరకు ఎవరూ చిత్రీకరించని లోకేషన్స్ లో షూటింగ్ ప్లాన్ చేశాం. ఈ నెల 22 నుండి 30 రోజుల పాటు జరగనున్న లాంగ్ షెడ్యూల్ లో హీరో గోపీచంద్, హీరోయిన్స్ హన్సిక, క్యాథరిన్, ముకేష్ రుషి, నికితన్ ధీర్(తంగబలి) సహా 70 మంది చిత్రయూనిట్ సభ్యులు పాల్గొంటారు. యాక్షన్ సన్నివేశాలు, భారీ చేజ్ తో కూడిన ఇంటర్వెల్ సీన్, గుర్రాలతో ఉండే యాక్షన్ పార్ట్ సహా అడ్వేంచేరస్ గా ఈ షెడ్యూల్ ఉంటుంది.. అన్నారు.

ముఖేష్ రుషి, నికితన్ ధీర్(తంగబాలి), అజయ్, వెన్నెల కిషోర్ ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: బెజవాడ కోటేశ్వరరావు, స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: సుధాకర్ పావులూరి, కో డైరెక్టర్: హేమాంబర్ జాస్తి, ఆర్ట్: కడలి బ్రహ్మ, యాక్షన్: రామ్-లక్ష్మణ్, ఎడిటర్: గౌతంరాజు,సంగీతం: ఎస్.ఎస్.థమన్, నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు,కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: సంపత్ నంది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ