Advertisementt

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (17-9-16)..!

Sun 18th Sep 2016 06:37 PM
gautamiputra satakarni,balakrishna,prema bhiksha,idho prema lokam,deyyala bandi,tollywood tajaa updates,tollywood tazaa updates,september 17th  టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (17-9-16)..!
టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (17-9-16)..!
Advertisement
Ads by CJ
>1. 'గౌతమి పుత్ర శాతకర్ణి` మొద‌టి పాట చిత్రీకరణ 

నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఫస్ట్‌ ఫ్రేమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి.బ్యానర్‌పై రూపొందుతోన్న ప్రెస్టిజియస్‌ మూవీ 'గౌతమిపుత్ర శాతకర్ణి'. నేషనల్‌ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ డైరెక్టర్‌ జాగర్లమూడి క్రిష్‌ దర్శకత్వంలో వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో చిత్రీకరణను జరుపుకుంటుంది. ఈ సినిమాకు చిరంతన్‌ భట్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సందర్భంగా.... 

చిత్ర నిర్మాతలు వై.రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు మాట్లాడుతూ - ఈ చిత్రానికి గతంలో క్రిష్‌ దర్శకత్వం వహించిన జాతీయ అవార్డ్‌ విన్నింగ్‌ మూవీ కంచె చిత్రానికి సంగీతం అందించిన చిరంతన్‌భట్‌ను దేవిశ్రీ ప్రసాద్‌ స్థానంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌గా తీసుకున్నాం. సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన సీనియర్‌ డ్యాన్స్‌ మాస్టర్‌ స్వర్ణ నృత్య దర్శకత్వంలోనీ సాంగ్‌ను మధ్యప్రదేశ్‌లో చిత్రీకరించనున్నారు. ముంబైకి చెందిన క్లాసికల్‌ డ్యాన్సర్స్‌ ఈ పాటలో నర్తిస్తున్నారు.

ఈ నాలుగో షెడ్యూల్‌లో  బాల‌కృష్ణ‌, శ్రియ‌, క‌బీర్ బేడి, హేమామాలిని పాల్గొన్న రాజసూయ యాగం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేశాం. బాలకృష్ణ ఇతర తారాగణంపై అద్భుతమైన రాజదర్బార్‌ సెట్‌లో ఓ సాంగ్‌ను  చిత్రీక‌రిస్తున్నాం.  సెప్టెంబర్‌ 25 వరకు జరిగే ఈ సాంగ్‌ చిత్రీకరణతో తాజా షెడ్యూల్‌ పూర్తవుతుంది.  ఈ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌తో  80 శాతం సినిమా పూర్తవుతుంది. వి.ఎఫ్‌.ఎక్స్‌ కోసం నాలుగు స్పెషల్‌ టెక్నికల్‌ టీమ్‌లు పనిచేస్తున్నాయి. సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం.. అన్నారు. 

నటసింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో హేమామాలిని, శ్రేయ, క‌బీర్ బేడి త‌దిత‌ర‌లు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి  సమర్పణ: బిబో శ్రీనివాస్, సినిమాటోగ్రాఫర్: జ్ఞాన శేఖర్, ఆర్ట్: భూపేష్ భూపతి,  సంగీతంః చిరంత‌న్ భ‌ట్‌, సాహిత్యం: సీతారామశాస్త్రి, మాటలు: సాయిమాధవ్ బుర్రా, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, సహ నిర్మాత: కొమ్మినేని వెంకటేశ్వరరావు, నిర్మాతలు: వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు, దర్శకత్వం: క్రిష్.

>2. సాంగ్స్‌ రికార్డింగ్‌లో 'ప్రేమభిక్ష' 

ఓం శ్రీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో అనిల్‌, శృతిలయ హీరోహీరోయిన్‌లుగా, ఎం. ఎన్‌. బైరారెడ్డి, నాగరాజు నిర్మాతలుగా, ఆర్‌.కె. గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న చిత్రం 'ప్రేమభిక్ష'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ సంగీత సారథ్యంలో సాంగ్స్‌ కంపోజింగ్‌ జరుగుతుంది. 

ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ..అనంతపురం జిల్లా భద్రపట్నం అనే గ్రామంలో జరిగిన యదార్ధ ఘటనను తీసుకుని దర్శకుడు గాంధీ ఓ మంచి కథను తయారు చేశాడు. 'ప్రేమభిక్ష' అనే టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రం ఈ నెల 19 నుండి షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించి 75 శాతం షూటింగ్‌ అనంతపురం జిల్లా భద్రపట్నంలోనే జరుగుతుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి సంగీత దర్శకుడు ఘంటాడి కృష్ణ సారథ్యంలో అమూల్య స్టూడియోలో సాంగ్స్‌ కంపోజింగ్‌ జరుగుతున్నాయి. ప్రముఖ సింగర్స్‌ ధనుంజయ్‌, సునీల్‌ కశ్యప్‌, హేమచంద్రలు ఈ సాంగ్స్‌ రికార్డింగ్‌ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అనిల్‌, శృతిలయలు హీరో హీరోయిన్‌లుగా నటించనున్న ఈ చిత్రంలో ప్రముఖ నటీనటులందరూ నటించనున్నారు...అని అన్నారు. 

అనిల్‌, శృతిలయ, సుమన్‌, షఫీ, రాజేంద్ర, కింగ్‌ మోహన్‌, కిల్లర్‌ వెంకటేష్‌, జ్యోతి మొదలగు వారు నటించనున్న ఈ చిత్రానికి స్టంట్స్‌: శంకర్‌, కొరియోగ్రఫీ: ఎస్‌.ఎస్‌.కె. సందీప్‌, పాటలు: ఘంటాడి కృష్ణ, రామ్‌ పైడిశెట్టి; సంగీతం: ఘంటాడి కృష్ణ, కెమెరా: ప్రమోద్‌. ఆర్‌; నిర్మాతలు: ఎం.ఎన్‌. బైరారెడ్డి, నాగరాజు; కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: ఆర్‌.కె.గాంధీ.

>3. ఈ నెల‌ 23న ‘దెయ్యాల‌బండి’ వస్తోంది!

గతంలో 5కల‌ర్స్‌ మల్టీమీడియా మూవీ పతాకంపై ఏకవీర, వెంటాడు-వేటాడు చిత్రాల‌ను నిర్మించారు శ్రీనివాస్‌ దామెర. తాజాగా 5కల‌ర్స్‌ మల్టీమీడియా సమర్పణలో ఎస్‌టిఐఫ్‌ ఎంటర్‌ టైన్‌మెంట్స్‌ పతాకంపై ‘హౌల్‌’ అనే హాలీవుడ్‌ చిత్రాన్ని తెలుగులోకి ‘దెయ్యాల‌బండి’ పేరుతో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల‌ 23న ఇండియా వైడ్‌గా విడుదల‌వుతోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శ్రీనివాస్‌ దామెర మాట్లాడుతూ... 'conjuring 2,  lights out,  don't breathe' చిత్రాల త‌ర‌హాలో వ‌స్తోన్న హ‌ర్ర‌ర్  చిత్రం `దెయ్యాల‌బండి'. ఈ చిత్ర క‌థ విష‌యానికొస్తే ...ఒక సిటీ నుంచి బయలు దేరిన ప్యాసింజర్స్‌ ట్రైన్‌ హెవీ రైన్‌ కారణంగా దట్టమైన అడవుల్లో చిక్కుకుపోతుంది. ఆ సమయంలో ఆ ట్రైన్‌ లోకి వింత వింత ఆకారాతో, హాహాకారాలు  చేస్తూ కొన్ని దెయ్యాలు ఆ ట్రైనులోకి ఎంటరై  అందులోని ప్యాసింజర్స్‌ని ఏ విధంగా చంపాయి?  ఏంటి? అన్నది సినిమా కథ. ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. ఇటీవల కాలంలో ఎన్నో హర్రర్‌ చిత్రాలు వచ్చాయి. కానీ ఇది పూర్తిగా డిఫరెంట్‌ ఫిలిం. హాలీవుడ్‌లో గతేడాది విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. తెలుగు ప్రేక్షకుల‌కు నచ్చుతుందన్న ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదించి ఈ నె 23న ఇండియా వైడ్‌గా విడుద చేస్తున్నాం...అన్నారు. 

ఈడి స్పీర్స్‌, సీన్‌ పెర్ట్వి, హోలీ వెస్టన్‌, షౌనా మెక్‌నాల్డ్‌, ఇల్లియంట్‌ కాన్‌, కాల్విన్‌ డెన్‌, తదితరులు  ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి దర్శకుడు:ఫౌల్‌హిత్‌, నిర్వహణ: రాధాకృష్ణ, నిర్మాత: శ్రీనివాస్‌ దామెర.

>4. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాల్లో 'ఇదో ప్రేమ లోకం' 

శ్రీ శ్రీనివాసా ఫిలింస్‌ బ్యానర్‌లో ఎస్‌.పి. నాయుడు నిర్మాతగా సెన్సేషనల్‌ దర్శకుడు కోడిరామకృష్ణ శిష్యుడైన టి. కరణ్‌రాజ్‌ దర్శకత్వంలో అశోక్‌చంద్ర(నూతనపరిచయం), రాజా సూర్యవంశీ, తేజారెడ్డి, కారుణ్య హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకున్న చిత్రం 'ఇదో ప్రేమ లోకం'. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. 

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు టి. కరణ్‌రాజ్‌ మాట్లాడుతూ..ఇదో అందమైన ప్రేమకథ. ప్రియుడికి ఇచ్చిన మాటకోసం తన వాళ్ళను వదులుకుని, ఓ రాతి మనిషిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ఓ మేఘమాల కథ. నేను రాసుకున్న కథను నమ్మి..ఈ కథను చిత్రంగా మలిచేందుకు నిర్మాత ఎస్‌.పి. నాయుడు గారు ఎంతగానో సహకరించారు. ఖర్చుకు వెనకాడకుండా అందమైన లోకేషన్లలో చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు ఆయన ఎంతగానో తోడ్పడ్డారు. అలాగే ఈ ప్రేమలోకానికి నటీనటులు, టెక్నిషియన్లు ఇచ్చిన సహకారం మర్చిపోలేనిది. తప్పకుండా ప్రేక్షకులు మెచ్చే ఓ మంచి ప్రేమకథా చిత్రంగా ఈ చిత్రం ఉంటుంది..అని అన్నారు. 

నిర్మాత ఎస్‌.పి. నాయుడు మాట్లాడుతూ..దర్శకుడు కరణ్‌రాజ్‌ ఓ మంచి కథా చిత్రాన్ని మా బ్యానర్‌ ద్వారా ఇవ్వబోతున్నందుకు సంతోషంగా ఉంది. ప్రత్యేకపాత్రలో నటించిన సుమన్‌ మరియు నరేష్‌ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వందేమాతరం శ్రీనివాస్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. కోదాడ, మట్టపల్లి, వేదాద్రి వంటి ప్రాంతాల్లో షూటింగ్‌ జరిపాము. అరకులోని సుందరమైన లోకేషన్లలో రెండు పాటలను చిత్రీకరించాము. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తప్పకుండా ప్రేక్షకులు మెచ్చే ఓ మంచి చిత్రంగా 'ఇదో ప్రేమ లోకం' ఉంటుందని తెలుపుతున్నాము..అని అన్నారు. 

అశోక్‌చంద్ర(నూతనపరిచయం), రాజా సూర్యవంశీ, తేజారెడ్డి, కారుణ్య, సుమన్‌, నరేష్‌, భగవాన్‌, మెల్కోటి, దేవిశ్రీ, ప్రభావతి, ఎస్‌.పి. నాయుడు, బాలనటుడు టి. చంద్రమహేష్‌, టి. అశోక్‌కుమార్‌ మొదలగువారు నటించిన ఈ చిత్రానికి సంగీతం: వందేమాతరం శ్రీనివాస్‌, ఎడిటింగ్‌: నందమూరి హరి, కెమెరా: కె. శివ, కో-డైరెక్టర్‌: దుర్గేష్‌, నిర్మాత: ఎస్‌.పి. నాయుడు, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: టి. కరణ్‌రాజ్‌

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ