Advertisementt

టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (2-9-16)- 2

Sat 03rd Sep 2016 07:12 PM
mahabali,ism,kumari 18 plus,chinni chinni ashalu nalo regene platinum disc event,short film contest,aame athadaithe,trayam,bichhagadu producer,maya mall,tollywood tajaa updates,tollywood tazaa updates,september 2nd  టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (2-9-16)- 2
టాలీవుడ్ తాజా అప్ డేట్స్ (2-9-16)- 2
Advertisement

5. హైదరాబాద్‌ రౌండ్‌ టేబుల్‌ 8 'షార్ట్‌ ఫిలిం కాంటెస్ట్‌'

హైదరాబాద్‌ రౌండ్‌ టేబుల్‌ 8 ఆధ్వర్యంలో షార్ట్‌ ఫిలిం కాంటెస్ట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో డి.సురేష్ బాబు, జెమిని కిరణ్, రాజ్ కందుకూరి, సుబ్బారావు, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం చాలా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస అవసరాలు లేవు. దాని కారణంగా కార్పొరేటర్‌ స్కూల్స్‌ తో పోటీ పడలేకపోతున్నాయి. ప్రాజెక్ట్‌ 511 ద్వారా ఇలాంటి పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేస్తున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మెదక్‌ ప్రాంతాల్లో 1022 స్కూల్స్‌ లో కనీస అవసరాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే మిగిలిన స్కూల్స్‌ లో సదుపాయాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంస్థ నేతృత్వంలో మూడు నుండి పది నిమిషాల వ్యవథిలో షార్ట్‌ ఫిలింస్‌ కాంటెస్ట్‌ ను నిర్వహిస్తున్నారు. ఈ కాంటెస్ట్‌ కోసం డి.సురేష్‌బాబు, రామ్మోహన్‌ రావు, తరుణ్‌భాస్కర్‌, అవరసరాల శ్రీనివాస్‌లు జ్యూరీ సభ్యులుగా ఉంటారు. షార్ట్‌ ఫిలింస్‌ను p511shortfilm@gmail.com మెయిల్ కుపంపాలి. సెప్టెంబర్‌20 వరకు పంపాలి. అక్టోబర్‌ 9న ఈ షార్ట్‌ ఫిలింస్‌ను జె.ఆర్‌.సి.కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరవుతారు. ఈ కాంటెస్ట్‌ కు ఏ ఫీజు లేదు, అలాగే భాషా బేదం లేదు. ఈ కాంటెస్ట్‌ మొదటి ప్రైజు విజేతకు 50వేల రూపాయలు,రెండవ ప్రైజుకు 15వేల రూపాయలు, మూడవ ప్రైజుగా 10వేల రూపాయలు అందిస్తారు.ఈ సందర్భంగా...డి.సురేష్‌ బాబు మాట్లాడుతూ - పాఠశాలల్లో కనీస అవసరాల కోసం ప్రాజెక్ట్‌ 511 చేస్తున్న చిన్న ప్రయత్నమిది. దీని ద్వారా పేద విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించవచ్చు. ఎవరైనా మంచి స్క్రిప్ట్‌తో ముందుకు వస్తే కెమెరాలను మా స్టూడియో ద్వారా అందించే ప్రయత్నం చేస్తాం... అన్నారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ - మంచి నాణ్యమైన విద్య కోసం చేసే ఈ ప్రయత్నం చాలా గొప్పది. మన ఇండస్ట్రీలోని చాలా మంది దర్శకులున్నారు. వారు కూడా ఈ కాంటెస్ట్ లో పాల్గొంటే బావుంటుంది.. అన్నారు. ప్రాజెక్ట్ 511దేశంలో చదువుకునే పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడానికి స్థాపితమైన రౌండ్ టేబుల్ ఆఫ్ ఇండియాలో 600 స్కూల్స్ ను నిర్మించింది. అందులో 40 స్కూల్స్ ను హైదరాబాద్ లో నిర్మించింది. అందులో భాగంగా హైదరాబాద్ రౌండ్ టేబుల్ 8 సంస్థ 2000 సంవత్సరం కంటే ముందు నుండి దేశంలోని ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు ప్రాథమిక అవసరాలను అందించడానికి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా హైదరాబాద్, రంగారెడ్డిలలోని 1022 పాఠశాలల్లోని దాదాపు రెండు లక్షలకు పైగా విద్యార్థులకు తమ వంతు సహకారాన్ని అందించింది.

6. 'కుమారి 18+' మోషన్‌ పోస్టర్‌ విడుదల

వై.సుధాకర్‌ సమర్పణలో సెన్సేషనల్‌ హిట్‌ మూవీస్‌, ఫిల్మ్‌ విల్లా స్టూడియోస్‌ అసోసియేట్స్‌ పతాకాలపై శ్రీ సత్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కుమారి 18+'. మాల్యి మల్హోత్రా, యోధ, గోపీకృష్ణ, సాయికిరణ్‌, ఆదిత్యరామ్‌ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ విడుదల కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సినిమా మోషన్‌ పోస్టర్‌ను రాజ్‌కందుకూరి, మల్లిఖార్జున్‌రావులు విడుదల చేశారు. ఈ సందర్భంగా....హీరో ఆదిత్యరామ్‌ మాట్లాడుతూ - 'దర్శకుడు నన్ను బాగా ఎంకరేజ్‌ చేశారు. ఈ చిత్రంలో డాక్టర్‌ పాత్రలో కనపడతాను. హీరోయిన్‌ చక్కగా నటించింది. సహకారం అందించిన అందరికీ థాంక్స్‌' అన్నారు. సాయికిరణ్‌ మాట్లాడుతూ - 'ఈ సినిమాలో టైలర్‌ రోల్‌ చేశాను. డిఫరెంట్‌ ఏజ్‌లో ఉండే నలుగురు అబ్బాయిలు, అందంగా ఉండే అమ్మాయిని ప్రేమిస్తారు. దర్శకుడు శ్రీసత్య కారణంగానే సినిమా బాగా వచ్చింది. అందరికీ థాంక్స్‌' అన్నారు. మాల్యి మల్హోత్రా మాట్లాడుతూ -'ఆడిషన్‌లో నన్ను హీరోయిన్‌గా సెలక్ట్‌ చేశారు. ఈ సినిమాకు ముందు థియేటర్‌ ఆర్టిస్ట్‌గా వర్క్‌ చేశాను. ఒక మంచి పాత్రతో తెలుగు సినిమాకు పరిచయం కావడం ఆనందంగా ఉంది' అన్నారు. రాజ్‌ కందుకూరి మాట్లాడుతూ - 'యూత్‌కు నచ్చే టైటిల్‌. సినిమా పెద్ద సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను' అన్నారు. మల్లిఖార్జున్‌ మాట్లాడుతూ - 'దర్శకుడు శ్రీసత్య, నిర్మాతలు మంచి ప్లానింగ్‌తో సినిమా చేస్తున్నారు. క్యూట్‌ లవ్‌స్టోరీ' అన్నారు. డైరెక్టర్‌ శ్రీ సత్య మాట్లాడుతూ - 'సినిమా అంతా హీరోయిన్‌ చుట్టూ తిరుగుతుంది. గేమ్‌లో ఎక్కువ మంది ఉంటేనే ఆసక్తి ఏర్పడుతుంది. అలాగే ఈ సినిమాలో ఓ అమ్మాయి కోసం ఒక డాక్టర్‌, ప్రొఫెసర్‌, ట్రైలర్‌, స్టూడెంట్‌ ఇలా నలుగురు మధ్య ఎలాంటి పోటీ నెలకొందనేదే కథ. షూటింగ్‌ అంతా పూర్తయ్యింది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను ఈ నెలలో విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం' అన్నారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ - సినిమా బాగా వచ్చింది. యూత్‌కు నచ్చే లవ్‌ ఎంటర్‌టైనర్‌. సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌.. అన్నారు.

7. సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న 'మాయా మాల్‌'

'హోరా హోరీ' ఫేమ్ దిలీప్ హీరోగా గ్రీష్మ ఆర్ట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో వైష్ణ‌వి మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న చిత్రం 'మాయా మాల్‌'. ఇషా హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో సోనియా, దీక్షాపంత్‌, పృథ్వీ, నాగినీడు త‌దిత‌రులు ప్ర‌ధాన తారాగణంగా న‌టించారు. గోవింద్ లాలం ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని కె.వి.హ‌రికృష్ణ‌, చందు ముప్పాళ్ల‌, న‌ల్లం శ్రీనివాస్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న సినిమాను సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా....చిత్ర నిర్మాత‌లు  మాట్లాడుతూ...ల‌వ్ అండ్ హ‌ర్ర‌ర్ కామెడి థ్రిల్ల‌ర్‌గా రూపొందిన మా మాయా మాల్ చిత్రం నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంది. ఓ మాల్‌లో ప్ర‌ధానాంశంగా సాగే సినిమా. అవుట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. గ‌తంలో ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజుగారి బ్యాన‌ర్‌లో ప‌నిచేసిన గోవింద్ లాలం కొత్త కథనంతో ఈ చిత్రాన్ని చక్కగా ఆస‌క్తిక‌రంగా తెరకెక్కించారు. దిలీప్, ఇషా జంట‌గా న‌టించిన ఈ చిత్రంలో పృథ్వీ, ష‌క‌ల‌క శంక‌ర్‌, తాగుబోతు ర‌మేష్‌ల కామెడి చాలా హైలైట్‌గా నిలుస్తుంది. యంగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ సాయికార్తీక్‌గారు అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతుంది. ఈ చిత్రానికి దాశ‌ర‌థి శివేంద్ర సినిమాటోగ్ర‌ఫీ అందింస్తుండ‌గా, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వ‌ర్క్ చేస్తున్నారు. మంచి టీంతో ఈ సినిమాను రూపొందిస్తున్నాం. ఈ వినాయ‌క చ‌వితికి ఫస్ట్ లుక్ ను విడుద‌ల చేస్తున్నాం. అలాగే సెప్టెంబ‌ర్ 8న టీజ‌ర్‌ను విడుద‌ల చేస్తున్నాం. త్వ‌ర‌లోనే సాయికార్తీక్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుద‌ల చేసి ఈ సెప్టెంబ‌ర్ నెల‌లోనే సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాం... అన్నారు. 

8. 'బిచ్చ‌గాడు' నిర్మాత‌ల నుంచి మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్‌ 

ప్ర‌చారంలో కొత్త ఒర‌వ‌డి, అసాధార‌ణ‌మైన కంటెంట్ ఉంటే ఆ సినిమా హిట్టే. ఇటీవ‌లి కాలంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించిన అనువాద చిత్రం 'బిచ్చ‌గాడు' నేర్పిన పాఠ‌మిది.  ఓ అనువాద చిత్రం ఈ స్థాయి విజ‌యం సాధించిందంటే నిర్మాత‌లు చేసిన అద్భుత ప్ర‌చార‌మే అందుకు కారణం. ఓ స్ట్రెయిట్ సినిమాకి ధీటుగా ఈ సినిమాకి ప్ర‌మోష‌న్ చేశారు నిర్మాత‌లు. శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ ప‌తాకంపై చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించారు.  కేవ‌లం కోటిన్న‌రతో తెర‌కెక్కి 25 కోట్లు పైగా వ‌సూళ్లు సాధించిన రేర్ మూవీ ఇది. 50 థియేట‌ర్ల నుంచి 200 థియేట‌ర్ల‌కు అంచెలంచెలుగా రేంజు పెంచుకుంటూ వెళ్లి బంప‌ర్ హిట్ కొట్టిన చిత్ర‌మిది. ఈ స్థాయి బ్లాక్‌బ‌స్ట‌ర్‌ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన నిర్మాత‌ చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి మ‌రో అరుదైన చిత్రాన్ని తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించ‌నున్నారు. మ‌ల‌యాళంలో ఇటీవ‌ల రిలీజై బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించిన‌ 'ఆన్ మ‌రియ క‌లిప్పిలాను' చిత్రాన్ని తెలుగులో అందించ‌నున్నారు. 'ఓకే బంగారం' ఫేం దుల్కార్ స‌ల్మాన్ ఓ ముఖ్య అతిధిగా న‌టించ‌గా.. 'నాన్న‌' (విక్ర‌మ్ సినిమా) చిత్రంలో క్యూట్ అప్పియ‌రెన్స్‌, చ‌క్క‌ని  పెర్ఫామెన్స్‌తో ఆక‌ట్టుకున్న బేబి సారా అర్జున్ ఈ చిత్రంలో టైటిల్ పాత్ర‌లో న‌టించారు. మిథున్ మాన్యూల్ థామ‌స్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. స‌న్ని వాయ్‌నే, అజు వ‌ర్గీస్ ఇత‌ర‌ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు. ఇటీవ‌లే రిలీజైన ఈ చిత్రం మ‌ల‌యాళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించ‌డంతో తెలుగు అనువాద హ‌క్కుల కోసం భారీ పోటీ ఏర్ప‌డింది. పోటీలో ఫ్యాన్సీ రేటు చెల్లించి రిలీజ్ హ‌క్కుల్ని ద‌క్కించుకున్నారు. ఓ  ఫ్రాడ్‌స్ట‌ర్‌తో చిన్నారి చేసిన సావాసం ఎలాంటి ప‌రిణామాల‌కు దారి తీసింద‌న్న‌దే సినిమా. థామ‌స్ ఓ సింపుల్ స‌బ్జెక్ట్‌ని రియ‌లిస్టిక్ పంథాలో ఆవిష్క‌రిస్తూనే... స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌తో ఆద్యంతం ర‌క్తిక‌ట్టించేలా తెర‌కెక్కించారని మ‌ల్లూవుడ్‌లో క్రిటిక్స్ ప్ర‌శంసించారు. కేర‌ళ‌లో 70 పైగా థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ చిత్రం రికార్డ్ వ‌సూళ్లు సాధించింది. కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ చిత్ర‌మిద‌ని మ‌ల‌యాళ యంగ్ హీరో, సూప‌ర్‌స్టార్ దుల్కార్ స‌ల్మాన్ ప్ర‌శంసించ‌డం విశేషం.

9. త్రయం హిందీ రైట్స్ విక్రయం 

రోజు  రోజుకు చిన్న సినిమాలకు ఆదరణ పెరుగుతుంది . పెద్ద చిత్రాలకు ధీటుగా  చిన్న చిత్రాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి . సినిమాలో విషయం ఉండాలి కానీ   బాషా బేధం లేకుండా  మంచి ధరలు పలుకుతున్నాయి . ఎలాంటి హైప్ లేకుండా వస్తున్న  చిత్రం 'త్రయం' .  అందరూ కొత్త వాళ్లే   అయిన ఎక్కడా   కాంప్రమైజ్    కాకుండా దర్శకుడు  చిత్రాన్ని తెరకెక్కించారు . ఈ చిత్రం ట్రైలర్ విడుదల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది . ఎవరు ఊహించని విధంగా ఈ చిత్రం హిందీ రైట్స్ నీ ఒక ప్రముఖ సంస్థ మంచి రేటు తో సొంతం  చేసుకుంది . గౌతమ్ నాయుడు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని  పద్మజ నాయుడు నిర్మించారు . ఇదే నెలలో ఈ  చిత్రాన్ని విడుదల చెయ్యడానికి  సన్నహాలు చేస్తున్నారు. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement