కొరటాల శివకీ... రామ్‌చరణ్‌కీ మధ్య దూరం పెరిగిందా? ఇకపై వాళ్లు కలిసి సినిమా చేసే అవకాశం లేదా? అందులో నిజమెంతో తెలియదు కానీ... ఇండస్ట్రీ జనాలు మాత్రం ఇలాగే చర్చించుకొంటున్నారు. నిజానికి రామ్‌చరణ్, కొరటాల కాంబోలో సినిమా మిర్చి తర్వాతే సెట్టయింది. సినిమాకి కొబ్బరికాయ కూడా కొట్టారు. అయితే ఏమైందో తెలియదు కానీ... ఉన్నట్టుండి ఆ సినిమా ఆగిపోయింది. రామ్‌చరణ్‌కీ, కొరటాలకీ మధ్య కథ విషయంలో విబేధాలు రావడంతోనే అలా జరగిందని మాట్లాడుకొన్నారు. అంతలో కొరటాల మహేష్‌ని ఒప్పించి `శ్రీమంతుడు` చేశాడు. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అవ్వడంతో మళ్లీ కొరటాల, రామ్‌చరణ్ కాంబో వార్తల్లోకొచ్చింది. నిజానికి శ్రీమంతుడు తర్వాత కొరటాల కూడా రామ్‌చరణ్‌తో సినిమా చేయాలనే అనుకొన్నాడట. కానీ రామ్‌చరణ్ వేరే ప్రాజెక్టులతో బిజీ అయిపోయాడు. దీంతో ఎన్టీఆర్‌తో `జనతా గ్యారేజ్` చేశాడు కొరటాల. ఈ చిత్రం తర్వాతైనా రామ్‌చరణ్ తనతో సినిమా చేస్తాడనుకొంటే మళ్లీ సుకుమార్ దర్శకత్వంలో సినిమాని షురూ చేసేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయంలో రామ్‌చరణ్‌పై కొరటాల అలిగాడని వార్తలొస్తున్నాయి. ఇకపై రామ్‌చరణ్ పిలిచి మరీ సినిమా చేయమని అడిగినా చేయకూడదని కొరటాల నిర్ణయించుకొన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ కొరటాల సన్నిహితులు, మెగా కాంపౌండ్ వర్గాలు మాత్రం అలాంటిదేమీ లేదని అంటున్నారు. సమయం కలిసొచ్చినప్పుడు ఆ కాంబోలో సినిమా తప్పకుండా ఉంటుందంటున్నారు. అయితే భేదాభిప్రాయాలకి సంబంధించిన రూమర్లు మాత్రం కొరటాలతో రామ్‌చరణ్ సినిమా చేసే వరకు ఆగేలా లేవు.