Advertisementt

ర‌జ‌నీతో అల్లుడి సినిమా... ఫిక్స్‌!

Tue 30th Aug 2016 11:42 AM
rajanikanth,dhanush,dhanush to produce rajanikanth,pa ranjith news movie  ర‌జ‌నీతో అల్లుడి సినిమా... ఫిక్స్‌!
ర‌జ‌నీతో అల్లుడి సినిమా... ఫిక్స్‌!
Advertisement
సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ అల్లుడు ధ‌నుష్ ఎంత మంచి న‌టుడో... అంత మంచి నిర్మాత కూడా. వండ‌ర్ బార్ ఫిల్మ్స్ పేరుతో ఓ సంస్థ‌ని ఏర్పాటు చేసి వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. ఆ సంస్థ నుంచి సినిమా వ‌స్తోంద‌న‌గానే అంచ‌నాలు ఆకాశాన్నంటుతుంటాయి. త‌న‌దైన టేస్ట్‌తో సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంటాడు ధ‌నుష్‌. ఇప్పుడు మామ ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా త‌న నిర్మాణంలో ఓ సినిమా చేయ‌డానికి రంగం సిద్ధం చేశాడు. ప్ర‌స్తుతం ర‌జ‌నీ రోబో2.0 చేస్తున్నాడు. ఆ చిత్రం పూర్త‌వ్వ‌గానే ధ‌నుష్ నిర్మాణంలో సినిమా కోసమే రంగంలోకి దిగుతాడ‌ట ర‌జ‌నీ. మామ‌తో అల్లుడు సినిమా నిర్మిస్తుండడం ఒకెత్తైతే, ఆ చిత్రానికి క‌బాలి ఫేమ్ పా.రంజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌డం మ‌రో విశేషం. ధ‌నుష్ ఆ విష‌యాన్ని టీజ‌ర్ రూపంలో ట్విట్ట‌ర్‌లో ప్ర‌క‌టించ‌గానే అభిమానులు ఆనందంతో కేరింత‌లు కొట్టినంత ప‌ని చేశారు. ఇంత‌కంటే క్రేజీ కాంబినేష‌న్ మ‌రొక‌టి ఉండదంటూ మాట్లాడుకొంటున్నారు. వ‌చ్చే యేడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవ‌కాశాలున్నాయి. మ‌రి అది క‌బాలి2 గా తెరకెక్కుతుందా లేదంటే, వేరొక కొత్త క‌థ‌తో తెర‌కెక్కుతుందా అన్న‌ది చూడాలి. 
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement