Advertisementt

టాలీవుడ్ తాజా అప్ డేట్స్..!

Thu 25th Aug 2016 03:50 PM
jo achyutananda release date,prabhas araku road lo,rama naidu manalo okadu,banthipoola janaki,pichiga nachav poster response,tollywood tajaa updates  టాలీవుడ్ తాజా అప్ డేట్స్..!
టాలీవుడ్ తాజా అప్ డేట్స్..!
Advertisement
Ads by CJ

1. హీరో ప్రభాస్‌ చేతుల మీదుగా 'అరకురోడ్‌లో' సాంగ్‌ టీజర్‌ విడుదల 

రామ్‌ శంకర్‌, నిఖిషా పటేల్‌ హీరో హీరోయిన్లుగా శేషాద్రి క్రియేషన్స్‌ పతాకంపై వాసుదేవ్‌ దర్శకత్వంలో మేకా బాలసుబ్రహ్మణ్యం, బి. భాస్కర్‌, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్కా లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం 'అరకురోడ్‌లో'. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని ఆడియో విడుదలకు సిద్దంగా ఉంది. ఈ చిత్ర సాంగ్‌ టీజర్‌ను యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ మాట్లాడుతూ..'ఎప్పుడురా పెళ్లి..' అనే ఈ సాంగ్‌ నా గురించే రాసినట్లుంది. లిరిక్స్‌ చాలా క్యాచీగా ఉన్నాయి. సాంగ్‌ చాలా వెరైటీగా ఉంది. సహజంగా పూరీ గారు తన సినిమాలలో ట్యూన్స్‌, లిరిక్స్‌ ఆయనే రాస్తుంటారు. అలాగే ఈ చిత్ర దర్శకుడు వాసుదేవ్‌ కూడా మల్టీ టాలెంటెడ్‌లా కనిపిస్తున్నాడు. ఈ సాంగ్‌ అదిరిపోయింది. సినిమా కూడా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను..అని అన్నారు. 

చిత్ర దర్శకుడు వాసుదేవ్‌ మాట్లాడుతూ..'గెడ్డం తెల్లబడి పోతావుందే..' అనే లిరిక్‌తో సాగే సాంగ్‌ టీజర్‌ను మా కోరిక మేరకు బాహుబలి, యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ గారు ఫిల్మ్‌ సిటీలోని బాహుబలి సెట్‌లో ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మా టీమ్‌ అందరి తరుపున ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ పాటని నేను, రామాంజనేయులు కలిసి రాయడం జరిగింది. ప్రస్తుతం చిత్ర షూటింగ్‌ మొత్తం పూర్తయింది. సెప్టెంబర్‌ 10న సినీ ప్రముఖుల సమక్షంలో హైద్రాబాద్‌లో గ్రాండ్‌గా ఆడియో ఆవిష్కరణ జరుపనున్నాం. పూరీ సంగీత్‌ ద్వారా పాటలు మార్కెట్‌లోకి విడుదలకానున్నాయి...అని అన్నారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో హీరో రామ్‌శంకర్‌, నిర్మాత మేకా బాలసుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. 

రామ్‌శంకర్‌, నిఖిషా పటేల్‌, కమల్‌ కామరాజు, అభిమన్యు సింగ్‌, కోవై సరళ, థర్టీ ఇయర్స్‌ ఫృథ్వీ, కృష్ణ భగవాన్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సాహిత్యం: వాసుదేవ్‌, రామాంజనేయులు; ఎడిటర్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌, సంగీతం:వాసుదేవ్‌, రాహుల్‌రాజ్‌; డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: జగదీశ్‌ చీకటి, నిర్మాతలు: మేకా బాలసుబ్రహ్మణ్యం, బి. భాస్కర్‌, వేగిరాజు ప్రసాదరాజు, రామేశ్వరి నక్కా; రచన, దర్శకత్వం: వాసుదేవ్‌.

2. మీడియా మొఘ‌ల్ రామోజీరావు చేతుల మీదుగా 'మనలో ఒకడు' టీజ‌ర్ విడుద‌ల‌

ఆర్పీ ప‌ట్నాయ‌క్ న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన 'మ‌న‌లో ఒక‌డు' టీజ‌ర్ ను బుధ‌వారం హైద‌రాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో మీడియా మొఘ‌ల్ రామోజీరావు విడుద‌ల చేశారు. ఈ చిత్రాన్ని యూనిక్రాఫ్ట్ మూవీ పతాకంపై జి.సి. జగన్ మోహన్ నిర్మిస్తున్నారు. ఇందులో 'నువ్వు నేను' ఫేం అనితా హెచ్. రెడ్డి కథానాయికగా న‌టించారు. 

ఆర్పీ ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ..'మా సినిమా మీడియా నేప‌థ్యంలో సాగుతుంది. మా టీజ‌ర్‌ను మీడియా మొఘ‌ల్ రామోజీరావుగారు విడుద‌ల చేయ‌డం చాలా ఆనందంగా ఉంది. షూటింగ్ పూర్త‌యింది. కృష్ణ‌మూర్తి అనే సామాన్య అధ్యాప‌కుడి క‌థ ఇది. కొన్ని య‌థార్థ ఘ‌ట‌న‌ల ఆధారంగా అల్లుకున్నాం'..అని అన్నారు. 

నిర్మాత జగన్ మోహన్ మాట్లాడుతూ....'రామోజీరావుగారి చేతుల మీదుగా టీజ‌ర్ విడుద‌ల కావ‌డం మా అదృష్టం. ఆయ‌న టీజ‌ర్‌ని విడుద‌ల చేయ‌డ‌మే కాకుండా మా యూనిట్ స‌భ్యుల్ని ఆశీర్వ‌దించారు. ప్ర‌స్తుత స‌మాజంలో మీడియా పాత్ర ఏంటో మ‌నందరికీ తెలుసు. అలాంటి మీడియా నేప‌థ్యంలో సాగే క‌థ‌తో ఈ సినిమాను తెర‌కెక్కించాం. ఈ నెల 27న పాట‌ల్ని విడుద‌ల చేస్తాం. షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టిస్తాం'.. అని చెప్పారు. 

సాయికుమార్ మాట్లాడుతూ...'రామోజీరావుగారి స‌మ‌క్షంలో చిత్ర టీజ‌ర్ విడుద‌లైనందుకు సంతోషంగా ఉంది. ఈ చిత్రంలో నేను చాలా మంచి పాత్ర‌లో న‌టించాను. త‌ప్ప‌కుండా అంద‌రినీ అల‌రించ‌డ‌మే కాకుండా ఆలోచింప‌జేసే సినిమా అవుతుంది...' అని తెలిపారు. 

ఈ కార్య‌క్ర‌మంలో న‌టుడు జెమిని సురేశ్‌, కెమెరామేన్ ఎస్‌.జె.సిద్ధార్థ్‌, స‌హ నిర్మాత‌లు ఉమేశ్ గౌడ‌, బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, క్రియేటివ్ హెడ్ గౌత‌మ్ ప‌ట్నాయ‌క్‌, గేయ ర‌చ‌యిత పుల‌గం చిన్నారాయ‌ణ త‌దిత‌రులు పాల్గొన్నారు. 

3. క్యూరియాసిటీ పెంచుతున్న 'పిచ్చిగానచ్చావ్' పోస్టర్ 

హీరో నాని చేతులమీదుగా రిలీజ్ అయిన శ్రీవత్స క్రియేషన్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఫిలిం పిచ్చిగా నచ్చావ్ పోస్టర్ కు సర్వత్రా మంచి రెస్పాన్స్ వస్తోంది. నాని చెప్పినట్టుగానే కథ , ఆర్టిస్ట్ లు ఎక్కడా రివీల్ కాకుండా క్యాచీ టైటిల్, ఇంట్రెస్టింగ్ కలర్స్ తో రూపొందిన పోస్టర్  చూడగానే అందర్నీ ఆకట్టుకొంటోంది. 

ఈ సందర్బంగా నిర్మాత కమల్ కుమార్ పెండెం మాట్లాడుతూ.. మారిన ప్రేక్షకుల టేస్ట్ కు యిది ఎక్జామ్పుల్ అని, కొత్తగా ఉంటే చాలు ఇమీడియట్ గా ఆడియన్స్ సినిమాకు కనెక్ట్ అవుతున్నారని, దానికితోడు నాని రిలీజ్ చేయడంతో ఫస్ట్ లుక్ పోస్టర్ కు యింకా ఎక్కువ రెస్పాన్స్ వచ్చిందని, పోస్టర్ లానే సినిమా కూడా అందరికీ నచ్చుతుందని చెప్పారు. 

డైరెక్టర్ వి. శశి భూషణ్ మాట్లాడుతూ... పోస్టర్ ఎంత క్యూరియాసిటీను పెంచిందో, రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న సినిమా కూడా  డిఫరెంట్ బ్యాక్డ్రాప్ లో, ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే తో రన్ అవుతూ అందరూ ఫుల్ ఎంజాయ్ చేసేలా ఉంటుందన్నారు. సంజీవ్, నందు, కారుణ్య మెయిన్ లీడ్ చేస్తున్న సినిమా ద్వారా కామెడీ ఆర్టిస్ ఉత్తేజ్ కూతురు, 'చిత్రం, బద్రి' సినిమాలో చైల్డ్ ఆర్టిస్ గా చేసిన చేతన మరో ఫిమేల్ లీడ్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నది . పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకొంటున్న సినిమాకు కెమెరా వెంకట హనుమ, మ్యూజిక్ రామ్ నారాయణ్, ఎడిటింగ్ సత్య, ప్రొడక్షన్ కంట్రోలర్ పుచ్ఛా రామకృష్ణ .

4. ‘బంతిపూల జానకి’ భలే ఎంటర్‌టైన్‌ చేస్తుంది- చిత్ర బృందం 

రొమాంటిక్‌ కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ‘బంతిపూల జానకి’ అన్ని వర్గాల ప్రేక్షకులను చక్కగా ఎంటర్‌టైన్‌ చేస్తుందని, సినిమా చూసిన వాళ్ళంతా ‘భలే ఉందని’ మెచ్చుకొంటారని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. ఉజ్వల క్రియేషన్స్‌ పతాకంపై నెల్లుట్ల ప్రవీణ్‌ చందర్‌ దర్శకత్వంలో కళ్యాణి-రామ్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 

ధన్‌ రాజ్‌, దీక్షాపంథ్‌, షకలక శంకర్‌, చమ్మక్‌ చంద్ర, సుడిగాలి సుధీర్‌, అదుర్స్‌ రఘు, వేణు తదితరులు ‘బంతిపూల జానకి’లో ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం విడుదలను పురస్కరించుకుని ఫిలిం చాంబర్ ప్రివ్యూ ధియేటర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చిత్ర నిర్మాత రామ్, దర్శకుడు నెల్లుట్ల ప్రవీణ్‌చందర్‌, కథానాయకుడు ధన్‌ రాజ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ తేజ, సంగీత దర్శకుడు బోలే, రచయిత శేఖర్‌ విఖ్యాత్‌, ఎడిటర్‌ శివ వై ప్రసాద్‌ తోపాటు ముఖ్య అతిథిగా ప్రముఖ నటులు, సెన్సార్‌ బోర్డ్‌ మెంబర్‌ శివాజీరాజా పాల్గొన్నారు.

‘బంతిపూల జానకి’ చిత్రాన్ని చూసిన సెన్సార్‌ బోర్డ్‌ మెంబర్స్‌లో తనూ ఒకడినని, ఈ చిత్రం తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని శివాజీరాజా అన్నారు. ‘పెళ్ళిచూపులు’ సినిమా తరహాలో ‘బంతిపూల జానకి’ కూడా బిగ్‌ సక్సెస్‌ సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు. 

నిర్మాతగా ‘బంతిపూల జానకి’ తనకు తొలి చిత్రమని, తొలి చిత్రంతోనే ఘన విజయం అందుకోనుండడం చాలా ఆనందాన్నిస్తోందని ఉజ్వల క్రియేషన్స్‌ అధినేత రామ్‌ అన్నారు. దర్శకుడిగా తనకిది రెండో చిత్రమని, ఈ చిత్రం దర్శకుడిగా తనకు మంచి గుర్తింపునిచ్చి, తనకు అవకాశాలు తెచ్చిపెడుతుందనే నమ్మకముందని చిత్ర దర్శకుడు ప్రవీణ్‌చందర్‌ పేర్కొన్నారు. 

హీరో ధన్‌ రాజ్‌ మాట్లాడుతూ.. ‘బంతిపూల జానకి’ కథను నమ్మి ఈ చిత్రంపై కోటిన్నర ఖర్చు చేసి, మరో అరకోటి ప్రచారం నిమిత్తం ఖర్చు చేస్తున్నారు నిర్మాతలు. శేఖర్‌ విఖ్యాత్‌ సూపర్బ్‌ స్టోరీతోపాటు డైలాగ్స్‌ ఇచ్చాడు. బోలే బ్రహ్మాండమైన మ్యూజిక్‌ చేశారు. శివ చక్కగా ఎడిట్‌ చేశారు. మా ఎగ్జిక్యూట్‌ ప్రొడ్యూసర్‌ తేజ ఎక్స్‌లెంట్‌గా ఎగ్జిక్యూట్‌ చేశారు. వీళ్ళందరికి ‘బంతిపూల జానకి’ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది...అన్నారు. 

‘బంతిపూల జానకి’ చిత్రానికి పని చేసే అవకాశం రావడం పట్ల రైటర్‌ శేఖర్‌ విఖ్యాత్‌, మ్యూజిక్‌ డైరెక్టర్‌ బోలే, ఎడిటర్‌ శివ సంతోషం వ్యక్తం చేశారు. 26న విడుదవుతున్న ‘బంతిపూల జానకి’ ఘనవిజయం సాధిస్తుందనడంలో తమకెలాంటి సందేహాలు లేవని ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ తేజ అన్నారు.

రాకెట్‌ రాఘవ, డా॥భరత్‌రెడ్డి, జీవన్‌, కోమలి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: జి.ఎల్‌.బాబు, పాటలు: కాసర్ల శ్యామ్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: తేజ, నిర్మాతలు: కళ్యాణి-రామ్, స్క్రీన్‌ ప్లే-దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్‌ చందర్‌!

5. ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 9న విడుద‌ల‌వుతున్న 'జ్యో అచ్యుతానంద‌'

నారా రోహిత్, నాగశౌర్య, రెజీనా కసండ్ర హీరో హీరోయిన్లుగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో  వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయికొర్రపాటి నిర్మిస్తున్న చిత్రం 'జ్యో అచ్యుతానంద'. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబ‌ర్ 9న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈ సంద‌ర్భంగా ...

చిత్ర ద‌ర్శ‌కుడు అవ‌స‌రాల శ్రీనివాస్ మాట్లాడుతూ..'నారారోహిత్‌, నాగ‌శౌర్య‌, రెజీనాల మ‌ధ్య జ‌రిగే క్యూట్ ఫ్యామిలీ ల‌వ్ ఎంట‌ర్ టైన‌ర్‌. ట్రైల‌ర్ చూసిన‌వారు అచ్యుత్ గా నారా రోహిత్‌, ఆనంద్‌గా నాగ‌శౌర్య‌ల మధ్య కెమిస్ట్రీ బాగా ఉందని మెచ్చుకున్నారు. ముగ్గురు వ్య‌క్తుల మ‌ధ్య జ‌రిగే సున్నిత‌మైన క‌థాంశం. ఎమోష‌న్స్‌, ఎంట‌ర్‌టైన్మెంట్ క‌ల‌గ‌లిసి ఉంటుంది. అలాగే నా ద‌ర్శ‌క‌త్వంలో గ‌తంలో వ‌చ్చిన ఊహ‌లు గుస‌గుస‌లాడే సినిమాకు భిన్నంగా ఉండే సినిమా. ప్ర‌తి సీన్ ఎగ్జ‌యిటింగ్‌గా అనిపిస్తుంది. క‌ల్యాణ్ ర‌మ‌ణ గారు ఎక్స‌లెంట్ మ్యూజిక్ ఇచ్చారు. పాట‌లు బావున్నాయని అంద‌రూ అప్రిసియేట్ చేస్తున్నారు. అలాగే థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు కూడా చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది'.. అన్నారు. 

వారాహిచ‌ల‌న చిత్రం అధినేత సాయికొర్ర‌పాటి మాట్లాడుతూ...మా బ్యాన‌ర్‌లో రూపొందిన ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ 'జ్యో అచ్యుతానంద‌' సినిమా చూస్తున్నంత సేపు ప్లెజెంట్ ఫీల్ ఉంటుంది. అన్నీ ఎలిమెంట్స్ ఉన్న డిఫ‌రెంట్ మూవీ. సినిమాకు సంబంధించిన సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి వ‌ర‌ల్డ్ వైడ్‌గా సెప్టెంబ‌ర్ 9న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం.. అన్నారు

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ