Advertisementt

'ప్రేమమ్' కి అన్నీ భలే కలి సొచ్చాయి..!

Wed 24th Aug 2016 07:20 PM
premam,akkineni naga chaitanya,premam movie updates,premam movie release details,premam telugu movie  'ప్రేమమ్' కి అన్నీ భలే కలి సొచ్చాయి..!
'ప్రేమమ్' కి అన్నీ భలే కలి సొచ్చాయి..!
Advertisement
Ads by CJ

 చైతన్య అక్కినేని 'ప్రేమమ్'  వీడియో పాట  ఆగస్టు  29 - ఆడియో సెప్టెంబర్ 20 -  దసరా కు చిత్రం విడుదల 

చైతన్య అక్కినేని, శ్రుతిహాసన్,మడొన్నాసెబాస్టియన్,అనుపమ పరమేశ్వరన్ ల  కాంబినేషన్ లో, దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో యువ నిర్మాత సూర్యదేవర నాగవంశీ  ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’ పతాకంపై పి.డి.వి ప్రసాద్ సమర్పణలో నిర్మిస్తున్న చిత్రం 'ప్రేమమ్'. 

ప్రస్తుతం చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ...'ఈ చిత్రం లోని ఒక పాటను  ఇటీవల ఎఫ్.ఎం. స్టేషన్ లో విడుదల చేసిన విషయం విదితమే. 'ఎవరే ..' అంటూ సాగే ఈ గీతాన్ని గీత రచయిత శ్రీమణి రచించగా, గాయకుడు విజయ్ ఏసుదాస్ ఆలపించారు. ఈ గీతం ఇప్పటికే లక్షలాది మంది సంగీత ప్రియులను అలరించింది. 

యువసామ్రాట్ 'అక్కినేని నాగార్జున' పుట్టిన రోజు కానుకగా పాట వీడియో.. 

యువసామ్రాట్ 'అక్కినేని నాగార్జున' (ఆగస్టు 29) పుట్టిన రోజు కానుకగా 'ఎవరే' పాట వీడియో ను విడుదల చేస్తున్నట్లు నిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు.

అక్కినేని నాగేశ్వరరావు జయంతి రోజున ఆడియో:

స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారి జయంతి, సెప్టెంబర్ 20న 'ప్రేమమ్' ఆడియోను అక్కినేని వంశాభిమానుల సమక్షంలో,చిత్ర ప్రముఖుల సమక్షంలో వైభవంగా జరుపనున్నాము.

'దసరా' కానుకగా 'ప్రేమమ్'

 ప్రేమతో కూడిన సంగీత భరిత దృశ్య కావ్యం అయిన ఈ చిత్రాన్ని అక్టోబర్ లో 'దసరా పండుగ' కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని  తెలిపారు.  

ఈ సందర్భంగా చిత్ర కథానాయకుడు చైతన్య అక్కినేని మాట్లాడుతూ.. 'నా మనసుకు బాగా హత్తుకున్న చిత్రం ఇది, ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది 'ప్రేమమ్' అన్నారు. 

చిత్రంలోని ఇతర తారాగణం ఈశ్వరీరావు,జీవా, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి,పృథ్వి,నర్రాశ్రీను, ప్రవీణ్, చైతన్యకృష్ణ, అరవిందకృష్ణ , సత్య,కార్తీక్ ప్రసాద్, నోయల్, జోగి బ్రదర్స్.

ఈ చిత్రానికి సంగీతం; గోపిసుందర్, రాజేష్ మురుగేషన్, పాటలు: రామజోగయ్య శాస్త్రి,వనమాలి, శ్రీమణి, పూర్ణ, కృష్ణ మాదినేని; చాయా గ్రహణం: కార్తీక్ ఘట్టమనేని, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు; ఆర్ట్: సాహి సురేష్; ఒరిజినల్ స్టోరి: ఆల్ఫోన్సె పుధరిన్; సమర్పణ: పి.డి.వి. ప్రసాద్, నిర్మాత:  సూర్యదేవర నాగవంశీ, స్క్రీన్ ప్లే - మాటలు - దర్శకత్వం: చందు మొండేటి

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ