సెప్టెంబర్ 1న జనతా గ్యారేజ్ గ్రాండ్ రిలీజ్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా, సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో మైత్రీ మూవీస్ సంస్థ నిర్మించిన భారీ చిత్రం 'జనతా గ్యారేజ్'. ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యా మీనన్ లు కథానాయికలు గా కనిపిస్తారు. ప్రఖ్యాత మళయాళం నటుడు మోహన్ లాల్ ఈ చిత్రం లో ఒక ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. సోమవారం తో షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసుకున్న జనతా గ్యారేజ్ ప్రపంచవ్యాప్తం గా సెప్టెంబర్ 1 న భారీ స్థాయిలో విడుదల అవుతుంది అని చిత్ర బృందం తెలిపింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో నే అత్యధిక థియేటర్ లలో విడుదలకు సిద్ధం అవుతోంది.
దర్శకులు కొరటాల శివ మాట్లాడుతూ..చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ యూనిట్ తో పని చేయటం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. జనతా గ్యారేజ్ చిత్రం ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తుంది అన్న నమ్మకం ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ లో ఉన్న నటుడికి, అయన మాస్ ఇమేజ్ కి సరిపడే కథ ఇది. చాలా పెద్ద స్పాన్ ఉన్న ఒక హైలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ ఈ చిత్రం. సెప్టెంబర్ 1 న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మా నిర్మాతలు సిద్ధ పడుతున్నారు.. అని తెలిపారు.
నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, మోహన్ (C.V. M.) లు మాట్లాడుతూ..యంగ్ టైగర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చే ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాం. భారీ తారాగణంతో, మంచి పవర్ఫుల్ సబ్జెక్టు తో దర్శకులు కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సెప్టెంబర్ 1 న భారీ స్థాయి లో ప్రపంచవ్యాప్తం గా ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. మా బ్యానర్ లో ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ గా నిలుస్తుంది అని అనుకుంటున్నాం..అని తెలిపారు.