Advertisementt

కాజల్ ఏం చేసిందో తెలుసా..?

Thu 18th Aug 2016 07:20 PM
kajal agarwal,ajith new movie,social media pics,akshara hassan,director siva  కాజల్ ఏం చేసిందో తెలుసా..?
కాజల్ ఏం చేసిందో తెలుసా..?
Advertisement
Ads by CJ

శివ దర్శకుడుగా హీరో అజిత్ నటిస్తున్న చిత్ర షూటింగ్ ఐరోపాలో  జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో అనుష్కని కాదని మరీ కాజల్ ని నాయికగా ఎంపిక చేశారు. అదీ కూడా తెలిసిందే. కానీ కాజల్ సరదాగా ట్విట్టర్ లో ఫాలోవర్స్ ని పెంచుకోవడంలో భాగంగా చాలా పెద్ద తప్పే చెసేసింది. ఈ చిత్రంలో కమల్ హాసన్ కుమార్తె అక్షర హాసన్ కూడా హీరోయిన్ గా నటిస్తుంది. కానీ కాజల్ అలవాటులో పొరపాటుగా ఈ చిత్రంలో నటిస్తున్న ఫోటోలతో కూడిన ఫోజులను ట్విట్టర్ లో పెట్టేసింది. ఇంకేముంది, గుట్టు  బయటకు పాకిపోయింది. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.  అజిత్ కు జంటగా బెంగాలీ బ్యూటీగా నటిస్తున్న కాజల్ ఆ చిత్రంలోని ఓ గెటప్ లో ఇలా ఉంటాను అన్నట్లుగా ట్విట్టర్ పోస్టు చేయడంతో ఆ చిత్ర దర్శకుడు శివకు మండింది. దాంతో కాజల్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారని సమాచారం.  

అసలే ఈ మధ్య అడపా దడపాగా అవకాశాలు వస్తుండటంతో కాజల్ ముందుగానే అభిమానులను పెంచుకునే పనిలో పడినట్టుంది. శివ దిమ్మతిరిగేలా క్లాస్ పీకడంతో కాస్త జోరు తగ్గించుకొని నిరుత్సాహంలో ఉన్నదట కాజల్. ఇంకెప్పుడూ చిత్ర బృందానికి తెలియకుండా ఇటువంటి పనులకు పాల్పడితే బాగోదని కూడా చెప్పేశాడట దర్శకుడు. దీంతో దిమ్మ తిరిగిన కాజల్ కు సంజాయిషీ ఇచ్చుకోవటం తన వంతైంది. ఇప్పుడు ఈ షాక్ అక్షర హాసన్ కు కూడా తగిలిందట. ఒక్క దెబ్బతో ఆ ఇరువురి భామలకు తెలిసొచ్చినట్టయింది.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ